Sunday, June 29, 2014

నిష్కల్మషత్వాన్ని చూసా .... నీలో




ఏ అమృతమూర్తో కాదనుకుని
చెత్తబుట్టలోకి విసిరేసిన పసి ఊపిరి ప్రాణం నాది
అప్పటి వరకూ
ఒంటరినే నేను
తప్పిపోయి, గమ్యమూ దారి తెలియని అనాధను

అమ్మే కాదనుకుందన్న బాధ
గుర్తుకొచ్చిన ప్రతిసారీ
కళ్ళు నీళ్ళతో నిండిపోయి
అంతా అనిశ్చితి
చుట్టూ మసక మసగ్గా సమాజం

బోరున కురుస్తుంది  వర్షం
మార్గం సరిగ్గా చూడలేను.
సరిగా అప్పుడే .... దూరంగా నీవు కనిపించావు
పల్లెటూరి అబ్బాయివిలా
చీకటి అయోమయం లో కొట్టుకుంటున్న నాకు
ఒక ఆశాదీపం లా

నిన్ను చూస్తూనే మొదట భయం వేసింది.
నీవు దగ్గరగా వస్తుంటే
గుండె వేగంగా కొట్టుకుంది
అంతకుముందు
ఎందరో స్వార్ధ సంకుచిత మనస్కుల్ని చూసుండటం వల్ల

మెల్లగా అనునయంగా, నిష్కల్మషం గా మాట్లాడావు
నీ మాటలు
నాలో నమ్మకం, ధైర్యాన్ని నింపి ....
నువ్వందించిన చెయ్యందుకోవాలనిపించింది.
నా హృదయమే నీదైనట్లు ....

ఇప్పుడు, నాకు సమాజము, విషపు జీవులు అంటే
ఎలాంటి భయమూ లేదు
ప్రకాశవంతమైన నీ సాహచర్యంలో
నా గమ్యం నాకు స్పష్టంగా కనిపిస్తుంది
నా జీవనయానం లో నాకో దిక్చూచి దొరికిన అనుభూతి

4 comments:

  1. హలాహలం నిండిన సమాజాన అమృతమూ ఉందని నిరూపించారు.
    చక్కటి కవిత సర్.

    ReplyDelete
    Replies
    1. హలాహలం నిండిన సమాజాన అమృతమూ ఉందని నిరూపించారు.
      చక్కటి కవిత సర్.
      చక్కని స్పందన స్నేహ ప్రోత్సాహక అభినందన
      ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు! శుభమధ్యాహ్నం!!

      Delete
  2. చుట్టూ మసక మసగ్గా సమాజం

    సమాజమెప్పుడూ మసక మసకగానే వుంటుందని ఎంత చక్కగా చెప్పకనే చెప్పారు .

    అనునయం , నిష్కల్మషత్వం ఎంతటి మనోవేదననైనా మటుమాయం చేయగలదన్నది మరిచిపోకూడదని బహు చక్కగా కవితద్వారా సెలవిచ్చిన వైనం కమనీయం .

    ReplyDelete
    Replies
    1. చుట్టూ మసక మసగ్గా సమాజం

      సమాజమెప్పుడూ మసక మసకగానే వుంటుందని ఎంత చక్కగా చెప్పకనే చెప్పారు .

      అనునయం , నిష్కల్మషత్వం ఎంతటి మనోవేదననైనా మటుమాయం చేయగలదన్నది మరిచిపోకూడదని బహు చక్కగా కవితద్వారా సెలవిచ్చిన వైనం కమనీయం.

      ఎంత చక్కని విశ్లేషణ. హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. మీ స్పందన ద్వారా గొప్ప ప్రోత్సాహక స్పూర్తిని పొందగలుగుతున్నాను.
      మీకు నా సుప్రభాత ధన్యాభివాదాలు శర్మ గారు!

      Delete