Monday, February 22, 2016

అమూల్యత ఆపాదించుకునేందుకుఎక్కడని కనుగొనగలను
నా అనుభూతుల ప్రతిధ్వనులను

నీ హృదయం లోనా
ఎక్కడ .... ఉనికిని కోల్పోయానో
అక్కడ .... లేక,
నీ కనుపాపల్లో నా
నాకు నేను స్పష్టంగా కనిపిస్తానా 
చూడగలనా ....
మూసిన నీ చేతులను విప్పి
లేక,
ఆ మూసిన చేతులే
నాకు స్వేచ్చను ప్రధానించునాఎక్కడని శోధించను
నీ నా స్వరాల ప్రతిద్వనులను
వినగలను .... ఎక్కడని చూడగలను.