Wednesday, May 7, 2014

పూలవనం జీవనం




ఎంత అందం సుకుమారంగా ఉన్నావో ....
నా కళ్ళకు
నీవు,
ఆ దివి నుండి దిగివచ్చిన దేవతవు లా

ఎలా తెలుసుకున్నానో .... ఈ నిజాన్ని
ఈ ప్రేమను, నా ఎద భావనలను
ఈ పరిమళం, ఈ పరవశం మదిలో
ఒక స్నేహం గా మొదలై .... నేడు

తెలుసుకున్నాను.
నా ప్రేమవు నీవనే పవిత్ర, పరిపూర్ణభావన
నీ అన్నీ నాకే చెందాలి అనే మనోబిలాష
ఆశ, తపన ను

సాయం సమయాల్లో అనిపిస్తుంటుంది.
అనుకుంటుంటాను
మనం కలవాలి ....
కలిసి అలాగే ఉండిపోవాలి అని

నీ పేరును ఒక పువ్వును లా త్రుంచి పలుకుతున్నప్పుడు
ఏదో ప్రత్యేకత .... నా అనే అధికారం
నాతో కలిసి నీవు సరదాగా
నలుగురూ ఈర్ష్యపడేలా నడవాలి అని,

ఎప్పుడూ
కష్టమే అనిపించినా
నిజాయితీగా ఉండాలని
నీ పట్ల .... ఈ జీవితం కడవరకూ అని

ఈ నిజాన్ని, నన్నూ విడమర్చి ....
కాలమైనా, పంచభూతాలైనా
నీకు నివేదించాలని
నా మనోభావనలను .....

కేవలం ప్రేమభావనలే .... నా ఊహల్లో నీవుంటే
హృదయ రాగ సరాగాలే అన్నీ
నీ చిరునవ్వు పూపరిమళాల కోసం
నిన్ను చేరువ కావడం కోసమే అన్నట్లు

ఈ మనసెప్పుడూ
నీ ఆలోచనలతో, నీ గురించే
ఆ ప్రత్యేకత ను విడమర్చలేను
నా ప్రేమ, అపరిమితం నీ పట్ల అనగలగడం మినహా




నా తపస్సు
ఈ ప్రేమయజ్ఞం ఫలించాలని
నీ ఎదలో ఒద్దికగా మౌనంగా ఉండాలని
నా మది ఎదల సంతులనం చేసుకుంటున్నాను.

ఏ స్వప్నలోకాలనుంచో
దిగివచ్చిన చెలీ
కేవలం నా పక్కన నీవుంటే చాలు ....
ఎంత అందమో, ఎంత మనోహరమో .... ఈ జీవితం

4 comments:

  1. Replies
    1. సూపర్బ్ సర్

      బాగుంది స్పందన ఆత్మీయ ప్రోత్సాహకర అభినందన
      నమస్సులు పద్మార్పిత గారు!

      Delete
  2. కవితా భావం పారిజాతపూవులంత సుకుమారంగా ఉంది చంద్రగారు.

    ReplyDelete
    Replies
    1. కవితా భావం
      పారిజాతపు పూవులంత సుకుమారంగా
      ఉంది చంద్రగారు.

      బాగున్నది అభినందన సుమ గంధాలను వెదజల్లుతూ స్పందన
      ధన్యాభివాదాలు శ్రీదేవీ!!

      Delete