Sunday, May 11, 2014

మనం




ఏనాడో కలిసుండాల్సింది
కలిసి ఉండకపోవడమే, ఆశ్చర్యంగా ఉంది.
ఆ వెన్నెల వికసించే వేళ
నీవు,
నేను లేని బాధను
విరహ వేదన అనుభవిస్తున్నావు కదూ!
గాఢంగా ....,
చీకటి పొరల్ని, చకోరాల్ని
మృదువుగా స్పర్శించాలని
మదనపడుతున్నావు కదూ ....
నాలా
తల దాచుకుని
ఏ నక్షత్రాల నీడలోనో
మరో ఉదయం ప్రశ్నించే ప్రశ్నల సమాధానాలను
ఒంటరితనాన్ని ఎదుర్కోవడం ఇష్టం లేక,



నీకు
ఇక అంత అవసరం,
ఒంటరిగా ఉండాల్సిన స్థితి ఉండదు.
ఇద్దరం, ఇకపై
ఒకే కల కందాము.
ఒకే దుప్పటి పంచుకుందాము.
ఒకే కోరిక, ఒకే అవసరం .... ఒకే గాలిని శ్వాసిద్దాం!
బాహువులను తోడుంచుకుని 
ఒకరికొకరం చేరువయ్యేందుకు
గుండెను గుండెకు హత్తుకుని 
స్థిమితతను కలిగించుకునేందుకు ఉపక్రమించుదాం!

8 comments:

  1. గుండెను గుండెకు హత్తుకుని.....heart touching

    ReplyDelete
    Replies
    1. గుండెను గుండెకు హత్తుకుని.....
      హార్ట్ తచ్చింగ్

      హృదయాన్ని హత్తుకునే లా
      బాగుంది స్పందన అభినందన
      ధన్యవాదాలు పద్మార్పిత గారు! శుభసాయంత్రం!!

      Delete
  2. ఈ మనం లోనే ఎంత దగ్గరితనమో.,
    చాలా నిర్మలంగా ఉంది కవిత.

    ReplyDelete
    Replies

    1. ఈ మనం లోనే ఎంత దగ్గరితనమో.,

      చాలా నిర్మలంగా ఉంది కవిత

      నిర్మలమైన భావన స్పందన స్నేహాభినందన
      నమస్సులు మెరాజ్ ఫాతిమా గారు! శుభసాయంత్రం!!

      Delete
  3. ఇద్దరం, ఇకపై
    ఒకే కల కందాము.
    చాలా బాగుంది చంద్రగారు.

    ReplyDelete
    Replies
    1. ఇద్దరం, ఇకపై
      ఒకే కల కందాము.

      చాలా బాగుంది చంద్రగారు.

      బాగుంది స్పందన అభినందన
      ధన్యమనోభివాదాలు శ్రీదేవీ!

      Delete
  4. చంద్ర గారి కలం కొత్త మలుపులు తిరిగింది

    " చీకటి పొరల్ని, చకోరాల్ని
    మృదువుగా స్పర్శించాలని
    మదనపడుతున్నావు కదూ .... .. "

    మంచి భావనలతో ..
    అందంగా అందించారు మాకు
    గుండెల్లో పెట్టుకుంటాం మీ ఈ కవితను

    శ్రీపాద

    ReplyDelete
    Replies

    1. చంద్ర గారి కలం కొత్త మలుపులు తిరిగింది

      " చీకటి పొరల్ని, చకోరాల్ని
      మృదువుగా స్పర్శించాలని
      మదనపడుతున్నావు కదూ .... .. "

      మంచి భావనలతో ..
      అందంగా అందించారు మాకు
      గుండెల్లో పెట్టుకుంటాం మీ ఈ కవితను

      చిక్కని స్పందన స్నేహాభినందన
      హన్యాభివాదాలు శ్రీపాద గారు!

      Delete