Thursday, May 29, 2014

ఉరుములు




ఆతని ఆత్మ అంతరంగం తెరపై
చీకటిని ప్రతిబింబిస్తూ చిక్కని ఛాయలా ఆమె
ఆశ్చర్యం .... గా,
రక్తవర్ణం లో కన్నీళ్ళు కార్చుతూ ....
ఒకవైపు
అతను ఒంటరిగా, లయబద్దంగా నర్తిస్తూ
మరోవైపు
ఆమె రాక్షసగణాలతో తాండవిస్తూ

సన్నని దారంతో ప్రాణ బంధమున్న
నల్లని నీడల్లా .... నిప్పుకణికల్లాంటి కళ్ళతో
చేతిలో ఆయుధం తో తాండవిస్తున్న
ఆ కళ్ళలో ద్వేషం మంటలు
తృటి లో .... శరీరాన్ని చుట్టుముట్టి
రక్తం ఉడికి, నిలువెల్లా దహించబడి
సర్వం జ్వాలల్లో భశ్మమవుతున్న దృశ్యం.

దుష్ట పాపాత్మ నవ్వొకటి, ఆలోచనల్ని
మనసు ను ప్రభావితం చేసి
పెళుసైన ఆత్మ ముక్కలు ముక్కలయ్యి
నిశ్చేష్టత నిలువెల్లా ....
ఒకనాటి, సుకుమారతత్వం, ఏకత్వం
ఖటినత్వం, భిన్నత్వం గా పరిణమించి
మది పొరల్లో జ్ఞాపకాలు మసకేసిపోతూ




ఆ నీడలు ఆ ద్వేషం ఆ ఆవేశం
అన్నివైపులనుంచి ఆక్రమించుకుపోతూ
తీక్షణ భావనల చూపుల సూదులు,
గుండెల్ని చీల్చి, రక్తవర్ణపు వర్షపు బొట్లు రాలబోతూ
ప్రాభావితమైన పరిసరాలు
గాఢంగా ప్రబలిన ఆ చీకటి ఛాయలు
మబ్బులు కమ్మిన ఆకాశం ఉరుము లే

No comments:

Post a Comment