Saturday, May 17, 2014

నిదురిస్తున్న వేళల్లో





అలసి, విశ్రమించే క్షణాల
నిద్దుర దూరమైన రాత్రుల అరణ్య ప్రశాంతతలో
ఈ కీచు రాగం
బహుశ, ఏ చిన్ని జీవం
పక్షిదో, కప్ప ....దో అయ్యుంటుంది.

నిద్దుర ప్రశాంతతను ఝుళిపించుతూ
అప్పుడప్పుడూ, దూరంగా
జాతీయ రహదారి పై
బ్రేకులు వేసిన భారీ వాహన టైర్ల ద్వనులు
కిటికీ అంచుని ఆనుకుని విస్తరించిన
చెట్ల కొమ్మల కదలికల గలగలలు,
లోతైన నా శ్వాస
నాకు భారంగా వినిపించే శబ్దం
పక్కింటి పెంపుడు కుక్క
ఊరకుక్క తో వగలు సాగిస్తున్న గీర 




సమయం, నన్ను లేపి మరీ ముచ్చటిస్తున్న
ఈ జీవనానందానుభవాలు.
వీటిని .... నాతో కలిసి
పంచుకునే బాగస్వామ్యం కావాలని
మనసు మారాం చేస్తుంది.
ఆ సాహచర్యం భాగస్వామివి నీవైతే బాగుంటుందని

No comments:

Post a Comment