Saturday, May 3, 2014

కాలాన్ని స్తంభించనిద్దాం .... !




నేను, ఒక పోస్ట్ చెయ్యని ప్రేమ లేఖను
రాసుకున్నాను .... నిన్ననే
నాకు నేను విడమర్చుకునేందుకు
పదాలు దొరకలేదు
బహుశ,
నీవు దూరంగా ఎక్కడో ఉండటం వల్లో
నా సరసన లేకపోవడం వల్లో

నిన్న నేను నాకో విజ్ఞాపన పత్రం
రాసుకున్నాను.
చాలా కష్టం అనిపించింది.
అలా జరగకుండా
ఉండి ఉండాలనిపించింది.
కానీ,
పెంచుకున్న ప్రేమ మాత్రం
అది సహజమే ..... బాధతో తగ్గదు అంటుంది

ఆత్మ శోధన చేసుకున్నాను
పూర్వాపరాల్ని. నిజాన్ని
నేను నిన్నూ సంఘటనల్ని
సరిగ్గా అర్ధం చేసుకున్నానా అని,
నీ, నా సాంగత్యానుబంధం
పరస్పర అనురాగాన్ని చూసి
ఆశ్చర్యం వేస్తుంది. మనం కలిసుండకపోవడం

అనుకున్నదేమీ లేదు కానీ దూరమయ్యాము.
నేను ఈ స్థితిని భరించలేకపోతున్నాను
నా గుండె, నీ కోసమే కొట్టుకుంటుంది.
నీ కోసమే శ్వాసిస్తుంది.
నీకోసమే పాడుతుంది.
నీ భావనలే ఎప్పుడూ
నొప్పిని దాయగలుగుతున్నాను.
ఎద భావనల్నే దాయలేకపోతున్నాను.

నిద్రలో మాట్లాడుతున్నానని తెలిసింది.
నాలో నేను
ఓ పిల్లా!
నిన్నే ప్రార్ధిస్తున్నాను
నా మాటలన్నీ నీవు వినాలనే
ఆ పిదప
కలలో .... నువ్వెదురుపడితే
నిన్ను చూడాలని .... పిల్లా! కలలోనైనా

నిజం పిల్లా!
నేను ఎప్పటికీ మరువలేకపోతున్నాను
నాడు ఉద్యానవనంలో
మనం అతుక్కుపోయి కూర్చునున్నప్పుడు
నీవు అన్న మాటలు
నాతో కలిసి
ఏడడుగులు నడవాలనుందని
అందుకే
నాలో నిన్ను మోస్తూనే ఉన్నాను

ఇప్పుడు కాని ఎప్పుడైనా కానీ
నీకూ అవగతం కావాలని, అవుతుందని
ఆశపడుతున్నాను.
ఈ ప్రేమ భావనలే నీలోనూ
తప్పని స్థితి రావాలని
ఓ పిల్లా!
అప్పుడు మన సాహచర్యం పొదరింటి లోకి .... చూస్తావని
కాలం స్తంభించే క్షణాల .... జీవ సాఫల్యతను గుర్తిస్తావని

No comments:

Post a Comment