Saturday, April 26, 2014

ముగ్ద మందారం




ఉదయాన్నే స్నేహితురాలి పిలుపు. "లాస్యా! కవిత వాళ్ళింట్లో ఫంక్షన్ కు వెళ్ళొద్దామా! నేనొస్తున్నాను. సిద్దంగా ఉండు" అని,
తప్పకుండా వెళ్ళాలి. పొరపాటున కూడా ఆలశ్యం చేయరాదు .... అతను అక్కడే ఉంటాడు. తప్పకుండా కనిపిస్తాడు. వస్తాడు ఫంక్షన్ కు అనుకుంది.
తన హృదయం దొంగిలించి, కలల్లో మాత్రమె వచ్చి పలుకరించి కవ్వించి మాయమయ్యే మనోహర్. కవితకు కజిన్. అతని చేత క్షమార్పణలు చెప్పించుకోవాలి ఎట్టిపరిస్థితి లోనూ .... అనుకుంది.

ఆమె వ్యక్తిత్వం లోని సత్యబామ లో గర్వం .... ఆ భావన. అందరిలాంటి అమ్మాయి కాను తను అని, బాపు గీసిన బొమ్మ అందం తను అని.
తను, తన అనుకున్న మనిషి తననే సర్వస్వం అనుకోక తప్పని ఆకర్షణా శక్తి తనది అనే స్నేహితురాళ్ళ మాటలు గుర్తు కొచ్చాయి.

నవ్వుకుంది. ఏదో అద్భుతం జరుగుతుంది. తప్పదు. ఆతను ఎంతడివాడైనా ఎదురుపడక తప్పదు. తనను అంగీకరించక తప్పదు అనుకుంది. దొంగిలించిన హృదయానికి ప్రత్యామ్నాయం గా తన హృదయాన్ని మూల్యంగా చెల్లించుకోక తప్పదు. అతను ఎదురుపడతాడు. కాసేపు బెట్టు చేసినా పిదప తనచుట్టే తిరగక తప్పదు. తన సొంతం అవ్వక .... తప్పదు అనుకుంది.

స్నేహితురాలి కారు లో ఎఫ్ ఎం రేడియోలొంచి మాంద్రంగా లలిత సంగీతం వినిపిస్తుంది.
వానిటీ బాగ్ లోని అద్దం లో తనను తాను మరోసారి చూసుకుంది లాస్య.
సాధారణం కన్నా బాగున్నాననిపించింది. సర్వం సానుకూలంగానే జరుతుంది అనే అనుభూతి ఆలోచనల మేఘాలు .... అర్ధం కాని స్థితి చుట్టూ.

తెలియని తడబాటు ....

తడబడుతూనే ఫంక్షన్ జరుగుతున్న హాల్ లోకి అడుగుపెట్టింది లాస్య. కవిత ఎదురొచ్చింది. హాలంతా హడావుడీ. అతిదులు బందుమిత్రులతో హాలంతా సందడి సందడిగా ఉంది.
స్నేహితురాళ్ళ పలుకరింపులు దెప్పిపొడుపులను సమాధానం ఇస్తూ అన్యాపదేశం గా హాలంతా కలియ చూసింది.

దూరం గా మనోహర్ ....
అతన్ని చూస్తూనే లాస్య గుండె వేగంగా కొట్టుకుంది.

అతను ఆమెను చూస్తూనే ఆమె కోసమే ఎదురుచూస్తున్నట్లు అడుగు ముందుకేసాడు.

ఎంతో పరిచయం ఉన్న వ్యక్తిలా. కనుల చాలనం చేసాడు. ఏదో అన్నాడు. సరిగ్గా వినిపించలేదు.

లాస్య మనసు గాలిలో తేలుతూ పోగొట్టుకున్న హృదయమే పలుకరించిన భావన .... "కుశలమా లాస్యా!" అని పిలిచినట్లై,

లాస్య మనసు మొగ్గై ఆమె పెదవులు ముడుచుకుపోయాయి. మాట్లాడలేకపోయింది. ఆ పలకని పలుకుల భావనల్ని స్వాగతిస్తున్నట్లు అతని కళ్ళు గుసగుసలాడాయి .... ఆమెతో జీవన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నట్లు,

లాస్య మనసు గాలిలో తేలి, గాలిమబ్బులేవో చెల్లాచెదురవుతున్నట్లు అనిపించింది ఆ క్షణం లో
ఎంత మనోహరమో కదా .... జీవితం అని .... అర్ధం చేసుకునే మనసు తోడుంటే అని.

8 comments:

  1. దూరంగా ఉన్నంత సేపూ ఆవేశంతో కూడిన ఆలోచనలు , తీరా దగ్గరకొస్తే ముడుచుకుంటుంది నునుసిగ్గుతో పూమొగ్గలా.........

    ReplyDelete
    Replies
    1. దూరంగా ఉన్నంత సేపూ ఆవేశంతో కూడిన ఆలోచనలు,
      తీరా దగ్గరకొస్తే ముడుచుకుంటుంది నునుసిగ్గుతో పూమొగ్గలా.........

      రచన వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లు సూచిస్తూ బాగుంది ఆత్మీయ ప్రోత్సాహక స్పందన అభినందన
      అభివాదాలు శ్రీదేవీ!

      Delete
  2. మనస్సు కోరుకున్నదే జరిగినా ఏదో తడబాటు,
    చిన్న కవిత్వం, ప్రశాంతంగా ఉంది చదువుతుంటే... కానీ కవిగారి సందేశం ఇంకేమైనా ఉందా???

    ReplyDelete
    Replies
    1. మనస్సు కోరుకున్నదే జరిగినా .... ఏదో తడబాటు,
      చిన్న కవిత్వం,
      ప్రశాంతంగా ఉంది చదువుతుంటే....
      కానీ,
      కవిగారి సందేశం ఇంకేమైనా ఉందా???

      ప్రశాంతత ఆశించాల్సిన ప్రపంచం లో మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, ఈర్ష, ధన వ్యామోహం, రాజీకీయ దిగజారుడు తనం, ఉగ్రవాదం, అరాచకత్వాలను ప్రత్యక్షంగానూ మీడియా ద్వారానూ చూస్తూ ....
      ఎందుకో స్వచ్చత, నిర్మలత, అమాయకత్వం, కలల ప్రపంచం .... ఆ కలలు నెరవేరితే ఏర్పడే ఆనందం గురించి రాయాలనిపించి చిన్న ఊహకు అక్షర రూపం ఇచ్చాను.

      సందేశాలంటూ ఏమీ లేవు. ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు! సుప్రభాతం!!

      Delete
  3. మంచి భావాలను మూట గట్టి ఎంతో మధురంగా అల్లారు.
    చాలా పొందికగా ఉంది మీ భావాల మూట .
    అభినందనలు.
    *శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. మంచి భావనలను మూట గట్టి ఎంతో మధురంగా అల్లారు.
      చాలా పొందికగా ఉంది మీ భావనల మూట. అభినందనలు.

      *శ్రీపాద గారు అది కలో వాస్తవమో పొందికగా బాగుంది అని బాగుంది మీ ఆత్మీయ ప్రోత్సాహక స్పందన అభినందన
      మనోభివాదాలు శ్రీపాద గారు!

      Delete
  4. అందమైన కలలు రావాలంటే తప్పదు వినోద్ :-)

    ReplyDelete
    Replies
    1. అందమైన కలలు రావాలంటే తప్పదు వినోద్ :-)

      కలలకు పునాది పొందికైన భావనలు అని చక్కని పరిశీలనాత్మక స్పందన అభినందన
      నమస్సులు పద్మార్పిత గారు!

      Delete