Friday, April 18, 2014

మరణమూ .... పరిణామ క్రమంలో భాగమే!?


















అది నేనే కావొచ్చు! 
మరణించాక నా కోసం నీవు 
కన్నీళ్ళు వృధా చెసుకోవద్దు! 
అగ్ని లో అస్తిత్వం కోల్పోబోతున్న నేను 
నిన్ను చూడలేను. 
నిన్ను వినలేను. 
ఉపయోగంలేని, 
ఆశించని లక్షణాల
అతి ప్రవర్తనతో కాలాన్ని కలుషితం చేసుకోకు!? 
నీ ముందు రోజుల గురించి ఆలోచించుకో!

సమీపం లో, అందుబాటులో 
నేను లేనప్పుడు, 
సేద్యం జరగకపోవడం సరి కాదు.
కాలంతో పాటు 
సృష్టీ, మార్పూ సహజంగానే జరగాలి 
పూలు వికశించి పరిమళిస్తు, 
ఋతువులు సజావుగా వస్తూ .... ఉండాలి.
ఎవరు గతించినా 
పక్షులు చెట్లకు గూళ్ళు కట్టి 
పక్షి పిల్లల ఆహారం కోసం 
గగనం లో విహరించడం మానవన్నది నిజం.

వలసపక్షులు 
ఎక్కడో పుట్టి, మరెక్కడో జీవిస్తున్నట్లు 
రాలిన ఆకులు 
నేలను సారవంతం చేస్తున్నట్లు
కైలాసం నుండి జారి 
దరిత్రిని పావనం చేస్తూ, 
కొండలు, లోయలు, అరణ్యాల్లో పారి నదులు 
తమ కదలికలతో
భువిని సశ్యశ్యామలం చేసి,
రైతు కూలి స్వేదంను .... కలుపుకుని 
సముద్రం దిశగా సాగుతుండటం చూడు! 

ఊరవతల అడవుల్లో 
క్రూర మృగాల అరుపులు ఏడుపులు 
వినిపించే వేళ లో.
చీకటి చుట్టు ముట్టి 
మనిషి కాల్పనిక జగత్తులో విహారించి
ఆరంభమయ్యే సృష్టి కార్యం 
సహజీవన ధర్మాన్ని గుర్తుచేస్తూ
చలికాలం లో 
ఒక పురుషుడు 
ఒక స్త్రీ జీవన సాంగత్యం కోసం 
తనలోని బ్రహ్మ తలపెట్టిన సృష్టి కార్యం 
నిర్వహణ పరిణామ క్రమమే మరో జన్మ

కాలము, ప్రకృతి .... కదులుతూ, మారుతూ 
వయసొచ్చి నేను మరణించొచ్చు. కానీ  
ఈ సీతాకోక చిలుకలు, తేనెటీగలు 
ఇక్కడే ఉంటాయి.
వేసవి లో వృక్షాలు ఫలాలు కాస్తూ 
ఎడారులలో వర్షాలు కురుస్తూ 
ఈ సృష్టికార్యం ఇలా జరుగుతూనే ఉంటుంది.
ఆలోచిస్తే అర్ధం అవుతుంది. 
కాలగతిన నేను 
ఒక మరిచిపోదగిన అస్తిత్వాన్ని మాత్రమే అని
రేపటి రోజు ఒక కొత్త ఆలోచన ఆవిర్భావానికీ 
ఒక కొత్త జీవం, అస్తిత్వ అవకాశానికీ కారణాన్ని మాత్రమే అని

6 comments:

  1. మరణం కూడా కాలానుగుణ మార్పుగా చాలా సహజంగా వివరించారు చంద్రగారు.

    ReplyDelete
    Replies
    1. మరణం కూడా కాలానుగుణ మార్పుగా
      చాలా సహజంగా వివరించారు చంద్రగారు

      సహజమైన శైలిలో స్పందన అభినందన
      ధన్యవాదాలు శ్రీదేవీ!

      Delete
  2. "నదులు తమ కదలికలతో
    భువిని సశ్యశ్యామలం చేసి,
    రైతు కూలి స్వేదంను .... కలుపుకుని
    సముద్రం దిశగా సాగుతుండటం చూడు!"
    Excellent Vemulachandra garu!

    ReplyDelete
    Replies
    1. "నదులు తమ కదలికలతో
      భువిని సశ్యశ్యామలం చేసి,
      రైతు కూలి స్వేదంను .... కలుపుకుని
      సముద్రం దిశగా సాగుతుండటం చూడు!"

      ఎక్సలెంట్ వేములచంద్ర గారు

      నా బ్లాగుకు హృదయపూర్వక స్వాగతం ఆచార్య పణీంద్ర గారు!

      చక్కని స్నేహ ప్రోత్సాహక అభినందన మీ స్పందన
      ధన్యవాదాలు ఆచార్య ఫణీంద్ర గారు! సుప్రభాతం!!

      Delete

  3. "కాలగతిన నేను
    ఒక మరిచిపోదగిన అస్తిత్వాన్ని మాత్రమే అని
    రేపటి రోజు ఒక కొత్త ఆలోచన ఆవిర్భావానికీ
    ఒక కొత్త జీవం, అస్తిత్వ అవకాశానికీ కారణాన్ని మాత్రమే అని"

    గొప్ప ముగింపు ఇది .
    ఎంత బాగా రూప కల్పన చేసారు మీ భావనలకు చంద్ర గారు.
    ఆసాంతం చదివాక కళ్ళల్లో నీళ్ళు నిండాయ్.
    మనస్సు కాస్తా మొద్దుబారింది కూడాను .
    చాలా బాగుంది మీ కవిత .
    అభినందనలు చంద్ర గారూ .
    *శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. "కాలగతిన నేను
      ఒక మరిచిపోదగిన అస్తిత్వాన్ని మాత్రమే అని
      రేపటి రోజు ఒక కొత్త ఆలోచన ఆవిర్భావానికీ
      ఒక కొత్త జీవం, అస్తిత్వ అవకాశానికీ కారణాన్ని మాత్రమే అని"

      గొప్ప ముగింపు ఇది .
      ఎంత బాగా రూప కల్పన చేసారు మీ భావనలకు చంద్ర గారు.
      ఆసాంతం చదివాక కళ్ళల్లో నీళ్ళు నిండాయి. మనస్సు కాస్తా మొద్దుబారింది కూడాను .
      చాలా బాగుంది మీ కవిత .అభినందనలు చంద్ర గారూ .

      *శ్రీపాద

      చాలా చాలా బాగుంది మానసిక విశ్లేషణ మీ స్పందన ఒక చక్కని స్నేహ ఆత్మీయ ప్రోత్సాహక అభినందన.
      _/\_లు శ్రీపాద గారు!!

      Delete