Thursday, April 17, 2014

ఎడారి వాన చినుకు











అవిగో .... బంజరు పడీదులు
వెచ్చని గాలి, పచ్చని 
పూచిన పత్రహరితం 
గడ్డిపూల పానుపు పలుకరింపులు 
చూడగలిగిన కళ్ళకు కనిపిస్తుంది 
ఆ ప్రేమ పూలవనం

అదుగో .... ఆ తేయాకు తోటల 
తాజా పరిమళాలలో 
నిన్ను కన్న భూమి తల్లి కన్నుల కలలలో
వింత కాల్పనిక జానపద శ్రావ్య రాగం 
ప్రకృతి ఆలాపనలవిగో 

నీకు నీవు చీకటిమయం అవుతున్నావు 
నీ చూపుల వెదుకులాటంతా 
అనాశక్తత, నిరాశ 
నిట్టుర్పుల నీడలలోనే 
అమావాశ్య రాత్తిరి అంధకారం లోనే 

కానీ, ఈ భూప్రపంచం లో ఒక ప్రదేశం .... నీ ఇల్లు
అక్కడ ప్రేమ, శాంతి, సహనం 
నీ జీవన తపోదనం 
ఎడారి సరోవరం ఉంది చూడు
అది నీ చెలి సాహచర్యం వొడిలోనే 

4 comments:

  1. చెలి సాహచర్యం గూర్చి చక్కగా వ్యక్తం చేసారు, చంద్రగారు బాగుంది.

    ReplyDelete
    Replies
    1. చెలి సాహచర్యం గూర్చి చక్కగా వ్యక్తం చేసారు,
      చంద్రగారు బాగుంది.
      చక్కని అభినందన స్పందన
      ధన్యవాదాలు శ్రీదేవీ!

      Delete
  2. ఎంతో మంచి భావాలని పదిలంగా పొందు పరిచిన తీరు ప్రశంసనీయం .
    అసలేం రాయాలో తెలియని స్థితి నాది.
    ఎంత బాగా అల్లారో మీ మాటల్ని
    చాలా బావుంది చంద్ర గారూ .

    *శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. ఎంతో మంచి భావాలని పదిలంగా పొందు పరిచిన తీరు ప్రశంసనీయం .
      అసలేం రాయాలో తెలియని స్థితి నాది.
      ఎంత బాగా అల్లారో మీ మాటల్ని .... చాలా బావుంది చంద్ర గారూ .

      *శ్రీపాద

      చాలా చాలా బాగుంది స్పందన స్నేహ ఆత్మీయ ప్రోత్సాహక అభినందన.
      ధన్యావాదాలు శ్రీపాద గారు!!

      Delete