Tuesday, April 15, 2014

అనూహ్య ఆశయం




సరైన సమయమే అని
సన్నద్ధుడ్ని అవుతున్నాను.
సూటిగా
ఈ చెట్లూ, పుట్టల మధ్య గా
తూరుపు దిశగా కదలాలని 
కొండవతల పొద్దు 
ప్రకాశం వెదజల్లుతూ ప్రపంచాన్ని
తొంగిచూసే వేళ కావొస్తుంది
ఆ వెలుగు, ఆ ప్రకాశం లో
ఒక అణువునై ఉండిపోవామని
మనసు ఉవ్వీళ్ళూరుతుంది.

కనిపించీ కనిపించని
సుప్రభాత వేళ 
అన్నీ నేను లా
ఆ వింత, వినూత్న, అనూహ్య ప్రదేశం లో
కాలానికి మాత్రమే తెలిసిన
ఆ గ్రహ ఉపరితలం పై
అందం, ఆహ్లాదం
ఆరోగ్యాన్ని ప్రతిష్టిద్దామని
ఆ విచ్చుకున్న ఆకాశం
ద్వారాలు తెరుచుకుని
అందానికే అందమైన నిర్వచనం
అయస్కాంత శక్తిని పొందుదామని

ముందుగా ఈ సమాజం
నన్ను అర్ధం చేసుకుంటే బాగుణ్ణు.
నాకు సమాజం అంటే ఇష్టం
విపరీత గౌరవం! 
కానీ,
ఈ సమాజం గోడలే .... ఇప్పుడు
నా చుట్టూ ప్రాకారాలై
నా మదిలో చీకట్లు కమ్ముకుంటున్నాయి.
కేవలం
నేను తనను 
అపరిమితం గా
జీవితానికన్నా ఎక్కువగా
ప్రేమిస్తున్నానని తెలియపర్చాలని ఉంది.



నాకు, కొంత వెసులుబాటు
ఉద్యానవనం వాతావరణం
శ్వాసించేందుకు స్వేచ్చ కావాలి.
ఊరూరా తిరిగి
కనిపించని పిచ్చివాదన అస్పష్టతల
అయోమయాన్ని ఎదుర్కొని
చీకటి వెలుగుల సరిహద్దుల్లో
తప్పును
ఒప్పు కాకుండా వెలుగులు ప్రసరిస్తూ
బాధ, గాయాలను మానిపే
ఔషదాన్ని కావాలని .... ఉంది.
అందరూ ఆశించే అందం
ఆహ్లాదాన్ని కావాలనే ఆకాంక్ష ఉంది.


6 comments:

  1. Mee Akanxa chaalaa baagundi:):)

    ReplyDelete
    Replies
    1. మీ ఆకాంక్ష చాలా బాగుంది

      చాలా బాగుంది స్పందన స్నేహ ప్రోత్సాహక అభినందన
      ధన్యవాదాలు కార్తీక్! సుప్రభాతం!!

      Delete
  2. గుండెకు హత్తుకునేలా ఉన్నాయి మీ భావనలు చంద్ర గారు. 

    ReplyDelete
    Replies
    1. గుండెకు హత్తుకునేలా ఉన్నాయి మీ భావనలు చంద్ర గారు.

      చక్కని స్నేహ ప్రోత్సాహక అభినందన స్పందన
      ధన్యాభివాదాలు శ్రీపాద గారు! శుభోదయం!! :)

      Delete
  3. "కనిపించీ కనిపించని
    సుప్రభాత వేళ
    అన్నీ నేను లా
    ఆ వింత, వినూత్న, అనూహ్య ప్రదేశం లో
    కాలానికి మాత్రమే తెలిసిన
    ఆ గ్రహ ఉపరితలం పై
    అందం, ఆహ్లాదం
    ఆరోగ్యాన్ని ప్రతిష్టిద్దామని
    ఆ విచ్చుకున్న ఆకాశం
    ద్వారాలు తెరుచుకుని
    అందానికే అందమైన నిర్వచనం
    అయస్కాంత శక్తిని పొందుదామని"

    గర్వగా తోచింది మీ పై పలుకులు చదివాక.
    నిఘూడమైన భావాలని పొంచు పరిచారు ఇక్కడ .
    ధన్యులు చంద్ర గారూ.

    *శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. "కనిపించీ కనిపించని సుప్రభాత వేళ
      అన్నీ నేను లా ఆ వింత, వినూత్న, అనూహ్య ప్రదేశం లో
      కాలానికి మాత్రమే తెలిసిన ఆ గ్రహ ఉపరితలం పై
      అందం, ఆహ్లాదం ఆరోగ్యాన్ని ప్రతిష్టిద్దామని
      ఆ విచ్చుకున్న ఆకాశం ద్వారాలు తెరుచుకుని
      అందానికే అందమైన నిర్వచనం అయస్కాంత శక్తిని పొందుదామని"

      గర్వగా తోచింది మీ పై పలుకులు చదివాక.
      నిఘూడమైన భావాలని పొంచు పరిచారు ఇక్కడ .
      ధన్యులు చంద్ర గారూ.

      *శ్రీపాద

      ఎంతో చాక్కని ఆస్వాదన స్నేహాభినందన మీ స్పందన శ్రీపాద గారు! భావనకు భావుకునికి ధన్యత ఆ భావన ఎన్ని హృదయాలను తడిమిందో అన్న దాన్ని బట్టి అంచనా వేసుకోగలం! మీ అభినందనను హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నాను!
      ధన్యాభివాదాలు శ్రీపాద గారు!!

      Delete