Sunday, March 30, 2014

చెదలు




 









తుప్పు యినుమును తినివేసినట్లు ....
జీవన విలువలు హరించుకుపోతూ
దినదినమూ
క్షీణత దిశగా భూగోళం
వాస్తవదృష్టితో చూస్తే
ప్రాకృతిక అసంతులనం .... జీవనం




అగ్ర దేశాల్లా ....
కొందరు రాజకీయ నాయకులు
తయారుచేసిన ఆయుధాలు మూకుమ్మడి వాగ్దానాలు
అమ్ముకుని
మరింత అగ్రగాములయ్యే ఆశ ....
బీద దేశాల్లాంటి
సామాన్యుడిని ప్రలోభ పెట్టి .... ప్రయోగిస్తూ




కడుపు మాడుతున్నా,
పునరావృతమౌతున్న ప్రలోబాలకు లోబడి ....
సాద్యం కాని శ్రమపడకుండా ఎదగాలనే ఆశతో
విలువలు సర్వస్వం కోల్పోతూ .... సామాన్యుడు
అగ్రజుడు అగ్రజుడే అని
ఏ పార్టీలో ఉన్నా నాయకుడు నాయకుడే అని
తెలుసుకోలేకపోతూ

అణువణువులో సత్తువనంతా కూడగట్టుకుని
సర్వస్వం కోల్పోయేవరకూ
పోరాడాల్సిన తరుణం లో
సొమరై, సామూహిక అజ్ఞానం తో
బ్రతుకుభారమౌతూ ....
తుప్పు యినుమును తినేసినట్లు .... ఏమి ఆశించో
కొందరు నాయకులు చీమల పుట్ట చెదలును కదిలిస్తూ

4 comments:

  1. తుప్పు యినుమును తినివేసినట్లు ....
    జీవన విలువలు హరించుకుపోతూ
    దినదినమూ
    క్షీణత దిశగా భూగోళం ....starting super

    ReplyDelete
    Replies
    1. తుప్పు యినుమును తినివేసినట్లు ....
      జీవన విలువలు హరించుకుపోతూ
      దినదినమూ
      క్షీణత దిశగా భూగోళం ....

      స్టార్టింగ్ సూపర్

      ఆరంభం బాగుంది .... కంటిన్యుయేషన్ గురించి కాస్త శ్రద్ద తీసుకొమ్మని సూచన స్నేహ ప్రోత్సాహక స్పందన
      నమస్సులు పద్మార్పిత గారు!

      Delete
  2. నిజంగానే విలువలకు చెదలు,వేరు పురుగులు పట్టినాయి చంద్రగారు.

    ReplyDelete
    Replies
    1. నిజంగానే విలువలకు చెదలు, వేరు పురుగులు పట్టినాయి చంద్రగారు.
      స్వార్ధము, మనిషిని వస్తువును ఒక్కటిగా చూసే నైజము పెరిగి .... ఈ దుర్దశ
      ధన్యవాదాలు శ్రీదేవీ!

      Delete