Wednesday, March 5, 2014

నీ పక్కనే నిలబడుంటాను




దగ్గరలో ఉన్నా దూరంగా ఉన్నా
నీవు ఎక్కడ ఉన్నా
అయోమయం మబ్బులు నిన్ను
కమ్ముకునున్నప్పుడు
నీవు ఆశా విహతివైన క్షణాల్లో
నీకు నీడను కల్పిస్తూ
ఒక నమ్మకం అవసరాన్ని లా
నీ పక్కనే .... నేనుంటానని చెబుతున్నా
ఆ నక్షత్రాల సాక్షిగా

నేను .... ఒక సామాన్యుడ్ని!
నీముందే నడుస్తున్నా .... నీ తోడుగా
చీకట్లు కడతేరేవరకూ
నవ్వులు పంచుకుంటూ
నీ కన్నీళ్ళూ, బాధలకు
ఊరడింపు ఉపశమనాన్నిస్తూ
నిన్నే ప్రేమిస్తూ
నీ బలహీన క్షణాల్ని
బలోపేతం, ఆహ్లాదంగా మారుస్తూ 
ఒక నమ్మకం, దృడ సంకల్పం లా .... నేను
నీవు నిర్భయంగా వచ్చినప్పుడు
నిన్ను పొదువుకునేందుకు సిద్దం గా

మానసికంగా .... నీవు
కృంగిపోతున్నప్పుడు,
నీ భావనల ఒంటరితనం .... గతం
నిన్ను వెంటాడుతున్నప్పుడు,
వెనుదిరిగి చూడు ....
నీ గతాన్ని కాదు .... నన్ను
నిర్భయంగా
నా వద్దకు రా!
నీవు కృంగిపోతున్నప్పుడు,
నీకూ తెలుసు .... ఎప్పుడైనా
నిన్ను వంచించని నా దరికి రావొచ్చని



 














నేను నీ పక్కనే ఉంటానని మాటిస్తున్నాను.
నీకు నీవు విశ్చిన్నమయ్యాననిపించి
ఏడుస్తున్నప్పుడు
నీకు నమ్మకాన్ని కలిగించుతూ
చేతిలో చెయ్యేసి ఒట్టేసి చెబుతాను.
నా మాట నమ్మమని
నా ఒట్టు ఎంత మాత్రమూ అబద్దం కాదని
నీవు అసహాయురాలివి కాదని
నీకు తెలిసేలా .... ఔను నీకూ తెలిసేలా
నీవు ఎప్పుడైనా నా వద్దకు రావొచ్చని

నేను నమ్ముతాను.
ప్రతి రోజూ
సూర్యోదయం లానే
సూర్యాస్తమయమూ తప్పదని
అయినా,
నీపై నా ప్రేమకు అస్తమయం లేదు.
అది రాత్రి వేళ దీప కాంతి లోనూ
నీ నీడ లా
నీవెంటే ఉంటుందని మాటిస్తున్నాను.

4 comments:

  1. ఎంత ఊరట నిస్తుందో,అంత శాంతిని ప్రసాదిస్తుంది ఇలాంటి సాన్నిహిత్యం.
    వేదనతో్ తపించే ప్రతి హృదయానికీ నేనున్నానని నిండుగ పలికే ఓ సాటి మనిషి ఉంటే...,
    సర్, ఎన్ని సార్లు చదివానో...,చాలా ఆశాజనకంగా ఉంది మీ కవిత.

    ReplyDelete
    Replies
    1. ఎంత ఊరట నిస్తుందో, అంత శాంతిని ప్రసాదిస్తుంది ఇలాంటి సాన్నిహిత్యం.
      వేదనతో్ తపించే ప్రతి హృదయానికీ నేనున్నానని నిండుగ పలికే ఓ సాటి మనిషి ఉంటే...,
      సర్, ఎన్ని సార్లు చదివానో....,
      చాలా ఆశాజనకంగా ఉంది మీ కవిత.
      ఎంతో గొప్ప కాంప్లిమెంట్ .... చాన్నాళ్ళ తరువాత
      చాలా బాగుంది స్పందన ప్రోత్సాహక అభినందన
      ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు! శుభసాయంత్రం!!

      Delete
  2. నేనున్నానన్న నమ్మకం చాలు ఏ బంధానికైనా అస్తమయం ఉండదు చాలా బాగుంది సర్ మీ కవిత

    ReplyDelete
    Replies
    1. నేనున్నానన్న ఆ నమ్మకం చాలు ఏ బంధానికైనా
      అస్తమయం ఉండదు
      చాలా బాగుంది సర్ మీ కవిత
      చాలా బాగుంది స్పందన స్నేహ ప్రోత్సాహక అభినందన
      ధన్యవాదాలు హరిత గారు! శుభోదయం!!

      Delete