Saturday, March 29, 2014

రాయలేను, నా నమ్మకాల్ని .... స్వచ్చందంగా




మళ్ళీ భావుకుడ్నై .... నేను
భావనలను విస్తరించలేను
రాయాలని ఉపక్రమించినా ....
నాగరికత తెలియని
ఆటవిక రోజుల ఔన్నత్యాన్నీ
ఆది మానవుడ్ని ....
ఆ పిదప
స్వాతంత్రం వచ్చిన తొలిరోజుల
జీవన సరళిని
పరిచయం చెయ్యాలని చూస్తే 
అన్నీ ఇబ్బందులే
అన్నీ అపశృతులే




శిధిలమైన
నాటి గురుకుల పాటశాలలు
చెట్లక్రింద బోధనలు
గోడకుర్చీలు, తొడపాశాలు
పేనుబెత్తం అరచేతి వాపుల .... గతం
ఆ భావనలను రాయలేక ....
ఒప్పించలేక
ఏ బోదివృక్షం ముందో దోషి లా నిలబడి
వెర్రి చూపులు చూడాల్సిరావడం
ప్రేమ, స్వచ్చత, పరిపూర్ణతలను నిర్వచించే క్రమం లో
ఆ నాటి భావనలు, నేటి నిర్వచనాల మధ్య
సామీప్యంలేని అంతరాలను
ఒక్కటి చెయ్యలేని అవ్యక్తతో కూడిన బాధ
మళ్ళీ భావుకుడ్నెందుకయ్యాను
భంగపడేందుకా?
అనే ప్రశ్న, సంశయం
మదిని తొలచడం ఇష్టం లేక, రాయలేను ....

2 comments:

  1. గోదావరి వాసులారా ! చంద్రబాబుకు వోటేసారా మన గ్యాస్ ను రిలయెన్స్ అంబానీకి మోడీతో కలిపి కట్టబెట్టడానికి అవకాసం కల్పించినట్లే

    ReplyDelete
    Replies
    1. గోదావరి వాసులారా! చంద్రబాబుకు వోటేసారా మన గ్యాస్ ను రిలయెన్స్ అంబానీకి మోడీతో కలిపి కట్టబెట్టడానికి అవకాసం కల్పించినట్లే ....!?
      స్నేహ ప్రోత్సాహక స్పందన
      ధన్యవాదాలు గోదావరి బిడ్డ గారు! శుభసాయంత్రం!!

      Delete