Tuesday, March 18, 2014

ఆలోచిస్తేనే ఆశ్చర్యం




ఆకలి అనిపించినప్పుడు
అడగకుండా
ఎలా తెలుసుకుంటావో .... ఆకలి తీరుస్తావు.
ఒంటరినిలా
నన్ను నేను
దూరంగా విసిరేసుకున్న క్షణాల్లో
అలసటతీర్చి
నుదుట ముద్దుల వరాలిచ్చి,
గుండెల్లోకి తీసుకుంటావు.... చెలీ, 
ఆలోచిస్తే
ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో.
ఒక స్త్రీవి నీలో, ప్రకృతిలో
ఇన్ని రూపాలు, ఆంతర్యాలున్నాయని
నిన్ను చూసాకే తెలుసుకున్నాను.



ఏ క్షణమూ
ఆశను కోల్పోకుండా
జీవితాన్ని ప్రేమించి
ముందుకు కదిలేందుకు ....
పురోగమించేందుకు 
ఒక నీడలా, ఒక ప్రేరణలా
ఒక అదృష్టం లా
నీ తోడు ప్రయాణం .... కారణమనిపించి
ఎంత ఆశ్చర్యమో! ఎంత వింత అనుభూతో .... చెలీ!?

4 comments:

  1. స్త్రీ మహిమాన్వితురాలు.......ప్రకృతికి అనుగుణంగా ఉంటేనే సుమా !

    ReplyDelete
    Replies
    1. స్త్రీ మహిమాన్వితురాలు.......
      ప్రకృతి తానై.... ఉంటేనే సుమా!
      చాలా బాగుంది స్పందన విశ్లేషణ
      ధన్యవాదాలు శ్రీదేవీ! శుభోదయం!!

      Delete
  2. స్త్రీలో ఉన్నత శక్తిని చూడగలిగిన మగవాన్ని స్త్రీ ఎన్నటికీ మరచిపోదు,
    అలాగే చేయి విడిచిన వానిని కూడా,స్త్రీ ఓ అధ్భుత గ్రందం సర్.

    ReplyDelete
    Replies
    1. స్త్రీలో ఉన్నత శక్తిని చూడగలిగిన మగవాడిని స్త్రీ ఎన్నటికీ మరచిపోదు,
      అలాగే చేయి విడిచిన వానిని కూడా,
      స్త్రీ ఓ అధ్భుత గ్రందం సర్
      అర్ధం కాదు సులభం గా
      చక్కని పరిశీలన
      ధన్యాభివాదాలు మెరాజ్ గారు! సుప్రభాతం!!

      Delete