తుప్పు యినుమును తినివేసినట్లు .... జీవన విలువలు హరించుకుపోతూ దినదినమూ క్షీణత దిశగా భూగోళం వాస్తవదృష్టితో చూస్తే ప్రాకృతిక అసంతులనం .... జీవనం
అగ్ర దేశాల్లా .... కొందరు రాజకీయ నాయకులు తయారుచేసిన ఆయుధాలు మూకుమ్మడి వాగ్దానాలు అమ్ముకుని మరింత అగ్రగాములయ్యే ఆశ .... బీద దేశాల్లాంటి సామాన్యుడిని ప్రలోభ పెట్టి .... ప్రయోగిస్తూ
కడుపు మాడుతున్నా, పునరావృతమౌతున్న ప్రలోబాలకు లోబడి .... సాద్యం కాని శ్రమపడకుండా ఎదగాలనే ఆశతో విలువలు సర్వస్వం కోల్పోతూ .... సామాన్యుడు అగ్రజుడు అగ్రజుడే అని ఏ పార్టీలో ఉన్నా నాయకుడు నాయకుడే అని తెలుసుకోలేకపోతూ
అణువణువులో సత్తువనంతా కూడగట్టుకుని సర్వస్వం కోల్పోయేవరకూ పోరాడాల్సిన తరుణం లో సొమరై, సామూహిక అజ్ఞానం తో బ్రతుకుభారమౌతూ .... తుప్పు యినుమును తినేసినట్లు .... ఏమి ఆశించో కొందరు నాయకులు చీమల పుట్ట చెదలును కదిలిస్తూ
దూరంగా ఎక్కడికో నీవు వెళ్ళిపోతూ తలుపులు మూసివేస్తున్న భావనే కన్నీళ్ళై, నా బుగ్గలపై జారి నా ప్రపంచం .... శూన్యం అయిపోతున్నట్లుంటుంది నా భుజస్కందాలే నాకు దూరమై .... నా మనోగతం చీకటి అయోమయమై కాలం భారంగా కదులుతున్నట్లు గోడమీద గడియారమూ, గుండె లయను కోల్పోయి అసంతులనంగా వేగంగా కొట్టుకుంటున్నట్లుంటుంది.
నీవు పక్కనున్నప్పటి నీ స్నేహ ఆత్మీయ బుజ్జగింపులు నా మది తెరపై జ్ఞాపకాలై అస్పష్టంగా .... పదే పదే కదులుతూ నీ ప్రతి ఊహ తోనూ నా హృదయం ఆవిరై ఒంటరితనం పై .... తీవ్రమైన అసహ్యం పెరుగుతూ తెలియని అలజడి, నా నరనరాల్లో పెరిగి ముచ్చెమటలు పడుతుంటాయి. గదిలోని ప్రతి వస్తువు మౌనంగా నీ పేరే జపిస్తూ నా మనసును కలవరపెడుతుంటుంది.
తీయని సెంట్ వాసన .... ఏదో బెడ్ రూం లో వరదలై పారి తలగడను అతుక్కునున్న సువాసనల జాడలు బెడ్ రూం నేలపై పరుచుకునున్న నీవు విడిచిన ఆ దుస్తులు వెదజల్లుతున్న నీ స్వేద మత్తు వాసనలు పీల్చేకొద్దీ .... విపరీత భావనలేవో చెలరేగి నా గుండె అల్లల్లాడుతుంది.
అకస్మాత్తుగా నా మనస్సు ఖాళీ అయిపోయి నేను అపస్మారక స్థితిలోకి జారుకుంటున్నట్లు నా సర్వమై అమూల్యమైన లక్షణం నిన్ను శాశ్వతంగా కోల్పోతున్నానన్న కారణం ఏదో నన్ను ప్రశ్నిస్తుంటుంది. నిజానికి .... నీవు నానుంచి కోరుకున్నదేమిటని? నా ఆత్మ సమర్పణ నీన్నే ప్రేమిస్తున్నాననే ఆలోచనను దాచలేని నా ఎద భావనను .... నా నోట వినాలనే అని.
నీ ఆత్మ సౌందర్యం ప్రకాశమేమో నీ కళ్ళలోనే కనిపిస్తుంది నీ పెదవుల్నుంచి త్రుళ్ళిపడే .... తియ్యని మాటలు మదిని ఊరిస్తూ స్వర్గం ఎంతో సమీపంలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. నీవు నా పక్కన ఉన్నప్పుడు నీ నవ్వు నా ప్రపంచాన్ని ఆశావహం గా మారుస్తూ,
జంట నక్ష త్రాల్లా ఏ వజ్రాలూ కెంపులకు లేని మెరుపుల్లా లక్షల్లో అరుదైన ఒకే ఒక్క జంటలా మన ప్రేమ మనకు అరుదైన ఆనందాన్నిస్తూ ఏ ప్రత్యామ్నాయమూ లేని దివినుంచి దిగివచ్చి .... భువిలో నా కోసమే జన్మించిన మణివో మాణిక్యానివో అన్నట్లు ఎన్ని జన్మలైనా ఎంత మదనపడైనా పొందాల్సిన సందర్శనీయ బహుమానం నీ అనురాగం అనిపిస్తుంది.
నా హృదయం నీకు సమర్పించుకుంటున్నాను నీపై నాకున్న ప్రేమకి గౌరవ సూచన గా సంపూర్ణంగా .... అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది ఆ బ్రహ్మ ఎంతో కష్ట పడి అనురాగము, ప్రేమ .... సమతుల్యం గా శిల్పంగా నిన్ను చెక్కాడేమో అని నా అంతరాంతరాల్లో తుడిచివెయ్యలేని రాగ బంధం నీ ప్రేమే అని
అంకితమిస్తున్నాను. నా అమరప్రేమను .... ఎంతో వినమ్రంగా నీవూ, నేనూ ఒకరికి ఒకరం చేరువైన క్షణాల్లో తగిలే నీ వెచ్చని శ్వాస కోసం .... నీ అనురాగం స్నేహం ఆత్మీయతల కోసం .... శారీరకంగా, మానసికంగా నన్ను నీకు సమర్పించుకుంటున్నాను. నీ ప్రతి కోరిక నా ఆత్మ అభీష్టమే అనుకుని జీవన చరమ ఘట్టం .... స్వర్గం చేరేవరకూ .... కలిసుంటానని మాటిస్తున్నాను. నా ఆత్మ, నీ ఆత్మ ప్రేమకు కట్టుబడి ఉంటుందని
మళ్ళీ భావుకుడ్నై .... నేను భావనలను విస్తరించలేను రాయాలని ఉపక్రమించినా .... నాగరికత తెలియని ఆటవిక రోజుల ఔన్నత్యాన్నీ ఆది మానవుడ్ని .... ఆ పిదప స్వాతంత్రం వచ్చిన తొలిరోజుల జీవన సరళిని పరిచయం చెయ్యాలని చూస్తే అన్నీ ఇబ్బందులే అన్నీ అపశృతులే
శిధిలమైన నాటి గురుకుల పాటశాలలు చెట్లక్రింద బోధనలు గోడకుర్చీలు, తొడపాశాలు పేనుబెత్తం అరచేతి వాపుల .... గతం ఆ భావనలను రాయలేక .... ఒప్పించలేక ఏ బోదివృక్షం ముందో దోషి లా నిలబడి వెర్రి చూపులు చూడాల్సిరావడం ప్రేమ, స్వచ్చత, పరిపూర్ణతలను నిర్వచించే క్రమం లో ఆ నాటి భావనలు, నేటి నిర్వచనాల మధ్య సామీప్యంలేని అంతరాలను ఒక్కటి చెయ్యలేని అవ్యక్తతో కూడిన బాధ మళ్ళీ భావుకుడ్నెందుకయ్యాను భంగపడేందుకా? అనే ప్రశ్న, సంశయం మదిని తొలచడం ఇష్టం లేక, రాయలేను ....
కిటికీలోంచి గుడ్డి దీపపు కాంతి వెలుపల చిక్కగా పరుచుకునున్న గుబులు చీకటిని పారద్రోలాలని ప్రయత్నిస్తూ మరింత అంధకారమై అలుముకుపోతూ అంతా నిశ్శబ్దం ప్రపంచం విశ్రమిస్తూ ఆరిన పొయ్యిలో నిద్రపోతూ ఒక పిల్లి, వెలగనా ఆగిపోనా అన్నట్లు మిణుకు మిణుకుమంటూ రోడ్డు పక్కన వీది దీపం కాంతి .... కుశల ప్రశ్నలు వేస్తూ, ఒంటరి గుండెతో మాట్లాడుతూ ఉన్నాయి .... మౌనంగా నేను నిన్ను విడిచి వెళ్ళడం లేదు .... అని
ఇన్నినాళ్ళ నుంచి అని చెప్పలేను. ఎన్ని యేళ్ళుగానో నేను ఈ ఆలోచనల కుటీరం లో .... ఆమె కోసమే బస చేస్తూ ఉన్నది.
ఆమె కోసమే ఈ మాటలు, ఈ బాష, ఈ పలకటం నేర్చుకున్నది. నా శరీరాన్ని, నన్ను బలోపేతం చేసుకున్నది. ఆమె ఇష్టపడుతుందనే నాకుగా నేను బరువు పెరిగింది.
నా జీవితం లో నేను ఎదురుచూసింది కోరుకున్నది. ఎదురుచూసి పొందిందీ సంద్యా సమయంలోనో సూర్యోదయ వేళల్లోనో ఆకస్మికంగా నో అలవోకగా నో .... ఎప్పుడైనా కనుసన్నల్లోంచి ఆమె నన్ను చూస్తుండటాన్నే
ఎన్ని యేళ్ళు గడిచినా ఎందుకో తెలియదు .... ఇంకా ఈ గుండె కొట్టుకోవడం మానలేదు. ఆమెను చూసి తీవ్రంగా .... పక్కటెముకలు అదిరేలా
ఒక్క రాత్తిరిని కూడా నేనెరుగను ఆమె అనుగ్రహము ఆమె అనుమోదము పొందని ఆమె తోడులేని నిద్దుర కలల లోకి .... నేను జారడం
మేలుకొనే వేళల్లో నా కనురెప్పలకు తెల్లవారినట్లు తెలియదు. వేడి వేడి నిద్దుర కాఫీ పరిమళాలతో ఆమె గోరువెచ్చని స్పర్శ, పరామర్శ .... నన్ను తట్టేవరకూ
కన్నీటి బిందువుల్లానే గొంతులోంచి మాటలు పెగలడం లేదు. అతని పెదాలూ తడారిపోయాయి మరింతగా ఏడ్చేందుకు కన్నీళ్ళూ లేవు. ఆ బుగ్గలపై చారికలై మిగిలాయి .... మినహా అక్షరాలు, పదాలు తట్టడం లేదు. రాయడానికి ఎప్పుడూ భావాలను స్రవించే అతని కలం సిరా ఆవిరై అతని మది మూగబోయింది.
అంతా నిశ్శబ్దం అతని, హృదయ కుహరం లో హృదయం కొట్టుకుంటున్న శబ్దం వినిపించడం లేదు. హృదయం బ్రద్దలైన వేదన ప్రేమ నిట్టూర్పులే తప్ప కొన ఊపిరి పీలుస్తూ, తపిస్తూ నీవు కాదనుకున్న అతను ఇప్పుడు ఒక నామ మాత్రపు భగ్నప్రేమికుడు.
నిన్నటి వరకూ కలలోనూ కనలేకపోయాను. కానీ, ఇక్కడ, నా సమీపం లోనే నవ్వులు పూస్తూ .... నీవు, ఎంతో పరిచయం ఉన్న దానివిలా నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు, నేను నిన్ను స్పర్శించగలుగుతున్నానని. ఏ గారడీ చేయకుండానే రప్పించుకోగలిగానని ఇప్పుడు, ఇక్కడ .... నా పక్కనే నీవు నా జీవిత గమ్యం నా ఆశయం నా కోరికలన్నీ అల్లుకునున్న జీవన మాధుర్యానివిలా .... అందుకేనేమో .... ఇప్పుడు నాలో, నా జీవితం పరిపూర్ణతను పొందినంత ఆనందం!
చిత్రం! ఏ కోణం లో చూసినా నీ లక్షణాలు ఎంతో వైవిధ్యం గా నన్ను ప్రతిబింబించని విధంగా .... ఉన్నాయి. నీవు నా పక్కనే ఉన్నావు. ఉంటావు!? ఉండొచ్చని వింత నమ్మకం! నిజమైతే ఎంత అదృష్టవంతుడ్ని నేను.
ప్రత్యక్ష పాపం .... ఏదో కలవరపెడుతూ యేడుస్తూ ఉన్నాను నా హృదయం ఇంకా బ్రద్దలు కాలేదూ అని!? ......................... జీవితం వసారాలో ప్రతిధ్వనించుతూ నా రోదనల కన్నీళ్ళకు అర్ధం అయ్యి ఆవిరైపోతున్నాయి బుగ్గల్ని తడి చెయ్యకుండా .........................
మాటలే అన్ని వేళలా మాధ్యమం కానక్కర్లేదు అభిప్రాయాలు పంచుకునేందుకు తల ఊపి చెప్పొచ్చు కళ్ళతో అంగీకారం తెలపొచ్చు పరిపూర్ణంగా అర్ధం చేసుకునుంటే
మనో భావనల అర్ధాలు అవసరాలు మనుష్యుల జీవితాల్ని కలుపుతూ సాగే ప్రయాణం .... జీవితం లో. అప్పుడప్పుడు జారి ప్రమాదవశాత్తు .... కలిసి జీవించే సహజీవనం పొందటమే ఒక వరం
నీకు ముందే తెలుసా? దిగజారి నేను క్రిందకు పడిపోతానని నా తెగింపు నా తొందరపాటు పరిణామం ఇదే అని ఇలాగే జరుగుతుందని ............. ఏడ్చిన కళ్ళు మూసుకుపోయిన ముందుచూపు నేల మీద ప్రాకుతూ ఆ అరుపులు ఆ వేడుకోవడాలు మరణానికి ముందు హృదయాలు గొల్లున ఏడుస్తున్న ఆ ద్వనులు ............. బలవంతపు కారణాల భారమేదో మీదపడి అస్తిత్వం నలిగి చూర్ణం అయినట్లు అది నొప్పి లా కాక అంతకు ముందు .... ఎప్పుడో క్రింద పడినప్పటి బాధ తాలూకు మచ్చ అని మరిచిపోను.
ఉన్నచోటనే ఉన్న పళాన అచేతనం గా అసహనంగా అతని పదాలు గత కొన్ని రోజులు నెలలు గా అతన్నలక్ష్యం చేస్తున్నాయి. అవి అతని భావనలు కావు. అతని ఆత్మ శకలాలు హెచ్చరికలులా అతన్నీ అతని నోటినీ కట్టివేస్తూ ఉన్నాయి.
మరణించకుండానే అంత్యక్రియలు జరిగినట్లు ఆకలితో అలమటిస్తూ .... కళ్ళు చూడలేని, అర్ధం కాని కుళ్ళు పాచిన ఆహారం .... తినలేక తిని ఆత్మ దహించుకుపోయి గుండెను పిండినా రాని కన్నీళ్ళు లా ఆ మనోగతం
వేచి చూస్తున్న అస్థిత్వం నిన్నొక తోడనుకుంటుంది. తీవ్ర అంతర్మదనం సంఘర్షణ జరిగాకే .... అతని లో, అంతరంగం లో కాల్పనిక ఊహాసర్పాలు మేల్కొని ఒకదాన్నొకటి పెనవేసుకుపోయి గోరువెచ్చని బంధం ప్రేమ భావనేదో నరాలను పెనవేసుకుపోతూ ఉంది
రాతిరి వేళల్లో ఆరుబయట మడతమంచం పై పడుకునున్నప్పుడు ఆ చంద్రుడి చిహ్నం .... ఒదిలి వెళ్ళలేని ఒంటరితనం చిరు వెచ్చని స్నేహ భావన అల్లుకుపోయి ఆ శరీరము, ఆ మనసు ఈ విశ్వం .... అంతా శూన్యమయమై కేవలం "సహనం" అనే పదం మాత్రమే మిగిలి ఉన్నట్లు
రక్తసిక్తమై ప్రతి రోజూ అతను సందేహం, భయాలను ప్రక్షాళించుకుంటూ నీవు పంచిన పొదుపు పదాలు గుర్తుకొచ్చిన క్షణాలలో నిన్ను మళ్ళీ కోరుకొమ్మనే పిలుపు ఆశ అనే కొక్కానికి తగులుకుని నీవూ అతనూ తొలిసారిగా ఒకరి బాధలో ఒకరు నిండా మునిగిన క్షణాల ఆ ప్రేమ ఆ నమ్మకం గుర్తు తెచ్చుకుంటూ
అక్షీకరించమని అడుగుతున్నాడు. అతనితో నీ బంధాన్ని మళ్ళీ మళ్ళీ తిరగరాయమని అతని నమ్మకాన్ని ఎవ్వరూ చూడని ప్రదేశాల్లో ప్రయణించి ప్రమాణించినట్లు నీవు రాయగలవని న్యాయం చెయ్యగలవని అతనికి తెలుసు నీకూ రాయాలని ఉందని .... మీ జీవితాల్ని
నీకు జీవితం ఆరాటం, పోరాటం తెలుసు నిన్నిపుడు ప్రాదేయపడుతున్నాడు కళ్ళు మూసుకుని అతని నిశ్శబ్దాన్ని పీల్చి చూడు. మాటలు పదాలు దొర్లని ఆ సమయాన్ని నీ ప్రతి శ్వాస లోనూ ప్రాణం అతనవ్వాలనుకుంటున్న ఆశను అతని జ్ఞాపకాల్లో కాక అతని జీవితం లో తోడుగా నిన్నే కోరుకుంటున్న నిజాన్ని
ఆకలి అనిపించినప్పుడు అడగకుండా ఎలా తెలుసుకుంటావో .... ఆకలి తీరుస్తావు. ఒంటరినిలా నన్ను నేను దూరంగా విసిరేసుకున్న క్షణాల్లో అలసటతీర్చి నుదుట ముద్దుల వరాలిచ్చి, గుండెల్లోకి తీసుకుంటావు.... చెలీ, ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఒక స్త్రీవి నీలో, ప్రకృతిలో ఇన్ని రూపాలు, ఆంతర్యాలున్నాయని నిన్ను చూసాకే తెలుసుకున్నాను.
ఏ క్షణమూ ఆశను కోల్పోకుండా జీవితాన్ని ప్రేమించి ముందుకు కదిలేందుకు .... పురోగమించేందుకు ఒక నీడలా, ఒక ప్రేరణలా ఒక అదృష్టం లా నీ తోడు ప్రయాణం .... కారణమనిపించి ఎంత ఆశ్చర్యమో! ఎంత వింత అనుభూతో .... చెలీ!?
అతనిలో అతను కాలిపోతున్నాడు ఆ పిల్ల ప్రేమ కోసం నిరాశపరిచిందని, కాదన్నదని . హృదయం తో ఆటలాడుకుందని కనికరమైనా లేని స్త్రీ .... ఆమె అని అంత అందమైన చిరునవ్వు తో ఒక హృదయాన్నీ ఒక ప్రపంచాన్ని ఎలా ముక్కలు చేసిందని, అతను మంటల్లో కాలిపోతున్నాడు. విరహం సెగలు చెలరేగి కాలిపోతూ .... వసంతించదని తెలిసిన ప్రతి రాత్రీ అతను మండిపోతున్నాడు .... మండిపోక తప్పక అదిగో పొగ, అదే సెగ .... అతని జీవితం మంటల్లో కాలిపోతూ ....
ఆమె ఎలా ఉండగలుగుతుందో!? కాసింతైనా మానవత్వం, సిగ్గు అనిపించక .... అంత అవివేకం గా .... మంటల్లో అతను దహించబడటం చూస్తూ మరిచిపోయుంటుందా! ఆమె తనిచ్చిన మాట అతన్నొదిలెళ్ళనని అతనికి దూరంగా ఉండలేనని .... చేసిన బాస అంతా మోసం, అబద్దం అబద్దాలకోరు ఆమె అయినట్లు .... అతని గుండెను పగులగొట్టి ఎందుకిలా జరుగుతుందో .... అనిపిస్తూ!?
అతను కాలిపోతున్నాడు. లోలోన అంతరంగం లో మంటలు చెలరేగుతున్నాయి. అగ్నికీలలు చుట్టుముడుతూ అతను కాలిపోతున్నాడు. ఆమె ప్రేమ కోసం మంటల్లో .... ఆవిర్లు విరహం సెగలు అతని గుండెను కాల్చేస్తున్నాయి. విరహ వేదనను ఆమె తన మనసుతో చూడాలని .... అతను తనలో తాను కాలిపోతున్నాడు. ఆమె ప్రేమ కోసం .... తన మనోభీష్టం నెరవేరడం కోసం,
తెలుసుకోవాలనుంది. వినాలనుంది ఎవరైనా వివరిస్తే ఈ భయాన్ని అధిగమించడం ఎలాగో .... చెప్పే ప్రతి అక్షరం, పదాన్ని మనసులో ముద్రించుకుంటాను. కాస్తంత సులభమైన ప్రక్రియను సూచిస్తే బాగుంటుంది. అలాగే, చెప్పేప్పుడు మరిచిపోవద్దు! ఏ ఘనకార్యాన్నైనా సాదించేందుకు ధైర్యం, వివేకం ఎంతో అవసరమని గుర్తు చెయ్యడం!
తిరస్కరణంటే నాకు భయం! చెప్పాలి ఎవరైనా .... భయపడితే, నిజమైన ప్రేమను కోల్పోతానని ధైర్యం, ప్రేమ ఉంటేనే ఆనందం అని, పొందేందుకు అవసరమైతే పోరాటం చెయ్యాలి అని, ఒప్పించాలి .... నన్ను నాలోని భావనల పద శబ్దాలు బిగ్గరగా వినిపించక్కరలేకపోయినా, బలహీనంకాకుండా ఉండాలని .... నాకు సహాయం చెయ్యాలి ఎవరైనా నా మనసును, నా అంతరంగాన్నీ వినే ఒక మంచి లక్షణాన్ని నాలో పెంచేందుకు.
రక్షించాలి .... నన్ను చెప్పుడుమాటల ప్రభావం మీద పడకుండా అవి నాకు వినాలని లేదు. ఎవరైతే అర్ధం చేసుకోకుండా నాపై అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారో .... వారి నుంచి ................. నా చెయ్యందుకుని, నాకొక మంచి మార్గాన్ని చూపించాలి. నా మనసుకూ, నాకూ అనిపించేలా ఎట్టిపరిస్థితుల్లోనూ అనుసరించాల్సిన మార్గం అదే అని అనిపించేలా నా ముఖం పైకి ధైర్యాన్ని ఊదాలి ఎవరైనా ఆ వెచ్చదనం నా కళ్ళను తెరిచేవరకూ
చల్లటి గాలి దోబూచుల ఆటలాడుతూ ఉన్న వింత భావన .... ఒంటిపై తడిచిన చీర పరదా .... కదులుతూ గాలి, శితల స్పర్శ తో సిగ్గు మొగ్గై .... ఆమె ఆ సాగర కెరటాలపై వీస్తున్న చల్లటి గాలై .... అతను
అతని లోని రాక్షసత్వం .... స్వార్ధ ఆలోచనల చీకటి పొగమంచు ..... జరిగిన సంఘటనను మర్చిపోవాలనే ప్రయత్నం .... మళ్ళీ వస్తానని ఆమే చెప్పిన వీడ్కోలులో ఏదో అమానవీయానందం .... అతనిలో ఆమె నుంచి అన్నీ దోచుకుని ఆమె శరీరాన్ని, ఆమె అమాయకత్వాన్నీ ఆమె కలల్నీ మోసపు మాటల ముసుగులో ఆమెను .... గాయపరిచి, ఆత్మను బాధించి ఆ వేళ్ళ సున్నిత స్పర్శలో అమాయకత్వాన్ని బహుమానం గా పొంది అహంకారం తో దూరంగా విసిరేసి ....
ఎంతో దుర్మార్గంగా, ఎంతో కిరాతకంగా, అతని ప్రవర్తన చేసిన గాయాల గుర్తులు మాత్రం కోల్పోయిన ఆమె అమాయకత్వానికి ఆమె నిర్దోషిత్వానికి నిదర్శనాలై. వెళ్ళిపోబోతూ ఆమె సిగ్గుపడింది. నవ్వుకుంది తనలో తాను. అప్పుడు ఆమె నవ్వులో ఎంత అమాయకత్వము! ఎంత నిర్మలత్వము! వెళ్ళబోతూ చేరవచ్చి అతన్ని బుగ్గలపై ముద్దాడింది .... ఒక్కసారి
అతని లోని మృగాన్ని క్షమించేసి, అమాయకం గా తన ఊహల్లోని రాజకుమారుడినే అతనిలో చూస్తూ, ఆమె వెళ్ళిపోయింది. అతను మాయమైపోతాడని తెలియక
ఎక్కడో ఉన్నాను. కానీ ఇక్కడ నీ శ్వాస ద్వారా నిశ్శబ్దంగా నీలోకి ప్రవహిస్తూ .... నీలోనే ఉన్న అనుభూతి. ఔనూ! నీకూ అనిపిస్తుందా? నేను నీలోనే ఉన్నానని నీలోనే ఉండి నిన్ను స్పర్శిస్తున్నానని నా స్పర్శ వెచ్చదనం నా చిరునవ్వు చల్లదనం నీ అనుభూతికి వస్తున్నాయా!? నాకు మాత్రం .... నీవు నన్ను నిశ్వసిస్తున్నట్లుంది. నీలో పెనుతుఫాను అలల అల్లకల్లోలతలు సర్దుమణిగించేందుకు నేను కృషి చేస్తున్నట్లుంది.
నేను నిన్ను అనుభూతిచెందుతున్నట్లు నీవు నన్ను స్పర్శిస్తున్నట్లు నేను నీకు అతి సమీపంగా ఉండి నీ ప్రేమ ను పొందుతున్నట్లుంటుంది. నా బాధ నాలోని అనిచ్చితి, నాలోని ఆవేశం శాంతిమయం, నిర్మలం అవుతూ మమైకమై మనం ఎక్కడెక్కడ్నుంచో వచ్చి ఒక్కటైనట్లుందిక్కడ
నిన్న అన్నది నేనే అది ఒక విషయం అదృష్టం అని అది ఎప్పుడూ వచ్చి వెళుతూ ఉంటుంది అని. ............... అది, ఒక నిజం, ఒక నాణ్యత, ఒక స్వచ్చత, ఒక పరిపుర్ణత, ఒక అవసరం .... పొందేవరకూ అని. ............. అది, ఒక చిక్కని ఆలోచన అని, మరొకసారి ఆలోచించాలనిపించని భావన అని. .............
కానీ ఇప్పుడు అనిపిస్తుంది. ఆ వచ్చి వెళ్ళే కల, ఆ అదృష్టం, ఆ స్వచ్చ పరిపూర్ణత్వ ఆలోచనల సమిష్టి రూపం .... నీవేనేమో అని.
వెలుతురు లేదు. ఎటు వెళ్ళాలో తెలియదు పక్కన నడిచేందుకు తోడెవరూ లేరు .... అని నీకు అనిపించినప్పుడు .... నీ వద్దకు వస్తాను. ఓ పిల్లా! నేనే నీవద్దకు వస్తాను. చీకట్లు చిక్కగా ముసిరి పెనుతుఫాను ప్రబలిన క్షణాల్లో ..... నీవు నా కోసం రానక్కర్లేదు. నేనే వస్తాను. ఓ పిల్లా! నేనే వస్తాను.
అప్పుడప్పుడూ కలలు ఎండిపోయి నిద్దురలేమి దరిదాపుల్లో మంచిరోజులు కానరాక ఎలా బయటపడాలో ఏమి చెయ్యాలో తెలియక .... అయోమయం లో నిన్ను నీవు కోల్పోతావేమో .... అప్పుడు కూడా భయపడకు. కన్నీళ్ళెన్ని కురిసినా చలించకు! నీ ఆత్మ పిలుపు నాకు వినపడుతుంది. ఒట్టేసి చెబుతున్నా! ప్రళయమే వచ్చినా నేనక్కడ నీపక్కనుంటాను .... అప్పుడు.
ఒకవేళ మనం ఒకరికొకరమై సహజీవనం సాగించే అవకాశం లేకపోయినా స్నేహితులుగా అయినా ఉందాము .... ఎప్పటికీ, అందుకని నా ప్రమాణాన్ని నమ్ము! మళ్ళీ చెబుతున్నా .... మూడో ప్రపంచ యుద్ధమే జరిగినా అన్నీ పరిత్యజించి నీ వద్దకు వస్తాను. ఓ పిల్లా! నేనే నీవద్దకు వస్తాను నీ తోడుగా ఉండేందుకు
నీకు కావల్సింది, తెలియాల్సింది ఏ సమయం లో ఏ సహాయాన్ని ఎవరినుంచి ఆశించొచ్చో అడగొచ్చో అనే, ఎవరు నీ సమశ్యను అర్ధం చేసుకోగలరో అనే, ఒకవేళ నీకుగానీ నీ ఆత్మ బలహీనపడిపోతుందనిపించి ఒక నమ్మకం, ఆస్వాసన అవసరం అయి నేను కాక మరి ఎవరూ నీ జీవితం లో లేకపోతే నేనే వస్తాను .... సంబ్రమముగా ఓ పిల్లా! నీ చెయ్యందుకునేందుకు,
ఈ ఉదయం గూడు నుంచి అడవికి వొచ్చి పడీదులు, పొదలు కలియతిరిగి గడ్డిపూలు, పచ్చిగడ్డి, వడ్ల కంకులు, ఏరుకుని తిరిగి గూడువైపు కదులుతూ ఉన్నా సూర్యాస్తమయ కిరణాల ముద్దు కోసం పరితపిస్తూ
నా ఏడుపు వినిపిస్తుంది కదూ! ....................... నిజంగా నిర్లక్ష్యం కాకపోతే .... ఎంతో ముఖ్యమూ, ప్రాముఖ్యమూ లేకపోతే ఈ ప్రపంచంలో ఎందుకు ఈ రక్త స్రావము? ఎందుకు శాంతిపై ఈ అనాశక్తత!? .......................... నేను, ఈ ప్రపంచాన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పుకోగలను. కానీ, అలా చెప్పడంవల్ల గాయం తగ్గి నొప్పి మాయం కాదు, మనశ్శాంతి దొరకదని తెలుసు. అందుకే, ప్రతి రోజూ ప్రార్ధిస్తున్నాను .... దయ కోసం సుమ సుఘందాలు వర్షించినట్లు నా కన్నీళ్ళు .... నా ఆత్మను చిల్లులు పొడుస్తూనే ఉన్నా, ...................... ఆ సూర్యుడు ఏమయ్యాడో? ఆ వెన్నెల రేడు, ఆ నక్షత్రాలు ఏమయ్యాయో? ....................... నేను, ఇంటి పైకప్పుపై కూర్చుని, జారి క్రిందపడ్డ వివేకము, రెక్కలూ లేని ఒక నీచజాతి పక్షిని. పాదరక్షలలో గులక రాయిలాంటి వాడిని. దారి లో కాళ్ళకు అతుక్కుపోయే మెత్తటి దూళి లాంటి వాడిని. రక్షింప దగని పాపాత్ముడ్ని! .................... పాడేందుకు పాట, తోడూ లేని, ఒంటరి పక్షిని .... నేను ఏమీకాని, ఏమీలేని శూన్యం పదాలే ఆస్తిగా ఊపిరిలేనట్లు వీస్తున్న గాలికి వ్యతిరేకంగా ఈకలు ఊపుతున్న .... ఒక నిట్టూర్పును. ............................. అదిగో వినిపించే ఆ ఏడుపు నాదే! ఆకాశం నుంచి రాలుతున్న ఆ వర్షపు చినుకులు సంకుచిత మానసిక స్థితి లో కొట్టుకుంటున్న ఒక సామాన్యుడి కన్నీళ్ళు అవి. నీరులా, విషాదం లా ఈ ప్రపంచాన్ని తడిపేస్తూ, ......................
ఆ ఏడుపును చూడకుండా దృష్టి మరల్చుకోలేవు. నీవు మూయలేవు .... నీ ఎద కిటికీ తలుపులు తుడిచెయ్యలేవు .... ఈ నా కన్నీళ్ళ తడిని, .................... నేను ఏడ్చాను . ఒక నది లా .... ప్రతి రోజూ చీకటి రాత్రుళ్ళను తడిచేస్తూ .................... నేను ఏడుస్తున్నాను ఎవరి ఓదార్పూ దొరకని ఒక పసిబాలుడిలా ........................ నేను ఎడుస్తూ ఉంటాను .... ఎవరూ పట్టించుకోరని తెలిసీ నన్నూ, నా ఏడుపునూ తొలకరి వర్షానికి తడిసిన మట్టివాసననూ.
ఎందరో భగ్న ప్రేమికుల జీవితాల చరిత్రల సమాధుల్లో ప్రేమించేందుకు తొందర తగదనే వివేకం సారాన్ని కాదనరాదని తెలిసీ .... పడిపోయాను నీ ప్రేమ లో పడిన చోటే ఉండాలనిపించేసరికి ప్రేమ నేరం కాదని సర్ధి చెప్పుకుంటున్నాను. బయటపడలేక .... ప్రాకృతికం అని,
ఏ నది ఎక్కడ ఆరంభం అయినా ఆ నదీ ప్రవాహం ఆ నది గమ్యం సాగరమే .... ప్రియా! నా జీవితం గమ్యం అర్ధం నీవే కావడం దైవ నిర్ణయం .... యాదృచ్ఛికం అని అనుకోలేను. నా మనోభావోదృతి అని తెలిసే అడుగుతున్నా! నా చెయ్యందుకో అని నన్నూ, నా జీవితాన్ని నీదనుకో అని నిశ్చలన సాగరంలో తేలు అలను నన్ను దరికి చేర్చుకోమని
నీ స్వరం లో ఆత్మీయత, దగ్గరి పరిచయం లా మృదు లక్షణం ఏదో ........... నన్ను నీ దగ్గరికి లాగుతుంది. నేల చూపులు పక్క చూపులు .... మెలికలు తిరిగేలా చేస్తూ, ........... నా లో వణుకు నీతో మరింత సమీపం సాన్నిహిత్యాన్ని కోరుకుంటూ
చాలా కష్టంగా ఉంది. నన్ను నేను ప్రేమించడం .... ఈ రోజు అమూల్యమైనదేదో కోల్పోయాననే బాధ ఎవరినుంచైనా ఏదో పొందాలని .... ప్రేమనే పొందాలని! ప్రేమ రాగం ప్రేమ భావం ప్రేమ లోని స్వచ్చత పరిపూర్ణతలను కోల్పొయిన కసి పెరిగి ప్రేమ అనేది శ్వాసించాల్సినంత అవసరం లా .... నేడు నా మానసిక స్థితి దిగజారి నాలో .... నిరాశక్తత ప్రబలి అపనమ్మకం పొగమంచులోంచి లేశమాత్రపు అనుభూతిని కూడా పొందలేక చిన్నబోయిన నిట్టూర్పు ముఖంలో చిరునవ్వు పరామర్శను పూయించలేక మానసికంగా నలిగిపోతూ ఉన్నాను. ప్రయత్నలోపం లేదు ప్రతి ప్రయత్నమూ ఎంతో కృత్రిమంగా ఉంది.
చాలా కష్టంగా ఉంది .... ప్రేమించగలగడం చాలా కష్టంగా ఉంది .... నా ఈ స్థితి ఈ రూపం లో నేను, ఒక ఒంటరి అస్తిత్వాన్ని ఒక ఒంటరి కృంగిపోయిన మానసిక స్థితిని అంతరంగంలో పల్లవించి పరిమళించాల్సిన వడలిన పుష్పం అందాన్ని ఊపిరి కోల్పోతున్న ప్రేమను ప్రేమించగలరేమో .... ఎవరైనా అని ప్రేమించబడాలని .... ఈ రోజు నేను