కాసింత ధైర్యం విశ్వాసం ఈ ఉదయం,
తేరిపార చూసాక
ప్రశాంతతను నీ ముఖం పై
కప్పేసిన పూలమాలలు దాచేసిన జీవపరిమళాన్ని
ఆ రాలిన పువ్వులవెనుక మాయమైన నవ్వుల మెరుపులను
పారిపోయిన ఆ గలగలల నవ్వుల శబ్దాలను
నిజాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం
కానీ తప్పలేదు
నీ ఆత్మను ఎదురుచూస్తూ ఉండమనలేక.
వీడ్కోలు చెప్పక తప్పని సమయం
పిల్లా! బయలుదేరు నువ్విక స్వర్గానికి అనక
పోరాట విరమణ తప్పలేదు.
ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో అనే పట్టింపులకు సమయం కాదు.
సెలవు తీసుకోవాల్సిన వయస్సులో
సూర్యోదయానికి ఎదురుగా మండుటెండలో
ముందుకు కదలాల్సిన స్థితి
కష్టాలన్నిటికీ మందు కాలమే అనుకుని
పురోగమించక తప్పని స్థితి
నీకు తెలుసా .... పిల్లా!
ప్రేమతో నీవూ నేనూ పంచుకున్న క్షణాలు
ఆ మధురానుభూతులు
కాలగతిలో ఏనాడో జారిపోయాయని.
అయినా ఇప్పుడు అంతరంగంలో నీ గొంతు
నా క్షేమాన్నే ఆకాంక్షిస్తూ .... మందలిస్తూ,
గర్వంగా ఉంది వింటున్నప్పుడు
ఆనందంగా నీకు వీడ్కోలు పలుకుతున్నందుకు
కప్పేసిన పూలమాలలు దాచేసిన జీవపరిమళాన్ని
ReplyDeleteఆ రాలిన పువ్వులవెనుక మాయమైన నవ్వుల మెరుపులను
పారిపోయిన ఆ గలగలల నవ్వుల శబ్దాలను
నిజాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం..heart touching lines.
హార్ట్ టచింగ్ లయిన్స్ .... స్పందన
Deleteధన్యాభివాదాలు పద్మార్పిత గారు! సుప్రభాతం!!