ముగింపుకు
ఎవరు ఎవర్ని నిందించీ
ప్రయోజనం ఉండదు.
ఏ గోప్య జీవనపు
పరిణామమైనా ఇంతే!
ఇలానే ఉంటుందనేది చారిత్రక సత్యం.
ఏవో .... కొన్ని విలువైన క్షణాల
అనుభూతుల్ని ఏరుకునేందుకు
మిగుల్చుకునేందుకు ....
ఆబగా ....
తపించి .... తపన తీరని శవాలులా,
నేను కూడా,
అనంతమైన కోరికల
ఆరాటం పెనుగులాట లో ....
ఏ కోరికలూ తీరని
కథకు
తెరపడటం బాధనే కలిగిస్తుంది.
కానీ నిజం
వాస్తవానికీ, కట్టుబాట్లకూ
దూరంగా పారిపోలేని
సామాజిక జీవులం.
కన్నీళ్ళు పెట్టుకోకండెవ్వరూ
జరిగిపోయి,
పోగొట్టుకున్న నిన్న లోకి
తొంగిచూసి
ఆ జ్ఞాపకాల ప్రతిధ్వనుల్ని వింటూ ....
మేము గానే ఉన్నాము.
నేడు గత్యంతరం లేని స్థితిలో
ఆమె గా, నేను గా .... ఇలా
విడివిడి గా .... అపరిచితులము లా
ఒంటరులము గా ....
ప్రేమ, అపజయం పాలైన
శేష శవాలముగా
నగ్న సత్యాలు అనుచిత చిత్రాలతో .
ReplyDeleteనగ్న సత్యాలు
Deleteచిత్రాలే అనుచితం గా
మీ సూచనను గమనించాను .... తప్పక జాగ్రత్త పడతాను ముందు ముందు
ధన్యమనోభివాదాలు శర్మ గారు!