నీ చర్యల ప్రభావం
నాపై ఎంత గాడంగా ఉందో
నే నెరుగని దారులవెంట
ఎక్కడికో లాక్కువెళుతున్నావు.
నా గమ్యాన్ని నీవే నిర్దేశిస్తూ .... నడుస్తుంటే
నిన్ను చంపెయ్యాలనే కసి
నీ రక్తం చూడాలనే కోపం ....
నిష్కర్షగా చెబుతున్నా
నా భావనల్ని వేళాకోళం అనుకోకు!
గాయపడ్డవారి కోసమే
జీవిస్తున్నట్లు,
బాధతో విలవిల్లాడే వారి
బాధలు తీర్చేందుకే ఉన్నట్లు,
గుండెలుపగిలేలా రోదించే వారి
ఓదార్పు కోసమే
జీవితం అంకితం అన్నావు.
నన్నూ లాక్కువెళుతున్నావు
అర్ధం కావడం లేదు. నీ పిచ్చి ....
మళ్ళీ ఎవరినీ నీవు గాయపరచకుండా
పిడిగుద్దుల వర్షం కురవాలని,
ఆ వర్షం లో నిలువెల్లా ముంచాలని
నిన్ను మట్టికరిపించాలని ....
అకస్మాత్తుగా
నీ ఊహకు అందని రీతిలో నీపై
దాడి చేసి, నీకు బుద్ది చెప్పాలని
ఇన్నాళ్ళూ నిన్ను నమ్మినందుకు
నీవునేర్పిన కాపఠ్యాన్ని
నీపైనే ప్రదర్శించాలనే .... మనోభావనలు నాలో
నీవు అనారోగ్యంతో బలహీనపడి
చేసిన నమ్మకద్రోహానికి
శిక్ష అనుభవిస్తూ ఉంటే చూడాలనే ....
మృగత్వం, రాక్షసత్వం
నాలో పెరిగిపోతూ, .... ఆలోచిస్తుంటే
నీ సాహచర్యంలో నాలో
మానవత్వం ఇంతగా దిగజారిందా అనే ప్రశ్న
ప్రతీకారం లో
ఇంత సరదా ఉందా అనే శేష ప్రశ్నలా
భావం బాగుంది . మంచిగ నమ్మిన వాణ్ణి మోసం చేస్తే ఎలా మారతాడో చక్కగా వర్ణించారు .
ReplyDeleteచిన్న చిన్న సవరణలు పరిశీలించండి .
నే నెరుగని దారుల వెంట
నన్నూ లాక్కుంటూ వెళ్తున్నావు
అర్ధం కావడం లేదు ఈ నీ పిచ్చి ....
పిడిగుద్దుల వర్షం నీపై కురవాలని,
ఆ వర్షం లో నిన్ను నిలువెల్లా ముంచాలని,
మట్టికరిపించాలని ....
మానవత్వం యింతగా దిగజారిందా అనే ప్రశ్న ఓ వైపు ,
ప్రతీకారం లో యింత సరదా ఉందా అనే శేష ప్రశ్న మఱో వైపు
భావం బాగుంది . మంచిగ నమ్మిన వాణ్ణి మోసం చేస్తే ఎలా మారతాడో చక్కగా వర్ణించారు
Deleteమానవత్వం యింతగా దిగజారిందా అనే ప్రశ్న ఓ వైపు ,
ప్రతీకారం లో యింత సరదా ఉందా అనే శేష ప్రశ్న మఱో వైపు
చక్కని సూచనలు విశ్లేషణల స్పందన అభినందన
ధన్యాభివాదాలు శర్మ గారు! శుభోదయం!!