Saturday, July 19, 2014

నేను నేనే


ఎగుడు, దిగుడు .... రాళ్ళూ, రప్పల బాట లో
నడుస్తూ ఉన్నాను.
పడుతూ, లేస్తూ
ఒక మధ్య తరగతి మనిషిని
నేను నేను లా .... మంచీచెడులను
మది పుటల్లో అనుభవం జ్ఞాపకాలుగా రాసుకుంటూ,


ఒక ఉమ్మడి కుటుంభం .... అమ్మ, నాన్న
అన్న, చెల్లి, తాత, బామ్మ
కానరాని వారి అడుగుల జాడల .... కట్టుబాట్ల లో
ప్రకృతిని పరామర్శిస్తూ
జీవనయానం సాగిస్తూ
అదే పురోగమనమని భావిస్తూ ఉన్నాను.

ఈ రాత్రి .... ఈ చిమ్మ చీకటి లో
అపసవ్యతలను చూడలేకపోయినా
నక్షత్రాల కాంతి ఆసరా తో స్పష్టం గా, వాస్తవాల్ని
పరిసరాల్ని చూడగలుగుతున్నాను.
మఱి ఉమ్మడి సమజం లో సహ భాగస్వామిని కదా!


ఆ నేను .... నేనే.

2 comments:

  1. మధ్య తరగతి మానవుడి స్థితిని చక్కగా వర్ణించారు .

    ఈ రాత్రి .... ఈ చిమ్మ చీకటి లో
    అంటే బాగుంటుంది . చల్లదనం చీకటి లో కంటే

    ఉమ్మడి సమజం లో సహ భాగస్వామిని కంటే
    మఱి ఉమ్మడి సమజం లో సహ భాగస్వామిని కదా!
    అంటే బాగుంటుంది .

    ఆ నేను .... నేనే .

    ReplyDelete
    Replies
    1. మధ్య తరగతి మానవుడి స్థితిని చక్కగా వర్ణించారు.

      బాగుంది. ఎంతో గర్వంగా ఉంది .... మీ అభినందన స్పందన
      చివర మీరిచ్చిన ట్విస్ట్ చాలా బాగుంది. అడాప్ట్ చేసుకుని సవరించుకుంటున్నాను మాష్టారు.

      _/\_లు శర్మ గారు!

      Delete