Friday, July 11, 2014

రాజీ పడక తప్పట్లేదు


జారిపోతున్న కాలం అంచు మీద నడుస్తున్నాను.
నేడును, సూర్యోదయం చైతన్యాన్ని శోధిస్తూ,
సుదీర్ఘంగా,
లోతుగా
ఏదో అద్భుతం జరిగిపోవాలని మాత్రం కాదు.


వింత వింత మనోభావనల ఇంద్రధనస్సు రంగులు
గడ్డిపూల, అడవికుసుమాల పై పరావర్తనం చెంది
నా మనసు ఖాళీలను నింపుతున్న
ఆ గోరువెచ్చని ఉదయకిరణాల మంచుతో
శరీరాన్ని తడుపుతూ .... అపసృతులను దిద్దుకుందామని 

తొలిసారి .... ఆ రోజే
చిరునవ్వు తో మత్రమే పర్యాప్తం కాని
నీ తొలి కరచాలనం అందుకున్నాను.
బహుశ నీకూ గుర్తుండే ఉంటుంది.
ఇన్నాళ్ళూ నేను మరువని మరువలేని మధురానుభూతి

ఆ అనుభూతి నా హృదయం .... నా లో
లో లోతుల్లొకి జారిపోయినట్లయ్యి
ఆ తదుపరి శ్వాసను కోల్పోయి
కొట్టుకోవడం మానెయ్యడంతో కూడిన అలౌక్యానందం.
వింత కాని వింత వాస్తవం అది

నీ స్పర్శ లోని ఆ మృదుత్వం మహత్యం వెచ్చదనం
విధ్యుత్తులా నా అంతరాంతరాల్లోకి పాకి
జిత్తులమారి వింత ఆసక్తేదో నాలో ప్రబలిన క్షణాలవి
అర్ధంలేని కోరిక ఆరాటం ఏదో అవకాశం ఆలోచనల్లో
అలసట కలిగిన క్షణాలు అవి

ఆ క్షణం నా మదిని ఆవహించిన
ఆ భయాలను జయించాల్సొచ్చిన పోరాటం
నా మది లో తీవ్రస్థాయి ని చేరి
నాది తప్పుడు ప్రేమ కాదనే భావన నుంచి
నన్ను నేను లాక్కోవలసి రావడం లోని అనిశ్చితి ....

నా ఆత్మను,
నీ వాస్తవికత ముద్దాడినట్లు .... అంతలోనే
నేను నిన్ను గాడంగా కౌగిలించుకున్నట్లు
ఏ జన్మలోనో మౌనం గా నీవాడిన గుసగుసల తిట్లు
నా జ్ఞాపకాల్లో ఇరుక్కుని అప్పుడే వెలికివచ్చినట్లు

పక్కన నీవు లేకపోయినా
చల్ల గాలి లో
ఆ గాలికి కదిలిన ఆకుల చప్పుళ్ళలో
ఆ గుసగుసలు వినబడొచ్చనే జిజ్ఞాశ
నన్ను నిలకడ నిద్రకు దురం చేస్తూ

ఆ నిశ్శబ్ద గాత్రాల జ్ఞాపకాల నైరాశ్యం నుంచి
భద్రతావశ్యకత పెరిగే .... ఇప్పుడిలా
జారిపోయిన నిన్న అనే కాలం అంచుమీంచి
ఇప్పుడు నేను ఇక్కడ,
నెమ్మదిగా నేడు వైపు నడుస్తూ .... కాలం తో రాజీపడుతూ

6 comments:

  1. కాలం గురించి ఇంతకంటే బాగా ఎవరు చెప్పగలరు,
    నిజమే అది జారిపోయిన తర్వాతే బద్రత పెరుగుతుంది.

    ReplyDelete
    Replies
    1. కాలం గురించి ఇంతకంటే బాగా ఎవరు చెప్పగలరు?
      నిజమే!
      అది జారిపోయిన తర్వాతే బద్రత పెరుగుతుంది.

      బాగుంది పరిశీలన స్నేహ పరామర్శ అభినందన
      ధన్యాభివాదాలు మెరాజ్ గారు!

      Delete
  2. నమ్మకాన్ని మించిన దైవం ( శక్థి ) లేదు
    అనుభవాన్ని మించిన చదువు లేదంటారు
    నిన్నటి , నేటి అనుభవాలే రేపటి అడుగులకు ( భవిష్యత్తుకు ) నాంది కదా!
    బాగుంది , కాకుంటే కొంచెం సంక్షిప్తంగా చెప్తే ఇంకా బాగుండేదేమో , అవకాశం ఉంటే ఓ మారు ఆలోచించగలరు .

    ReplyDelete
    Replies
    1. నమ్మకాన్ని మించిన దైవం ( శక్థి ) లేదు
      అనుభవాన్ని మించిన చదువు లేదంటారు
      నిన్నటి, నేటి అనుభవాలే రేపటి అడుగులకు ( భవిష్యత్తుకు ) నాంది కదా!
      బాగుంది ,
      కాకుంటే కొంచెం సంక్షిప్తంగా చెప్తే ఇంకా బాగుండేదేమో,
      అవకాశం ఉంటే ఓ మారు ఆలోచించగలరు

      చక్కని విశ్లేషణ సూచన
      బాగుంది పరిశీలనాత్మక స్పందన
      ధన్యాభివాదాలు శర్మ గారు!

      Delete
  3. కాలం ఇంత వేదనా భరితమని తెలిసికూడా కాల్మే తీర్చునటూ నిరీక్షిస్తాం ఎందుకో ఏమో !?

    ReplyDelete
    Replies
    1. కాలం ఇంత వేదనా భరితమని తెలిసి కూడా కాలమే తీర్చునంటూ నిరీక్షిస్తాం .... ఎందుకో .... ఏమో !?
      నిజమే
      చక్కని పరిశీలన స్నేహ ప్రోత్సాహక స్పందన
      ధన్యవాదాలు పద్మార్పిత గారు! శుభోదయం!!

      Delete