Friday, July 18, 2014

పరిపూర్ణుడ్నయ్యానిప్పుడే




ఆమెలో సంపూర్ణతను చూసి
ఆమెతోనే నడుస్తూ వస్తున్నాను.
ఎన్నో యుగాలుగా
పరిపూర్ణ మానవుడ్నౌదామని

సమాజం ఉచ్చులో పీకలవరకూ ఇరుక్కుపోయి
కట్టుబాట్లే అని సర్దిచెప్పుకుని .... అందరితో పాటు నేనూ అని
ఎన్నో కుతంత్రాల దౌష్ట్యాల భారి నుండి
ఆమెను సంరక్షించుకుంటూ .... ఎన్నో సార్లు మరణించాను 




అన్ని సార్లూ మళ్ళీ పుట్టాను
ఆమె నీడనవ్వాలని 
ఆమెను అడిగాను .... ఒక్కసారి 
నన్ను చంపెయ్యరాదా ప్రియా అని,

నవ్వింది. చివరికి నన్నంగీకరించింది .... ఈ జన్మ లో
ఇరువురమూ కలిసి మరణించేందుకు 
దాంపత్యం సహజీవనసాంగత్యం
ఇప్పుడు బ్రహ్మత్వం పరిపూర్ణత పొందిన ఆనందం నాలో

4 comments:

  1. ఒకటి ఎన్నటికీ సంపూర్ణం కానేరదు ఈ మానవ జీవితంలో .
    ఆడ వారు అంగీకరిస్తేనే , మమేకమైనప్పుడే పరిపూర్ణత్వం సాధిస్తుంది .
    చక్కటి భావం . బాగుంది .

    కాకుంటే కొంచెం మార్పులు అవసరమనిపించి ఈ వ్యాఖ్య వ్రాస్తున్నాను .

    సమాజం ఉచ్చులో పీకలవరకూ ఇరుక్కుపోయి
    కట్టుబాట్లే అని సర్దిచెప్పుకుని .... అందరితో పాటు నేనూ అని
    ఎన్నో కుతంత్రాల దౌష్ట్యాల భారి నుండి
    ఆమెను సంరక్షించుకుంటూ .... ఎన్నో సార్లు మరణించాను

    అన్ని సార్లూ మళ్ళీ పుట్టాను
    ఆమె నీడనవ్వాలని .
    ఎన్నో యుగాలుగా
    పరిపూర్ణ మానవుడ్నౌదామని .

    ఆమెను అడిగాను .... ఒక్కసారి
    నన్ను చంపెయ్యరాదా ప్రియా అని,

    నవ్వింది. చివరికి నన్నంగీకరించింది ....
    ఈ జన్మ లో ఇరువురమూ కలిసి మరణించేందుకు
    దాంపత్యం సహజీవనసాంగత్యం చేసేటందుకు

    ఆమెలో ఆ సంపూర్ణతను చూసి
    ఆమెతోనే నడుస్తూ వస్తున్నాను.

    ఇప్పుడే బ్రహ్మత్వం పరిపూర్ణత పొందిన ఆనందం నాలో .

    ReplyDelete
    Replies
    1. ఒకటి ఎన్నటికీ సంపూర్ణం కానేరదు ఈ మానవ జీవితంలో .
      ఆడ వారు అంగీకరిస్తేనే , మమేకమైనప్పుడే పరిపూర్ణత్వం సాధిస్తుంది .
      చక్కటి భావం. బాగుంది.

      కాకుంటే కొంచెం మార్పులు అవసరమనిపించి ఈ వ్యాఖ్య వ్రాస్తున్నాను .

      చాలా చాలా బాగుంది మీ విశ్లేషణ
      చక్కని మీ ఎడిటింగ్
      మీలాంటి వారి స్నేహం పరిచయం ఎంత అమూల్యమైనవో ఈ కొన్నినాళ్ళలోనే మార్గదర్శకతను పొందుతూ అర్ధం చేసుకున్నాను.
      ధన్యమనోభివాదాలు శర్మ గారు! శుభమధ్యాహ్నం!!

      Delete
  2. పరిపూర్నమైన ప్రేమ,
    నిర్దిష్టమైన ప్రేమా అందరికీ సాద్యం కాకపోవచ్చు,
    అందుకే అలాంటి ప్రేమలు పిచ్చితనం గా కనిపిస్తున్నాయి , బాగుంది సర్.

    ReplyDelete
    Replies
    1. పరిపూర్ణమైన ప్రేమ,
      నిర్దిష్టమైన ప్రేమా అందరికీ సాద్యం కాకపోవచ్చు,
      అందుకే .... ప్రేమలు పిచ్చితనం గా కనిపిస్తున్నాయి,

      బాగుంది సర్.

      బాగుంది స్పందన స్నేహాభినందన
      ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు! శుభసాయంత్రం!1

      Delete