Friday, July 18, 2014

స్వగతం లో




కానరాని చీకటి రూపాలు,
ఉద్వేగభరిత భావనలు
నా మదిలో ....
అనశ్వరంగా కదులుతూ

పరస్పరం ప్రశ్నలుగా మారి
సమన్వయలోపం తో
మృదువైన చర్మం పై
చెక్కిన శాసనాలై

ఈ తిరుగుబాటు మనస్సు కు
ఏవో ఆవేశం పలుకుల్ని
మనోభావనల నెమలి ఈక తో
కథో, కావ్యమో రాయాలని

తీపి కలల ప్రేమను
యౌవ్వనం శాశ్వతత్వం
బ్రమ
తొలిపలుకులుగా 




ధైర్యం, డాంబికం,
సొగసైన పదాల దిద్దుళ్ళతో
నిరాశా
నిస్పృహల సమాజంలో

చిక్కని చీకటి కమ్మిన వేళ
ఊహలు, బ్రమల జీవితాన్ని
అద్భుత .... నక్షత్రాల ఆకాశం లా చిత్రించి
సంభరపడాలని స్వగతం లో.


10 comments:

  1. కనిపించని రూపాలే కమ్మని స్వగతాలని చెప్తుంటే. కనిపిస్తే ఇంకేమైనా ఉందంటారా :-)

    ReplyDelete
    Replies
    1. కనిపించని రూపాలే కమ్మని స్వగతాలని చెబుతుంటే. కనిపిస్తుంటే ఇంకేమైనా ఉందంటారా :-)
      చిక్కని స్నేహ ప్రోత్సాహకాభినందన స్పందన
      ధన్యవాదాలు పద్మార్పిత గారు! శుభమధ్యాహ్నం!!

      Delete
  2. Replies
    1. బాగుంది
      బాగుంది స్నేహ ప్రోత్సాహక స్పందన అభినందన
      _/\_లు శర్మ గారు!

      Delete
  3. chaalaa baagundi Chandra gaaru:-):-)

    ReplyDelete
    Replies

    1. చాలా బాగుంది చంద్ర గారు:-):-)
      చాలా బాగుంది అభినందన స్పందన
      హన్యవాదాలు ఎగిసే అలలు గారు! శుభమధ్యాహ్నం!!

      Delete
  4. స్వగతాన్ని ఈ పుటపై అక్షరాలతో వెలుపలికి స్వాగతినించిన తీరు బావుంది

    ReplyDelete
    Replies
    1. స్వగతాన్ని ఈ పుటపై అక్షరాలతో వెలుపలికి స్వాగతినించిన తీరు బావుంది.
      బ్లాగు కు హృదయపూర్వక స్వాగతం ఓ చిన్నమాట గారు
      స్పందన బాగుంది.
      ధన్యవాదాలు! శుభమధ్యాహ్నం!!

      Delete
  5. చిక్కని చీకటి కమ్మిన వేళ
    ఊహలు, బ్రమల జీవితాన్ని
    అద్భుత .... నక్షత్రాల ఆకాశం లా చిత్రించి
    సంభరపడాలని స్వగతం లో.
    చాలా బాగుంది చంద్రగారు.

    ReplyDelete
    Replies
    1. చిక్కని చీకటి కమ్మిన వేళ
      ఊహలు, బ్రమల జీవితాన్ని
      అద్భుత .... నక్షత్రాల ఆకాశం లా చిత్రించి సంభరపడాలని స్వగతం లో.

      చాలా బాగుంది చంద్రగారు.

      చాలా బాగుంది స్నేహ ప్రోత్సాహక స్పందన అభినందన
      ధన్యవాదాలు శ్రీదేవీ! శుభమధ్యాహ్నం!!


      Delete