నాలోని విశిష్టతలను
గుమ్మరిస్తున్నా ఇక్కడ
నీ ముందు
ఈ అక్షరాల్లో ....
ఈ కలయబోసిన నవ్వులు
ఈ కన్నీళ్ళు
ఈ నలిగిన గుండె రోదనలు
ఈ ఎదురుదెబ్బల జీవితానుభవాలు
ఈ సంతోషం పులకరింపులు
కొవ్వు .... ముఖం మాస్క్ కింద
దాచేసుకున్నా భద్రం గా,
నా ప్రేమను
సంరక్షించుకోవడానికి
ఈర్ష్యతో నిండిన కనులకు
సమాజం కట్టుబాట్లకు .... దూరం గా,

గాలీ, వెలుతురు నిలయం లా
ఆ మండువా లోగిలి
పెరటి కాళీ స్థలం లో
జామ చెట్టూ, పూల మొక్కలు,
ముచ్చట్లు,
మురిపాలు ఆడుకునేందుకు
శుభ్రంగా ఊడ్చిన
ఆ పొడుగాటి ఆ సిమెంట్ అరుగు.
ఆ అరుగుకు కాస్త దూరంగా అతను ....
ఒంటరి గా
కన్నీటిలో తడుస్తూ ....
ఆ పొరుగునే ఉన్న
ఆ ఇంటి కిటికీ వైపు చూస్తూ ....
అతని గుండె సలుపుతూ
ఎన్ని తరాల క్రితమో
కట్టబడిన ....
అనురాగ వారసత్వం
పొదరిల్లు అది.
ఆ మండువా లోగిలి లో
శోకదేవత లా ఆమె.
ఆ పెరటి పుష్ప లతల పరిమళాలు
ఆ ఆశలు వడలిన రేకులు ....
నేలరాలిపోతూ,
స్నేహ బందుమిత్ర పరివారం
చుట్టేసిన సందడి
ఆ సందడి లో
ప్రేమ బంధాన్నొదలాల్సొచ్చిన
పసుపుతాడు బంధం
అయిష్టత .... ఆమె ముఖంలో
ఆమె చూపులు అతను చూస్తున్న
అదే కిటికీ వైపు
లోపలినుంచి చూస్తూ
అవాంచనీయ స్థితి కలవరం .....
అతని మనసు రోదిస్తుంది.
"నన్ను మన్నించు ప్రియా!
పరిస్థితులు ఇలా
పరిణమిస్తాయనుకోలేదు.
నాది తొందరపాటు నిర్ణయమే
కాదనను.
నీకు శ్రేయస్సనిపించి
ఇష్టాన్ని అయిష్టం అని చెప్పడం.
జీర్ణం కాని నిజం!
నేను అంత కఠినంగా
చెప్పగలనని నేనే అనుకోలేదు.
మన్నించవా మనసా!"
అని అనుకుంటూ అతను.
బాధ భారాన్ని
మొయ్యలేని స్థితి లో
ఆమెను విచలితను చేసి ....
ఆ జామ చెట్టూ,
ఆ పూలమొక్కలు పరిమళాలు
ముచ్చటించుకునేందుకు కట్టిన
ఆ సిమ్మెంటు అరుగులు
అక్కడ ఒంటరిగా అతను.
అతని ప్రపంచం
సిమెంట్ లేని ఇసుక మేడలా
కూలిపోతున్నట్లు
పొరుగు ఇంటి కిటీకీ వైపే
చూస్తున్నాడు .... విచలితుడై ....
అతనికి ఆమె అంటే ఇష్టం!
అమితమైన ప్రేమ
జీవిస్తుంది ఆమె కోసమే
అన్నంతగా ....
పక్కన పీటల మీద
కూర్చోవాల్సిన మనిషి
ఒక పెళ్ళి పెద్ద గా
ప్రాణం ను పరాయిని చేసుకుని
అతను ఇప్పుడు
ఆ కన్నీటి వర్షం లో తడుస్తూ ....
జీవితం అస్తవ్యస్తమయ్యి
రాత్రుళ్ళు ....
నిద్దుర దూరం అయి,
అన్ని నమ్మకాల్నీ ....
కోల్పోవాల్సొచ్చి,
ఆశలు అణగారి,
గుండె విశ్చిన్నం అయి,
కాలం కలిసిరాని క్షణాల్లో
ప్రపంచం ఒక బందీఖానా లా ....
బయటపడే మార్గం అగమ్యమై,
ఆక్రోశిస్తున్నప్పుడు ....
పోరాడేందుకు అశక్తుడివైనప్పుడు ....

నేనున్నాను.
నీ సరసన నడిచేందుకు.
తోడునై నీడగా
ప్రకృతి ప్రకోపం నీపై పడకుండా ....
కన్నీళ్ళను తుడిచేందుకు,
భయాల్ని దూరంగా ఉంచి,
ఉల్లాసం, ఆనందం ....
వెలుగులు పరిచేందుకు,
నిన్ను నీవు కోల్పోయి ....
అయోమయాందకారం లో
విలవిల్లాడుతున్నప్పుడు ....
నేనున్నానని గుర్తు చేస్తూ,
ఎప్పుడైనా,
"ఇక ముందుకు పోలేను.
జీవించడం కష్టం!
నిత్యం భరిస్తూ సాగిస్తున్న జీవితమే
కలలు" అని అనిపించి
అంతలోనే కాదనిపించిన క్షణాల్లో .....
ప్రపంచమంతా ఒక్కటై,
సాదిస్తున్న భావన
నిన్ను వేదిస్తున్న క్షణాల్లో ....
తుఫాను తీవ్రత పెరిగి
సునామీగా మారి
వెలుగనేది నీకు కనిపించనప్పుడు ....
నీ చూపునై,
నువ్వెక్కడ ఉన్నావు?
ఏ పరిస్థితుల్లో ఉన్నావు?
అన్నది, ముఖ్యం కాదు
నీ నీడలా, తోడుగా
నీ వెంటే ఉంటాను.
ఒక కొండలా, కోటగోడలా
రక్షణ కల్పిస్తూ
ఒక మార్గదర్శకుడిలా ....
అందుకే
నా చెంతకు రా!
ఒక తోడుగా, నీడనై ఉంటాను.
ఎరుపు, నీలం రంగు
సీతాకోకచిలుకలు .... గాలిలో తేలుతూ
అల్లలల్లన సరాగాలు ఆడుతూ
నర్తిస్తూ,
పుష్ప సౌరబాల వేదికలపై
పాదముద్రల అద్దులు వేస్తూ,
ఎంతటి చక్కని వర్ణమో అది.
తామర పూలు,
బంతిపూలు
అన్ని వైపులా విస్తరించి
తెల్లగా, ఎర్రగా, పసుపు రంగులు
ముగ్గుల వాకిళ్ళలో
గొబ్బెమ్మలతో భూమాతను అలంకరించి
ఆ మహాలక్ష్మి ని స్వాగతిస్తూ
ఎంత చిక్కని జానపద భావనలో అవి.
చిత్ర విచిత్ర దుస్తుల్లో బుడతలు
రంగులు రంగుల గాలిపటాల్ని
రకరకాల పరిమాణాల ఆశల్ని,
ఆకాశం లోకి ఎగరేసి .....
తెగి, గమ్యం చేరని, రాలిన
ఆశలకు న్యాయం కోసం పరుగులు తీస్తూ
ఎంతటి ఆహ్లాదకర జీవన యానమో అది.
అరమరికల్లేని పసితనపు ఆటలు
ఆ అరుపులు, ఆ పరిహాసాలు,
పేద, ధనికులమనే భావనలేని
ఆ నవ్వుల వాతావరణం లో
ఎవరి గెలుపునైనా అందరూ
హర్షద్వానాలతో ఆహ్వానిస్తూ
ఎంత ఉల్లాసబరిత జీవనమో అది.
ఒక్కసారి చూస్తే చాలనుకుంటున్నాను.
నీ కళ్ళలోకి,
నీ ఒక్క వీక్షణం చాలు.
గుండె ఊపిరి ఆగిపోవడానికి,
అంత అందంగా ఉంటావు నీవు.
ఒక్క ముద్దు చాలు.
పోయిన ప్రాణం తిరిగొచ్చేందుకు,
ఆ ముద్దు కోసం .....
ఎన్నిసార్లైనా మరణించేందుకు సిద్దం నేను.
అంత గొప్ప అందానివి నీవు.
ఒక్క స్పర్శ చాలు.
ఎక్కడి నుంచి వస్తుందో ఆ చేతనత్వం,
వెచ్చదనం,
ఆత్మను గుండెను కలిపి పిండినట్లౌతుంది.
అంత సౌదర్యం దివ్యత్వం నీవు.
కేవలం .... ఒక్క చిరునవ్వు చాలు.
నన్నొక మృగాన్ని పిచ్చివాడ్ని చేసేందుకు,
ఆ నవ్వు కోసం ....
సప్తసముద్రాల నైనా ఈదొస్తాను.
అంత అద్భుతం నీ అందం ఆ ప్రకాశం.
బగబగమని నింగికి ఎగసిపడుతున్న ఆవేశం,
బడబాగ్ని అది.
ఎదురొచ్చిన మలినాలు మాడి మసి అవుతూ ....
ఆ దారి,
లావా నరనరాల్లో ప్రవహిస్తున్న ఎర్ర సూర్యుడి లా
ఆ ముఖం,
ఆ గుండె గర్జనలు,
ఆ పదజ్వాలాగ్నులు,
నూతనశకం ఆరంభం సూచనేమో అనిపిస్తూ,
నీకు ఆస్తులున్నాయి, అంతస్థులున్నాయి.
నాకు లేవు.
నీ కు నీడనిస్తూ అమ్మా నాన్న ఉన్నారు.
నాకు లేరు.
నీతో కష్టసుఖాల్ని పంచుకుందుకు నేస్తాలున్నారు.
నాకు లేరు.
అద్దం లో ప్రతి రోజూ చూసుకుంటావు, నీవు అందగాడివని.
నేను కాను.
నీవు ఎప్పుడూ నవ్వుతుంటావు. సిగ్గుపడుతుంటావు.
నాకు అనుభవానికి రాలేదు.
నీ వద్ద అన్నీ వున్నాయి.
నా వద్ద నేనే ఉన్నాను.
నీకు నమ్మకం .... నీవు నాకంటే అధికుడివని.
నేను మాత్రం ఒప్పుకోను.

ఇప్పటికీ నేను
కొంటెచేష్టల చిన్న పిల్లవాడినే
........,
ఇప్పుడు నేను వెన్నదొంగనే కాదు
ఒక ఆటగాడ్ని కూడా
నేను ఆడుతుంది
అత్యంత ప్రమాదకరమైన బొమ్మతో
ఆలోచనలతో
నా ప్రతి సమశ్య నీదే అన్నట్లు
నీ గుండెల్లో భద్రంగా దాచుకుని,
నా కోసం .... తలపెట్టిన ప్రతి కార్యమూ,
ఎంతో ఇష్టం గా, నీ కోసం అన్నట్లు చేస్తుంటావు.
నాడు నీవు కావాలనుకునుంటే
నన్ను కనకుండా నీ సౌందర్యం
కాపాడుకునే అవకాశం ఉండీ
నన్ను కనేందుకే నీవు ఇష్టపడ్డావు.
ఆడపిల్ల ఇంటికి ఖర్చని, కనొద్దని
నీ తరుపు వారు, నాన్న తరుపు వారు
గర్భస్రావం చేసుకో అన్నప్పుడు
మన్నించండి! అని ధైర్యం గా నిలబడ్డావు.
అత్తారింట్లో సూటిపోటి మాటల్ని
స్థిర నిర్ణయం తో ఎదుర్కున్నావు.
అప్పుడెంతగా ఏడ్చుంటావో ఊహించగలను.
నీ కళ్ళు ఉబ్బి, కనుగుడ్లు ఎర్రగా మారుంటాయి.

జీవితం లో ప్రాముఖ్యతలను ఎన్నుకోవడం లో
నీకు నీవే సాటి అని ఋజువు చేసావు
ప్రాణ దాతా .... అమ్మా!
నా ప్రార్ధన లేకుండానే నాకు ప్రాణం పోసావు.
నిజం చెబుతున్నా! నేనెప్పుడూ ఆశ్చర్యపోలేదు.
ఆ కాలానికైనా
ఆ దైవానికైనా .... క్లిష్ట సమయాల్లో
నిన్నాదుకోక తప్పదని, అనుకునేదాన్ని అందుకే.
ఏ స్తోత్రము, ఏ శ్లోకం తోనూ నిన్ను కొనియాడలేను.
అమ్మా! నాకొక అస్తిత్వం కల్పించి ....
వ్యక్తిత్వాన్నిచ్చిన బలమైన నీ నిర్ణయము,
నీ మొక్కపోని పట్టుదలకు సాక్ష్యం గా నిలబడతాను.
మనిషిని, సమాజం నిర్ణయాన్ని .... ఎదిరించి ఓడించావు.
అందుకు సాక్ష్యం గా ఊపిరి పోసుకున్న నాకు
నీ మాతృహస్తం అందించి నా తొలి నేస్తానివయ్యావు.
నా హృదయం లో ఈ భువిలో నా ప్రధమ పూజ నీకే .... అమ్మా!