Monday, January 14, 2013

సుదూర బంధం! .


ఓ బాల్య స్నేహం, ప్రేమై .... పల్లవించి,
జీవన బాగస్వామి అయ్యి,
విడివిడిగా జీవించాల్సిన పరిస్థితులు అవి.
పక్కరాష్ట్రంలో ఆమె
ఇక్కడ ఉన్న రాష్ట్రంలో నేను
నన్ను నేను చంపుకుంటున్నాను!

సౌలభ్యం పొందలేక పోతున్నాను.
ఏ వ్యక్తి సాన్నిహిత్యం అనురాగంలోనూ,
నా కోరిక .... నా మనోల్లాసం
నా చెలి చెంతనే అని .... ఎవరైనా చెప్పాలని
ఆమె, నా పక్కనున్నప్పుడే స్థిమితంగా ఉంటానని,
ఆమెనే చూస్తూ కాలం గడపడంలోనే అని,

ఆమె నా చెంతే ఉంటుందని
నన్నొదిలి వెళ్ళలేకే ఆమె అప్పుడప్పుడు వొస్తుందని
ఆమె నన్ను చూడటానికి వచ్చిన ప్రతిసారి ....
ఆమె కళ్ళు లోకి తదేకంగా చూస్తూ,
నన్ను నేను మర్చిపోవొచ్చని ....
ఎవరో నాకు చెప్పాలని,

కానీ .... వీడ్కోలు చెప్పక తప్పదు.
మళ్ళీ నేను ఒంటరిగా ఉండక తప్పదు
ఉండాలనుకోకపోయినా ....
అందుకే .... ఎప్పుడైనా,
కన్నీరు చురకత్తుల్లా నా ముఖంపై జారి
చురుక్కుమన్నప్పుడు
ఆమె వెళ్ళిపోయింది అని ఆనవాయితీగా.

నా కోరిక, నా అవసరం, నా ఇష్టం
ఆమె నాతోనే ఉండాలని.
ఆమెను నేను ఎప్పుడూ కొల్పోరాదని.
కావాలనుకున్నప్పుడు చూడాలని.
మళ్ళీ మళ్ళీ ఆమెను చుట్టుకొని,
ఆమె చేతిని పట్టుకుని .... ఎన్నో చెప్పాలని.
ఎప్పుడూ ఆమె కళ్ళల్లో నవ్వును చూడాలని.

ఆమెను
నా ప్రేమను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను.
ఆమె కోసం వేచి ఉండగలను ఎన్నాళ్ళైనా.
కేవలం కోరిక
నా ఆశ ఆవేదన మాత్రం,
కాలం మరింత వేగంగా కదలొచ్చుగా అనే.

Sunday, January 13, 2013

ప్రకృతి ప్రసాదం!



మట్టి వాసన .... వర్షం
ఉప్పదనం, తియ్యదనం కలిసి
పెదాల్ని తాకుతూ రుచి ....
నా ముక్కు, తల,
మెదడు తడిసి ముద్దౌతూ.
వసంతకాలపు వర్షం,
నా దుస్తులు నీళ్ళల్లో నాన్చినట్లు
కాలి వేళ్ళను తడిసిన గడ్డి ....
తాకి, ఒళ్ళు ఝలదరిస్తూ
వసంతం అందం పరిపూర్ణంగా ....
ఆశ్వాదించలేని స్థితి నాది.
పాఠ శ్రావ్యతను అర్ధం చేసుకోలేని
చెవిటి వ్యక్తిని!
ప్రకృతి ప్రసాదించిన
అద్భుతాలెన్నో డైల్యూట్ చేసి చూస్తున్నట్లు
ఇక్కడ నేను .... ఆమె పక్కన అండగా
ఒక జీవిత కాలం తోడుంటానని మాటిస్తూ ....

మనుగడకై పోరాటం!



తొలి విజయం
ఫలితం .... ఆశ్వాదించేందుకు
మనసు పడే తపన
శారీరిక శ్రమ .... కష్టం
స్థిరత్వం తో కూడిన పోరాటం
జీవితం!
కళ్ళారా చూడాలని,
కడుపారా తినాలని,
వీనుల విందుగా వినాలని,
నా కాళ్ళమీద నేను లేచి నిలబడాలని,
అతస్థులు ప్రాకాలని,
తలెత్తుకుని నడవాలని,
అందకుండా పరుగులు తీయాలని,
గర్వపడేలా జీవించాలని,
గుండెల నిండా శ్వాసించాలని,
స్వర్గాన్ని చేరాలని .... నీ తోడు 
నీ సాహచర్యం నీడగా .... నేస్తమా!

Saturday, January 12, 2013

యాంత్రిక జీవనం


ఒకేలా ఆలోచించే
నీవూ, నేనూ కలుస్తామని
ఆలోచనల భారం అధికమై ...
అప్పుడప్పుడూ
కాసింత విశ్రమించాల్సొస్తే 
ఒకరికి ఒకరు
తోడు అవసరమని
మనం ఒకటవ్వాలని 
కానీ,
మనం ఎప్పుడూ
ఒకరి నొకరం
అర్ధం చేసుకునే
ప్రయత్నం చెయ్యలేదు.
ఓపిక నశించి
నిర్వీర్యం అయ్యే క్షణాల వరకూ
ఆశలు కన్నీళ్ళై కారేవరకూ

నా గుండె
మండుతుంది
రగులుతుంది
నాలాగే ఆలోచించే
నిన్ను
నీ ఆవేశంలో
కొట్టుకుపోతూ చూసాక
ఇన్నాళ్ళూ ఎందుకు
గమనించలేదూ అని 
నీ విశిష్ట మనస్తత్వాన్ని
నా మనో ఆశయాన్నీ
ఇప్పుడు
నా ప్రేమను
నేనే నమ్మలేకపోతున్నా ....
నిజమా అని.

అడవులు,
కొండల్లో కురిసిన
వర్షం ప్రవాహమై
మానవత్వాన్నే తడుపుతున్నట్లు
మబ్బులు
ఆకాశంలో పరుగులు తీస్తూ
మనిషి మనసుతో
పలుకరిస్తూ పోటీ పడుతున్నట్లు
నిన్ను గమనించిన .... నాలో
ఈ చిరునవ్వుకు
అర్ధం వెదకకు 
మనం కలిసి కూర్చుందాం!
పక్కపక్కన,
ఎత్తైన ప్రదేశంలో .....
ఒకే దిశగా చూద్దాం!
కలిసి కలలు కందాం ....
మరిచిపోవొద్దు ప్రియా!
లక్ష్య సాధనకు తొందర తప్పదని.

అగ్ని గోళం!



మంటలు
నీటితో ఆర్పలేని మంటలు
మండుతూ
మండుతూ .... నా ఆత్మను కాల్చేస్తూ

నీ ప్రేమ
మండుతున్న జ్వాల
అది మండుతూ రగులుతూ
నా ఆత్మలో

ఈ నా ప్రేమ
ఒక కోరిక
ఒక ఉద్వేగం
అనుక్షణం అగ్ని గోళం

జ్వాలలు
జ్వాలలు భగభగమంటూ
రగులుతూ కాలుతూ
బూడిద చేస్తున్నట్లు నా ఆత్మలో

|| స్వాగతం! ||



అయాచితంగా ముఖంపై
దోబూచులాడే చిరునవ్వు
కొన్నిసార్లు .... అన్నీ సజావే
అనుగుణంగానే ఉన్నాయి ..... అని.
మనసు
ఉల్లాసం దాచుకోలేము.
ఉత్సాహం ఉలికులికొస్తుంది.
మాటలు, కదలికలు .... నిట్టూర్పులు అయి,
అదో ప్రత్యేక స్థితి.
ఆహ్లాదం .... మనస్థితి!
బహుశ ....
ఏ అత్మీయ స్నేహమో,
ప్రేమ అనుబంధమో,
చేరువ అవుతున్నందుకే!
పట్టలేని ఆనందం!
చిరునవ్వు సుగంధాలై .... విరియడం!
....
ఎవరో
వ్యక్తిని కలుస్తున్నందుకు
ఆ సాన్నిహిత్యం,
ఆ ప్రేమ, సాహచర్యం వల్ల
జీవితం వెలుగుమయం ....
అవుతుందనే నమ్మకం ....
ఔనూ ఊహిస్తున్నావా?
ఆ ఒక్కరు ఎవరో ....
....
ఆ ప్రత్యేక వ్యక్తివి నీవే!
ఈ పూస్తున్న నవ్వు పువ్వులు
నీ ఆలోచనలే!
ఈ భావం, ఈ ఆవేశం ....
వేచి చూడడానికి కాదు!
జీవన భాగస్వామివిగా ....
రాబోతున్న నిన్ను స్వాగతించడానికి!

జీవితం ఒక దివ్యానుభవం



నిశ్శబ్ద రహదారుల వెంట నడుస్తూ .... నేను,
సమాధానాలకు ప్రశ్నలు ఆలోచిస్తూ ఉన్నా
దూరంగా కలిసినట్లుండి
సమాంతరంగా సాగే భూమ్యాకాశాల మధ్య
దూరం కొలవాలని,
రహదారి పక్కన కుంటలు
నీళ్ళల్లో .... ఆకాశాన్ని చూస్తూ
ఆశ్చర్యకరమైన ఆలోచనలు.
వేడికి తట్టుకోలేక,
శరీరాన్ని దాచుకున్న పసువులు,
పిచ్చి జమ్ము మొక్కల మధ్య
అక్కడక్కడా కలువ పూలు,
అంతులేని ఆశలు .... జలచరాలు,
అనంత ఆపేక్షలు స్నానాలాడుతూ ....
మనసుకు నచ్చిన ఆశలు కొన్ని
చిత్రాలుగా .... నా మెదడులో జ్ఞాపకాలై,
ఆపుదల లేని కాలం అవిశ్రాంత పరిభ్రమణం!
 కుంటల్ని దాటి కదులే కొద్దీ
విసర్జిత పదార్ధాలు పారవేసే స్థలం
ఆ చెత్తను ఈగలు, దోమలు, బొద్దింకలు
పురుగులు మయమై
ఆ చెత్తను బయో మాస్ అనలేను.
అలా అని మానవత్వం
మంటకలిసిన చెత్త పదార్దం అనలేను.
నా దృష్టిలో జీవితం
అందమైన ఓ ఉద్యానవనం!
అలానే నడుస్తూ పోతే,
అటూ ఇటూ కర్రలు కట్టిన చక్క వంతెన
పక్కనే ఒక వీధి
ఆ వీధి నిర్మానుష్యంగా,
ఇంకొక వీధి అర్భాటం, హడావుడీ తో సంతోషంగా ....
పిల్లగాలులు తాకి మంచు చినుకులు
గట్టిగా నన్ను తట్టి .... ఝలదరింపు
ఆకాశం మబ్బుల మయమై
మబ్బులు పడమటి దిశగా
కదులుతూ కమ్ముకొస్తూ ....
దూరంగా .... శ్మశానంలో
చెలరేగిన మంటల ప్రేలుడు శబ్దాలు
ఎవరో వెంటాడుతున్నట్లు
కల్మషంలేని యాంత్రిక ధర్మాలు
మనిషి ఎంతగానో పరిశోధన చేసి
ఒప్పుకున్న భ్రమరాహిత్యపు మృగభావనలు
అయినా నా ఉద్దేశ్యంలో
జీవితం ఒక అద్భుత అవకాశం!

Friday, January 11, 2013

|| ప్రకృతి .... అమ్మ! ||



అమ్మ 
ప్రకృతి లా ....
అమరుస్తూ అన్నీ 
ఏదైనా, 
ఎప్పుడైనా, 
ప్రకృతి అమ్మ వొడి!

Wednesday, January 9, 2013

|| ప్రియ భావమా ||


నీవే నా కలలో
నా భావనల్లో
ఈ ఎదురుచూపులు
నీ కోసమె ....
ఎంత మోసినా
భారం అనిపించని
భారం నీవు.
కాపాడుకోవాలనిపించే
భావం నీవు.
నా గుండెల్లో దాగిన
నా ప్రేమ రాగం నీవు.
అందుకే చెబుతున్నా!
నీ ఆత్మను మనసును
నిబద్దించకు!
ఉల్లాసంగా ఎగురనియ్యి!

కల్మషంలేని
నీ అనురాగాన్ని
కోరుకుంటున్నా!
నీ, నా ముద్దు ముచ్చట్ల
అద్భుత ఘటనల
సమాగమాన్ని ....
ఆశిస్తున్నా!
నీవు నా సహచరివి.
హృదయ సామ్రాజ్య అధిరాణివి.
అందుకే నేనూ
నా ఆత్మను మనసును
ఉల్లాసంగా ఎగరనిస్తున్నా!
మనకు మనం చాలు
మనోభావాలు అంగీకరిస్తే!

పడిపోతున్నానేమో 
తొందరపాటులో
సరిదిద్దు .... అవసరమైతే
ఎప్పుడైనా
ఊహల విహంగాలమై
స్వర్గ సీమలకు
ఎగిరొద్దాం!
ఎక్కడైనా
నీవూ నేనూ ఉండేందుకు
గూడును
స్వర్గ దామం వెతుక్కుందాం!
దాపరికం లేని భావనల్లో
నగ్నంగా నర్తించేందుకు
నీ అంగీకారం నా అంగీకారం అయ్యిన
లక్షణాలు, మనోహర క్షణాలు
అస్వాదించేందుకు
ఫలవంతం అయ్యేందుకు!