నా నివాసం
ఒంటరితనపు ఆవలి తీరాన
చాలా ఒంటరిగా ఉంటుంది.
నా కలలకు తప్ప అక్కడ
ఇంకెవరికీ ప్రవేశం లేదు.
ఆ కలలు కూడా ....
నాతో నిలవవు ఎల్లప్పుడు
నేను ఉండేది మాత్రం
ఒంటరితనపు ఆవలి తీరానే
No comments:
Post a Comment