Friday, July 4, 2025

 నువ్వున్నావని    


నాకు తెలుసు నువ్వు ఉన్నావని 

నీకు అర్థమవుతుంది అని  

ఇది నా మనసులోని మాట 


రెండు ముఖాలున్నాయి లోపల 

నవ్వు, ఏడుపు 

ప్రేమ, ద్వేషం 


నీకు తెలుసు నా నిజం, అబద్ధం 

అందుకే అడుగుతున్నా 

అతను లేకుండా రేపు ఎలా?


ఇక దాచలేను 

"బాగున్నావా?" అని మళ్ళీ అడుగు 

నా గాయం నీకే కనిపిస్తుంది 


నా కన్నీళ్లు ఈ అక్షరాల్లోనే ఉన్నాయి 

ఎవరికీ వినిపించవు 

కానీ మనమంతా ఈ బాధలోనే ఉన్నాం 


వెళ్లిపోవాలని ఉంది 

ఉండిపోవాలని ఉంది 


నాకు తెలుసు నువ్వు ఉన్నావని 

నువ్వు ఉండు 

నేను వెళ్తున్నా ....

కాసేపటికే .... తిరిగి వస్తా 

 అడుగే దూరం

అడుగు దూరమే మన మధ్య
అయినా అందుకోలేనంత దూరం
లోపల, లోకానికి తెలియకుండా
మన ప్రాణాలు పెనవేసుకునున్నాయి
ఈ అడుగు దూరం దాటడానికి
యుగాలు కావాలి అనిపిస్తుంది
ఆశ, ఎప్పుడోప్పుడు ఏ తుఫానో వచ్చి
నిన్ను నాపై వాల్చకపోతుందా? అని
అప్పుడు, నీలో నీకు నా ప్రాణమిచ్చి
నేను నేలరాలినా ....
నీలోనే మళ్ళీ మొలకెత్తలేనా అని

 పగటి నిద్ర 


అది మైకం కాదు,

అదో వింత అనుభూతి 


మెత్తని సోఫాలో జారుకుని 

లోతైన నిద్రలో

లాలిపాటను శ్వాసించినట్లు 


కానీ అది హాయి యా, 

నేను మేల్కొనే క్షణమా? 


మెత్తదనం నుండి నెమ్మదిగా లేస్తూ,

నా ఆత్మ పైకప్పుకు తాకి 


అప్పుడు విన్నాను 

పైకప్పు మీద పడే వాన చప్పుడు 

రాళ్ళు తడుస్తున్నట్లు  


అది

కురుస్తున్న నా కన్నీళ్ల చప్పుడు