అక్కడే
నీ పక్కనే అవిగో గులాబీలు
సంపెంగల సువాసనలు గమనించు
ఇప్పుడు అవి
ఆలశ్యం కాలానికి
వడలి రాలిపోతున్నాయి
ఔనూ!
ఎందుకు ఆ ఎదురుచూపులు?
అవి వడలి రాలిపోయేవరకూ
నీ ఆశలు ఆశయాలు
లక్ష్య సాధనల వేళ తగునా ఈ కాలయాపన
అడుగు ముందుకే వేస్తూ ఆలోచించు
మించిపోయిందేమీ లేదు.
ఇప్పటికైనా
నీలో పురోగమించే ఆలోచనంటూ ఉంటే
పశ్చాత్తాపం
ఎప్పుడైనా పడొచ్చు
సరైన సమయం
శాంతి ఆనందం ఆహ్లాదం
ఆశలు ప్రేమ పంచుకునేందుకు
ప్రతి సంవత్సరమూ వస్తూనే ఉంటుంది.
నూతనం గా
ప్రేమ పరిమళాలను
వెదజల్లుతూ పరిసరాల్లో
మనం ప్రశాంతంగా ఉండాలి.
మరొకరికి పంచేందుకు శాంతిని
ఈ సాయంత్రం మనం
కొన్ని కొత్త జీవమున్న
ఆలోచనలను సంకల్పాలను
వినూత్నంగా పదాల్లో పేర్చి
కలిసి పాడుకోవాలి.
కట్టుబడి ఉండి కొన్ని గమ్యాలకు
అందరికీ ఆమోదయోగ్యమైన పద్ధతిలో
గతం నిట్టూర్పులు
సర్ధుమణిగిన నిశ్శబ్దం
ఆహ్వానాలు అందరి అభీష్టాలు
కొత్త వాగ్దానాలను నెరవేర్చుకునేలా
కొత్త కొత్త రంగుల ఆశల దుస్తులు తొడుక్కుని
ప్రతి సారిలానే ఇప్పుడూ వస్తుంది
ఆలోచనల ఆశయాల పరిమళాలను వెదజల్లుతూ
మనుగడకు అందమైన మార్గాలున్నాయని
ఆశీర్వదిస్తూ కొత్త సంవత్సరం
ఆకాంక్షలు పంచుకుందుకు మన ముందుకు.
ఎప్పుడైనా ఈ మధ్య
అన్నానా నీతో నీవంటే ఎంతో ప్రేమ అని
అన్నానా నీతో నిన్ను మించి ఎవరూ లేరు అని
జతగా నీవు ఉంటే
అంతా ఆనందమే అని
అన్నానా నీతో నా బాధలన్నీ మటుమాయం అని
నా కష్టాలన్నీ దూరమౌతాయి అని
ఆ సూర్యుడి కాంతి
ఎంత ప్రేరణాత్మకమైనా
నిద్దుర లేస్తూనే
ఆశను విడనాడలేము అని
సౌకర్యాన్ని కోరుకోకుండా ఉండలేము అని
అన్నానా నీతో ఓ మానసీ
చిరునవ్వువై నిండిపొమ్మని
ఆ నవ్వు పూ పరిమళాల బృందావనం
మన జీవితాలు అయ్యేలా
అన్నానా నీతో కష్టాలన్నీ దూరమై
నాలో అంతా నీవై నిండిపొమ్మని
అన్నానా నీతో ఏనాడూ నిర్వచించబడని ఔన్నత్యం
ప్రేమ హంసలు మనం కావాలి అని
ప్రేమ ప్రతినిధులం మనమే లా
రోజూ ముగుస్తూ ఒకరికి ఒకరు కృతజ్ఞతలు
ధన్యవాదాలు చెప్పుకుందాము అని
సంసారమూ సూర్యుడు లా జీవించుదాము అని
అది ప్రేమే
మోకాళ్ళమీద
కూర్చుండేలా చేసి నన్ను
మార్చేసి
అమాయకుడిని
అనాసక్తుడిని
పిచ్చివాడిని
మానుపడని
రోగగ్రస్తుడ్ని చేసి
చిద్విలాసం చేస్తూ
బూడిదలోంచి
వచ్చి
బూడిదయ్యేందుకు
తిరిగి
వెళ్ళేలోపు
మధ్యలో
కొన్ని పగళ్ళు
కొన్ని రాత్రిళ్ళు
సాహచర్యం
ముడులేసుకుని
ఒకరికి ఒకరని
ఇక్కడే కూర్చుని
పక్కపక్కనే
కాలి బూడిదై
చిత్రమైన ఆట
ఒక వింత
నాటకం
జీవితం
అప్పుడప్పుడూ
ఓడి
ఎప్పుడైనా
గెలుస్తూ
కళ్ళముందు
ఏదో ఆశ
ఒక కల
ఒక గమ్యం
పడినా
లేచి కదులుతూ
జీవితం
రహదారిలో
రేపులో
గమ్యాన్ని చూస్తూ
ఓడినా గెలిచినా
ఎవరో ఉన్నారు
వెనుక అని
సంరక్షించేందుకు
గెలిచినప్పుడు
అందరికీ
కృతజ్ఞతలు
భాగస్వాములనుకుని
ఓడినప్పుడు
మరో ప్రయత్నం
అదృష్టం తోడు
ఆకాంక్షిస్తూ
చాన్నాళ్ళే పట్టింది.
నాకు
ప్రత్యక్షతను
గ్రహించేందుకు
అవి, నీ కళ్ళు కావని
కేవలం ఆకాశంలోనే
ఉంటాయి.
నక్షత్రాలు అని
స్పష్టంగా చెబుతున్నాయి.
ఆమె ఎంతగానో దాచేయాలని ప్రయత్నిస్తున్న
సంగతులను ఒక కథ లా ఆమె కళ్ళు
ఆమె ఆశించింది అతి స్వల్పమే
కానీ, అభిమానం సహా కోల్పోయి
అలక్ష్యం చెయ్యబడింది మాత్రం అనల్పం అని
ఎప్పుడూ ఆమె ఎంతో జాగ్రత్తగా ఉంటుంది.
ఆ గుండె రోధిస్తున్నా
బయటికి కనబడనియ్యదు.
సమీపంలో నేనున్నంతవరకూ
ఆ పిదపే నిశ్శబ్దం లో బుగ్గలపైకి జారే కన్నీళ్ళతో
మోసపుచ్చుకుంటుంటుంది తనను తాను.
ఎన్నో సార్లు ఆలోచిస్తూ అనుకుంటుంటాను.
నేను ఓడిపోయానేమోనని
గుర్తుంచుకోని నా కర్తవ్య నిర్వహణలో ....
ప్రేమ పరిపక్వతే లేన్నాడు నేను
అర్ధమానవుడ్నైతే, ఆమె మాత్రం
శూన్య అస్తిత్వురాలౌతుందని ఊహించక
ధనురాకారములో వంగి
నమస్కరించి
మేఘాల్లోంచి భూమ్మీదకు
విహరిస్తూ వచ్చి
సళిపిన
చల్లదనం గాలుల
పరావర్తనం చెందిన
హృదయం ఆకారం
నీవై
ఆ హృదయం చుట్టూ ఉండే
వెలుగు
నిర్మలత్వం
నేనై
రూపు దిద్దుకున్న
ఇరు హంసలమై
కాలం సాగరం లో
ఈదుతూ నిశ్శబ్దంగా
ఎంత అద్భుతమో మనం