Thursday, October 31, 2013

ఈ నిశ్శబ్దం ...

దేశ, 
రాష్ట్ర .... 
ప్రాంతాల 
సూచిక లో 
ప్రస్తుతం 
శాంతి 
నెలకొని ఉంది. 

నా గుండె 
కొంచెము కొంచెముగా 
ప్రశాంతతను 
నిశ్శబ్దం .... 
రాత్రి నుండి
త్రాగుతుంది.  

బాష్ప వాయు ప్రయోగాలు, 
తుపాకులు పేలిన చప్పుళ్ళు ....
అరుపులు, 
కేకలు లాంటి ....
అసౌకర్యాల కు దురంగా, 
నా అవసరాలకు 
అణుగుణంగా .... బాగుంది.
ఈ నిశ్శబ్దం నాకు నచ్చింది. 









నీతోనే ఉండాలని ఉంది

సున్నితంగా, 
నిన్ను దరికి తీసుకుని
నీ ముఖాన అందమైన చిరునవ్వు
వర్ణాలు, ముద్దులు చిత్రించాలని ఉంది.

మృధువైన
అరచేతులతో
నీ అందాల్ని తాకి
పరామర్శించాలని ఉంది.

నిక్కబొడుచుకున్న
నీ రోమాల నేల,  చర్మం పై
తియ్యని సిగ్గుల చిరుగాలినై
గుసగుసలాడాలని ఉంది.


శతృవు


పసితనం పోని
కొంటె కృష్ణుడ్నే నేను .... ఇప్పటికీ
కానీ,
అత్యంత ప్రమాదకరమైన
రాక్షసుడితో ఆటాడబోతున్నాను.
నా ఆలోచనతో

సడి చేస్తూ

ఊపిరి విడుస్తూ .... కాంతి
మెల్లమెల్లగా నల్లగా మారి 
చీకటిలో
నీ శ్వాసానుభూతి
అడుగుల శబ్దం .... దగ్గరలో
నువ్వెళ్ళిపోతున్నట్లు 

Wednesday, October 30, 2013

ఉరుములు మెరుపుల ఆకాశం

వర్షిస్తుంది. ఆ వర్షించడం లో 
ఒక ప్రయాస, 
ఒక ప్రయాణం, 
ఒక చైతన్యం, ప్రాణం ఉన్నాయి. 
అందుకే 
అనుభవించాలి ఆ వర్షాన్ని 
ఆలింగనము చేసుకోవాలి ఈ జీవితాన్ని

ఎందుకిలా?


ఔనూ! ఎందుకిలా?
ఎందుకు 
ఆ కోకిల 
మోహన రాగమే పాడుతుంది? 
ఇక్కడ 
నేను బాధపడుతూ ఉంటే ....

ఆ జంటలు, ఆ నవ్వులు
ఆ యిక యిక, పకపకల ఆనందం 
చూడలేకపోతున్నాను. 
ఇక్కడ, నా పై కోపం తో 
నా చెలి .... నాకు దూరం అవుతూ ఉంటే  

ఎందుకు 
నా జీవ ప్రణయకావ్యం 
అసంతులనంగా అసంపూర్ణంగా ఉంది? 
కాలాన్ని మించినన్నినాళ్ళు 
నేనూ ఆమె ఒకరికొకరం తోడూ నీడాగా ఉండీ

నా ప్రపంచం, ఆమె ప్రపంచం అంటూ
ఇప్పుడే, వేరు వేరు అయ్యాయి ఎందుకో? 
అగ్ని సాక్షిగా, ఏడడుగులు వేసి 
ఎప్పటికీ కలిసుంటామని,
ప్రమాణాలు చేసుకున్నాక కూడా!

ఎందుకు? ఎందుకిలా?

ఆ వెలుగును నేనే!


నేను,
నాటుసారాయి తాగిలేను.
నల్ల మందు ప్రేరణ లో లేను.

నా మనసు తపనంతా ....
ఒక అగ్నికణం,
ఒక మెరుపు,
ఒక ప్రాణం, జ్ఞానం
ఎలా జాగృతం అవుతాయో
తెలుసుకోవాలని.

నా ఉత్సాహం
ఊహకందనంత ఎత్తులో
అంచనాలు, అవధులు దాటి
గాలిలో, ఇంద్రధనస్సులా,
ఆ ఆకాశం తెరపై అల్లుకుపోతూ,
ఆ ప్రేరణకు కారణం,
ఆ జీవం .... ఆ విధ్యుల్లత నేనే!

Tuesday, October 29, 2013

వడలిన పువ్వులం

అతను వొక మెరుపై వచ్చాడు.
అగ్నిలా దహించాడు.
ఎండిన కళ్ళతో రోదిస్తూ .... ఆమె
రక్తం వర్షమై కురిసింది.
అప్పుడు,
అతను పువ్వై విరిసాడు.
అతను వొక పిడుగై గర్జించాడు.
కటువు మాటల గునపాలు
గుండెలో దిగినట్లై,
జీవితం నరకతుల్యం,
ఇక చాలు అనుకుంది .... ఆమె.
కొనితెచ్చుకున్న నవ్వుల
పువ్వులు పరిచాడు .... అతను.
ప్రతి సారీ తప్పని తంతే ఇది,
జీవ రంగస్థలం పై ....
నాటకీయ అట్టహాసం చేస్తూ,

అన్నీ ప్రేమ భావనలే


ఉపద్రవాలకు దూరంగా, 
వెచ్చదనం ఆశ్రయంగా, 
జీవితాన్నిచ్చే ఒక మంచి మనసు, 
స్వేచ్చనిచ్చే ఒక సహృదయం కావాలి. 
ఉత్తమ జీవితం అర్ధం తెలిపి 
నాతో కలిసి సహచరించేందుకు.

నా స్వంతం అయిన 
దేన్నైనా ఇచ్చేస్తా! 
ఈ జీవితం, ఈ హృదయం, ఈ శ్వాస 
నాది అనే యేదైనా 
బేషరతుగా సమర్పించుకుంటాను. 
ప్రతిగా అలాంటి తోడును పొందేందుకు.

ప్రేమించడం నేర్పి
దేన్నైనా కొంతవరకే విడమర్చి, 
నాకు నేను మార్గం వెదుక్కునేలా 
శిక్షణ నిచ్చి ....
తనున్నాననే నమ్మకాన్నిచ్చే 
ఎవ్వరూ ఎరుగని 
నను వీడని భావం శాశ్వతత్వం కోసం

అప్పుడప్పుడూ ఆలోచనొస్తుంది.
ఎవరినైనా ఘాడంగా 
ప్రేమించి నప్పుడు,
అంతా నా ఇష్టమే అనుకునేంతగా ....
వేరెవరో కూడా వారిని ప్రేమిస్తే, 
వారిని నేను కోల్పోవాల్సొస్తే, 
ఎవరైనా వారిని నాకు దూరంగా తీసుకుపోతే .... అని.

అప్పుడు, 
నా అభ్యర్ధన ....
వారికీ వినపడదు గా అని,
నా మనసు చెప్పే పదభావనలు ....
చేరాల్సిన మనసును చేరవు గా అని,
ఆ వెచ్చని స్పర్శ లో అమరత్వం కోసం 
నేను పడే తపన అర్ధం కాదు కదా అని.