Thursday, June 26, 2025

 నేనూ ఆమె 


బస్సులో ఆమె 

కాస్త దూరంలో కారులో నేను  

ఆమె నా వైపు కిందికి చూస్తూ  


కాలంలో ఘనీభవించాం ఇద్దరం  


నేనూ ఆమె వైపే చూస్తున్నాను 

కానీ ఆ చూపు ఆ ఆసక్తి వేరు 


నిజమే, ఆమె పట్ల ఎందుకో జాలి 

ఆమె ఎవరో .... ఎక్కడికి వెళ్తుందో 


ఒక్క చూపులోనే కలిశాయి 

మా మనసులు  


నా ముఖం, కిటికీ అద్దం, 

అద్దంలో ఆమె రూపం 

ఆమె అలసటగా నిట్టూర్చినట్లనిపించింది  


మరుక్షణమే బస్సు బయల్దేరి 

ఆమె ఆమె బతుకు దారిలో 

నేను నా దారిలో 


ఇప్పటికీ ఆలోచిస్తూనే ఉన్నా ....  

బస్సులోని ఆమె గురించి 

నాకు ఇంత ఆసక్తి ఎందుకూ అని   


No comments:

Post a Comment