Thursday, June 26, 2025

 ప్రేమంటే!?

ప్రేమ .... మన మనసు చేసే మాయే కాని
కళ్ళు చేసే మాయ కాదు అంటుంటారు.
కానీ, ఆ మనస్సే ఓ మామూలు గుర్రాన్ని
దేవతాశ్వంగా మార్చి చూపిస్తుంది.
ప్రేమ మానవ జీవన సారం అంటుంటారు.
కానీ, వాస్తవపు డొల్ల రూపాన్ని జయించి
స్వంతం చేసుకోవడంలో దొరికే
ఓ వికృత సంతృప్తేమో అనిపిస్తుంది నాకు
ప్రేమంటే ....
చేదు సొరకాయల గిన్నెలో
తీయని పాకం రుచిచూడటమేమో అర్థం లేకపోయినా
తడబడుతున్న స్వరాలతో
జోలపాట పాడటమేమో ఆ పాటకు నిద్రరాకపోయినా
గ్రహణంలో వెన్నెల మంటను చూడటమేమో
అదో అద్భుతం అని సరిపెట్టుకుని
నిజానికి ప్రేమంటే ....
దేన్ని గుర్తుపెట్టుకోవాలని అనుకుంటామో అదే

No comments:

Post a Comment