నాకు ఇంత ఇష్టమా అని చాలా ఆలశ్యంగానే తెలుసుకున్నాను. పగిలి, విరిగి, తెగి చితికిన పద పెళుసు వాక్యాల బలహీన స్వరాలు కవితలవ్వడం పై ఇంత ప్రేమా నాకని ఆశ్చర్యం వేస్తుంది. అవే పదాలలోని .... అక్షరాల అస్తిత్వం, ఆ ఔన్నత్యం ఆ స్వచ్చ సత్యత ఆ నిరాడంభరత ప్రణమించాలనిపించేలా ఉంటూ రాయబడుతున్న కవితల్లో మాత్రం కారణ స్థిరతత్వ సంహారమే లక్ష్యం అన్నట్లు పిచ్చి తలలలోనుండి తప్పించుకునే ప్రయత్నం యుద్ధం లో గాయపడిన అక్షరాలు క్షతగాత్ర సైనికుల్లా
అక్షర ఇటుకలు సమృద్ధిగా పేర్చి సందిగ్ద మనోభావనలతో బలవంతపు పదాలల్లి రాయబడుతున్న ఏ వస్తురహిత సాహిత్యం పట్లనో ఇంత మక్కువెందుకో .... నాకు
అనాలోచిత జీవనసరళి నడవడిక తో ఒకప్పుడు .... ఒంటరి రహదారుల్లో ఎవరూ లేక నాతో నా ప్రేమను, నా ఆనందం అనుభూతుల్నీ పంచుకునే జత గా అంతా అసంతృప్తి అసంతులనమే .... అప్పుడే నువ్వొచ్చి కలిసావు. మార్గం చూపించేందుకే అన్నట్లు ఒక మార్గదర్శకురాలివై ఒక తోడు లా .... జీవ రహదారి అంతం వరకూ ఒక సమాలోచన, వెలుతురు .... విజ్ఞతలా
అనిశ్చయాంశాల యౌవ్వనం అయోమయం అయినా అన్ని అంశాలూ దూరమైపోతూ నీవు సమీపంలో ఉంటే జీవితానికి ఎంతో మూల్యత ఉందనిపిస్తుంది అవకాశం ఉన్న అన్ని వేళల్లోనూ నిన్నే చూడాలనిపిస్తూ. నీ చిరునవ్వు లోనే నా ఆనందమంతా అనే పొందాలనుకుంటున్నాను .... నిన్ను నా జీవన భాగస్వామివి గా నా మనోసామ్రాజ్ఞివిగా నా విజ్ఞతవు గా
నీతో కలిసున్నప్పట్నుంచి చూస్తే ఎన్ని యేళ్ళు గడిచాయో నేటికి ఎప్పుడూ నా హృది లో నా ఆలొచనల్లోనే ఉండే నిన్ను ఆలోచిస్తుంటే అనిపిస్తుంది. ఆశ్చర్యంవేస్తుంది. అప్పుడప్పుడూ నాలానే నీవూనా అని నన్ను గురించే ఆలోచిస్తుంటావా అని నిజం మానసీ ఎంత ఆశ్చర్యమో ఎంత వింత సందేహమో నిజంగా నీవు నన్ను తలచుకుంటుంటావా అని లేక నీ ఆలోచనల్లో నేనో మరిచిపోయిన చరిత్రనా అని ప్రతిరాత్రీ నిదురించుతూ నిన్నే కంటూ ఉంటాను .... కలలో ఒకప్పటి మసకేసిపోయిన అలికేసినట్లున్న మన మధురజ్ఞాపకాలను స్పర్శిస్తూ.
నిద్దుర లేచి పక్కన నువ్వులేవే అని దిగాలుపడుతూ ఉంటాను. ఆశ్చర్యపడుతూ ఉంటాను. మానసి ....నువ్వెప్పుడైనా కల కంటుంటావా నన్నని నీ కలల నెలరేడునా .... లేక ఏ చెరిపేసుకున్న జ్ఞాపకాన్నా అని గడియలు, రోజులు .... వత్సరాలెన్ని గడిచినా నీ, నా జ్ఞాపకాలు మాత్రం అలానే నాతోనే పల్లవిస్తూ పరిమళిస్తూ కొన్ని మసకేసిపోతూ కాలం చెరపలేని మార్చలేని అనుభూతులౌతూ అప్పుడప్పుడూ నిన్ను గురించే ఆనుకుంటాను. ఎన్నిసార్లో అలా .... మానసీ ఆశ్చర్యపోతూ ఉండటం . నేను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాను .... నీవూనా అని ఎప్పుడైనా ఆలోచిస్తావా నన్నను ఆకాంక్షతో
ప్రతిదీ అవసరం అని అనుకోను .... ఇకపై ఏదీ నాదని ఇళ్ళూ, స్తలాలు డబ్బు, సౌకర్యాలు మూల్యతలు సొంతం కానక్కర్లేదు. ఆకలి తీరితే చాలు చుట్టూ నిశ్శబ్దం పరుచుకుని అద్దంలో ప్రతిబింబం రోజు రోజుకూ మసకేసినా,
నాకు నీవు నీకు నేనూ ఎప్పుడూ సొంతం కాలేదు. కనీసం ఎప్పుడూ నా, నీ పిల్లలు అనుకోలేదు. మన అని, అన్నీ అంతే కాలం కరుగుతూ జ్ఞాపకాలుగా మారిపోతూ ఆ జ్ఞాపకాలే చాలు అనుకుంటే చాలు.
చివరికి మిగిలేది మాత్రం పదరూపం లో అందంగా అక్షరదోషం లేని భావనలేనేమో ఈ మృదుస్పర్శలు ఈ మౌనం వినడాలు ఈ రంగులద్దిన పెయింటింగ్సూ అనాలోచితంగా మనస్సును పారవేసుకోవడాలు నిట్టూర్పుల్లేకుండా త్యాగాలు చేయడాలు
నిన్ను కలిసిన తొలినాటి నుంచే ఈ వింత భావన నాలో ఊహల్లో .... గాలిలో నడుస్తూ ఉన్నాను. ఆలశ్యంగా అయినా ఒప్పుకుంటున్నాను. అది యాదృచ్ఛికం కాదు .... అన్ని సందర్భాల్లోనూ నీవైపు ఆకర్షితుడ్నౌతున్నాను అని.
ఊరంతా అనుకుంటుంటున్నారు. ఓ మానసీ .... ఇంతందంగా ఉన్నావు. నీ మనసు నీ లో లేదు అని నాకెందుకో మరి మరోలా అనిపిస్తుంది. నా కళ్ళకు నీ కళ్ళలో నక్షత్రాలు, తారలు ఆనందం విరబూసిన ఆకాశం కనిపిస్తుంది. కలిసి జత రమ్మంటే మన్నిస్తావు అనిపిస్తూ ....
నీవైపే తూగుతూ వేగంగా కొట్టుకుంటుంది. నా హృదయం తనదైన చక్షువులతో నిన్నే చూస్తూ నీవే తన ఆశలు, కలల గమ్యం లా తలుపులు తెరిచి నిన్నే స్వాగతిస్తూ .... నిజం మానసీ అది ప్రేమ తప్ప మరేమీ కాదు ఓ మానసీ! ఒట్టేసి చెబుతున్నాను .... ఇదే నిజమని
వింత అబద్రతాభావం తగదని ఆనుకుంటూనే నీవెక్కడ చెడుగా అనుకుంటావో అని .... తొందరపాటు .... నా మనస్తత్వం కాదు కానీ ఎందుకో నీవు ఎదురుపడిన వేళల్లో నిన్ను ఒదిలి తిరిగి వెళ్ళాల్సొచ్చినప్పుడు మాత్రం వెళుతూ వెళుతూ వెనుదిరిగి మళ్ళీ ఒకసారి చూద్దాం అనిపించడం నిజం
ఈ ఉద్దేశ్యాలు నా ఈ మనోభావనలు అన్నీ నీపై బలమైన ముద్ర వేద్దామని మాత్రం కాదు అంత సులభమనీ అనుకోను. ప్రేమ, ఒక అమూల్య బహుమానం అని ఎదురుపడినప్పుడు తిరస్కరించరాదనే .... ఈ తపనంతా. ఎక్కడ చేజార్చుకుంటానో అమూల్య బహుమానమైన నిన్ను అనే ....
ఆమెకు ఒక అస్తిత్వం ఉనికి లేనట్లు .... అతను, ఆమె గుణ, ధర్మ, లక్షణ, స్వభావాలన్నింటినీ కలిపి తాగాడు. .......... అయినా అసంతృప్తి ఇప్పుడు అతనికి మళ్ళీ దాహంగా ఉంది. భావించాలి. ప్రేమ లో ఇది ఒక పాఠం అని
ఆమె శరీరం ఇక ఆమెది కాదు నేను నిత్యమూ పూజలు జరిపే హృదయాలయం నా చేతులతో స్పర్శించి అబిషేకించిన ఆత్మీయ ఆవేశం ఆరాద్యబంధమై అల్లుకుని ఆమె దయాదాక్షిణ్యాలపై నా జీవితం ఆధారపడ్డట్లుండి
నేను ఆమె కళ్ళలోకి ఎప్పుడైనా తదేకంగా చూస్తూ ఉన్నప్పుడు ఏర్పడే ఆ భావ రాగ అసంతులనం దుమ్ము, బురద కొట్టుకుపోయిన నా అనాగరికత ఔషధమై ఆమె హృదయస్పందనలను క్రమబద్దీకరించినప్పుడు ఆమె తనను కోల్పోయి ఒక దేవతలా నన్ను కరుణిస్తూ
నేను నిన్ను ప్రేమించాను. నీవు తిరస్కరించావు. నాకింకా గుర్తుంది .... నీవన్నావు. "ఎప్పటికీ నా జీవన భాగస్వామిగా అంగీకరించలేను .... నిన్ను" అని నేను పెట్టుకున్న .... ఎన్నో ఆశలు కన్న ఎన్నో కలలు, కూలి జీవితం ఇలా సాగక తప్పదనిపించి . గుండె బ్రద్దలయ్యింది. అవకాశం లేదని స్పష్టంగా తెలిసి
గుండెల్లో లోపల ఎక్కడో అజ్ఞాతంగా ఏదో గుచ్చుకున్న బాధ .... ఎప్పుడూ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రాలేదు కానీ, ప్రేమించి భంగపడిన తియ్యని బాధ భరిస్తూనే జీవించక తప్పని స్థితి అప్పుడే నిర్ణయించుకున్నాను. జరిగిపోయినదంతా గతం అని గతం గతించిందని నాకు నేను చెప్పుకుంటూ జీవించాలని
ఏ కోణం లోంచి ఆలోచించినా నీ నిర్ణయం సబబే అనిపించేది. నీవు నాతో అన్నావు మరిచిపోయుంటావు. "నేను నీకోసం పుట్టలేదని నీ తల్లిదండ్రుల దృష్టి లో నేను నీకు తగినవాడిని కాదని" మనం ఒక్కటైనా మన దాంపత్య జీవితం సరళంగా, ఆనందంగా, ఆదర్శవంతంగా జరిగే అవకాశం లేదు అని
అప్పుడు నేను ఎంతగానో గాయపడ్డాను. ఆ మాటల్లో విని అనాసక్తిని కానీ తరువాత వెనుదిరిగి ఆలోచించాను. అప్పుడు ఆ సంఘటన అప్రస్తుతం మరిచిపోవాల్సిన గతం లా అనిపించింది. అంతేకాదు అనుకోకుండా రేపు ఎప్పుడైనా ఏ టాంక్ బండ్ మీదో నీవు నాకు ఎదురుపడినా ఒకప్పుడు నేను ఎంతో ఇష్టపడిన నీ ముఖం తెలియని ముఖం అన్నట్లుండేంతగా
మనం అందరమూ అనుకుంటున్న ఈ ప్రేమ, ఈ హృదయబంధం ఏ అద్భుతమూ ఆనందమూ కాదు అప్పుడప్పుడూ అది మానసిక అశాంతిని కన్నీళ్ళనే మిగులుస్తూ .... నేను అన్నీ భరించే జీవిస్తున్నాను హృదయం పగిలినా కూడగట్టుకుని ముందుకే కదులుతున్నాను. మళ్ళీ ప్రేమను కనుగొనగలననీ ఆనందాన్ని తిరిగి పొందగలననే
ఆనాడు నీవు నా ప్రేమను నన్నూ దూరంగా విసిరేసి చాలా మంచిపనే చేసావు. నీ నిర్ణయం ఎంతో ఉత్తమమైనదే నీకూ నాకూ కూడా బహుశ ప్రేమను పొందేఉంటావు ప్రేమను కనుగొనాలని కోరుకుంటున్నాను ఆనందాన్ని, ఆత్మసహచరుడ్నీ పొందాలని నిజం మానసీ .... నీకు కొన్ని వేల లక్షల కృతజ్ఞతలు నీ జ్ఞాపకాల పూతోటలో విరిసిన పరిమళాలింకా మిగిల్చుంచినందుకు