Wednesday, April 1, 2020
Saturday, March 21, 2020
ముందుకే
గాలి శ్వాస .... వెచ్చగా
కఠినంగా కర్కశంగా తాకుతూ ఉంది
అలసి ఆవిర్లు కక్కుతూ ఉన్న .... ముఖాన్ని
గాలి గంభిరంగా అంటూ ఉంది
నువ్వైపొయావు అని ....
కానీ
నేను మాత్రం నడుస్తూనే ఉన్నా
ఊగుతూ,
కాళ్ళీడుచుకొంటూ,
నీరసంగా
గాలిని వెక్కిరిస్తున్నట్లు
కాలంతోపాటు తప్పదెవరికీ
ముందుకు జరక్కపొతే
వెనక్కు జరుగుతున్నట్లే .... అని
Monday, March 2, 2020
కారణం నీవే
నా నిద్దురలేమికి, మెలుకువలో ఉండీ
నా ఊపిరి భారమవడానికి ....
తెలుసా నీకు .... కారణం నీవే అని
విచ్చలవిడిగా వెదజల్లాలి పదాలు ....
కాగితం పై అనిపించే ఆవేశావస్థ నాది
రక్తం నిండిన సిరా పారిన భావనలో
విషమిశ్రిత వికట విసర్జనలో .... అవి
బహుశ నా మది ఆలోచనలన్నీ
నీవై నిండిపోవడం వల్ల అయ్యుండొచ్చు
ఎలానో ఎందుకో తెలియని అయోమయావస్థ
ఎంతో అవసరం అయిన వేళ అని తెలిసీ
ఆలోచనల్లో మాత్రమే ఎదురయ్యే మానసీ
.
ఇంతకూ
నీకు తెలుసా .... కారణం నీవే అని
నీవే నా ఈ రాతల భావనల లోతువు అని
Monday, January 27, 2020
Friday, January 17, 2020
Friday, December 13, 2019
పరిపూర్ణ భావన
ఎవరివని ఏమని చెప్పను
నీవే అని ....
పరిపూర్ణపదాల్లో
నిర్వచించాల్సొస్తే ....
నీ, నా పరిశుద్ధ ప్రేమను
నీవు, ఒక నమ్మరాని,
అవిశ్వసనీయ, అద్భుత,
అత్యాశ్చర్యకర కలవు
దివి నుంచి దిగి వచ్చిన
సౌందర్యం రూపానివి
ప్రేమించాలి .... నిన్ను
నీతో .... పరిపూర్ణంగా
మమైకం కావాలి
మైకం కలుగచేసే తియ్యని
స్వరమాధుర్యం
తాళ, లయ సంతులన
పద చిత్రం నీవు
నా శరీరాన్నీ నన్ను
ప్రభావితం చేసిన
పరిపూర్ణ పద హృదయానివి
Thursday, December 12, 2019
పూర్ణత
అన్నావు గుర్తుందా
నాకు తెలియని నిజం ఇది అని
ఒక చీమను నలిపేసినట్లు
నలిపేస్తుంది ప్రేమ .... అని
మార్చుతుంది
నన్ను, నా జీవన సరళిని
నా ఆత్మాభిమానాన్ని .... అని
అన్నావు
వ్యామోహంలో ఉంచుతుంది
సృష్టి లో ఉన్న అందం ఆనందం
అన్నీ పొందబోతున్న భావనను
ముందుంచుతుంది అని
నిజమా!? అని
ఒక్క క్షణమైనా ఆగి ప్రశాంతంగా
ఆలోచించనివ్వదు అని
అన్నావు
బ్రహ్మాండమంత ఆనందం అనుభూతి
కొన్ని క్షణాల్లోనే ముందుండడం
పొందడం .... నిజంగా
నిజమా! సాధ్యమా? ఎలా?? అని
అన్నావు
ఇంద్రియజాలంలో పడి
పరిపూర్ణులు కారెవ్వరూ అనీ
కానీ
నాకు మాత్రం ఎందుకో ....
నలిగిపోవడం కరిగిపోవడంలో
సారం గమ్యం ఉందనిపిస్తుంది.
ఒకరు మరొకరిలో
మమైకం కావడం లో
పరిపూర్ణత అర్ధం ఉందేమో అనిపిస్తూ
Tuesday, December 3, 2019
దూరం ఎంతున్నా
వెన్నెల పరిచిన
చందమామ
రాత్రుల్ని
నీవు
స్పష్టంగా చూసుంటావు.
ఎన్నిసార్లో
అలా చూసిన
ఏసారైనా
నేన్నీకు
గుర్తుకొచ్చానా?
ఎన్నో
వేల మైళ్ళ
దూరంలో
ఉన్నా
ఆలాంటి
ప్రతి పున్నమిరాత్రీ
నిన్నూ
జ్ఞాపకాలనూ
నెమరేసుకుంటున్న
నా లాగా!
Subscribe to:
Posts (Atom)