Tuesday, January 29, 2013

నేనే మేధావిని



ఒక మేధావి మాట విను!
సాగటు మనిషీ .... ఇలా రా!
సాహచర్యం సహజీవనం అప్పుడేనా?
ముందు ....
నిలబడటం నేర్చుకో!
ప్రేమ చూపులు నవ్వులు ఎప్పుడూ ....
అందంగానే ఉంటాయి.
నేనున్నాగా నీకు సలహా ఇచ్చేందుకు ....
తొందరెందుకు?
ఆర్ధిక స్వాతంత్రం వివేకం నీలో పరిమళించనీ ....
ముందు
ప్రేమకు కామా పెట్టు ....
అప్పటి వరకూ,
ఆమె అస్పష్టపు మాటల్లో ....
విషపు తునకల్నే చూడు.
వాస్తవం చెబుతున్నా!
నన్ను నమ్ము ....
నీ అంతరాత్మను ....
చరిత్రనెరిగిన మేధావిని
వేటకుక్కలతో ఈ ఉల్లాసప్రయాణం-
రౌండ్ లో
మనసుకు శరీరానికీ గాయాలు పుష్కలం ....
అవసరమా!
గాయపడేందుకెందుకు అంత తొందర ....
నా మాట విను
సాహచర్యం సహజీవనం
సమయం, స్థలం .... నన్ను నిర్ణయించనీ!

నొప్పి



వికటించి
లోతు గాయం .... ప్రేమ 
వెండి వెన్నెల శరాల పానుపు 
ద్వేష వాయువు 
ఆత్మ లోకి నేరుగా .... 
ఉక్కిరిబిక్కిరౌతూ,

కలను కాను!?



ఉన్నానా? 
ఔనూ ఉన్నానా నేను .... ఉంటే, ఎప్పుడు జన్మించాను?
ఎవరిని నేను, ఎవరికి ఏమౌతాను.
లేక ఎవర్నీ, ఎవరికీ ఏమీ కానా .... నేను? 

నేను నేనేనా .... లేక, నేను నేనులో ఒక భాగాన్న, 
ఎవరి కల్పన నో నా, 
లేక నిజంగానే నేను వున్నానా? 
ఉన్నానో లేనో తెలియడం ఎలా?

ఎలా చెప్పను? 
జీవించే ఉన్నానని? .... జీవించే ఉన్నానా అని
నేను ఉన్నానని నాకే నమ్మకం కలగనప్పుడు ...
నన్ను నేను .... ఒక కల అనుకుంటే పోలా.... ఎవరో గుర్తించలేదని బాధపడే కన్నా?

చిరునవ్వు పలుకరింపు



నేనో సాయంత్రం వీధిలో నడుస్తున్నప్పుడు,
ఒక చిత్రం జరిగింది.
నన్నొక స్నేహితుడు కలుసుకున్నాడు.
.....
నేను .... దూరంలో ఉన్నా,
నా అడుగుల సవ్వడి వింటే చాలు
గుర్తించగలనని అంటూ,

నేనో ఉదయం కంప్యూటర్ ముందు కూర్చుని,
ఆల్గోరిథం లో మునిగిఉన్నప్పుడు
ఒక చిత్రం జరిగింది.
నన్నొక మితృడు పలుకరించాడు ....
.....
నేను .... దూరంగా ఉన్నా, పక్కన ఉన్నా ....
నా శ్వాస శబ్దం వెచ్చదనం తగిలితే చాలు
గుర్తించగలను అని,

నేనో రోజు .... కవిసమ్మేళనానికి వెళ్ళినప్పుడు,
ఒక చిత్రం జరిగింది.
నన్నొక నేస్తం పలుకరించింది.
....
నేను .... దూరంలో ఉన్నా
నా పదాల భావం వినిపించి,
చిరునవ్వు మెరుపు కనిపిస్తే చాలు .... పలుకరించేందుకు ఎదురొస్తానని,

Saturday, January 26, 2013

నిన్న మొన్నా అనుకోలేదు!



నిన్న, మొన్నా
తెలియదు నాకు
నువ్వు
నన్నింతగా ప్రేమిస్తున్నావని,
ఎన్నటికీ తగ్గని
ఎక్కడికీ వెళ్ళని
తోడు
నా నీడ నీవౌతావని,

అప్పుడు
వేడి రక్తం
యౌవ్వనం ఆత్మాబిమానము
స్వచ్చమైన హృదయం నీది
చిన్న వయసు
ప్రాపంచిక జ్ఞానం
తెలిసే
అవకాశం లేదప్పుడు

విధి రాత
గాలివాటం
జీవితం
రాలిన ఆకు
గాలికి కొట్టుకొచ్చి
చాలా దూరంగా,
విసిరేసి
కాల నిర్ణయం!

ఎంతో అరుదుగా
మాటలు వాడే
నీవు ....
నేను ఎదురైనప్పుడు
నేను వినాలని
నన్నానందింపచేసేందుకు ....
మాటల్లో ప్రియ భావాలు
ప్రేమ పదాలు పెదాలపై ....

నీవు .... ఇక్కడే నా పక్కన



నా మనస్సు.
నా జ్ఞాపకాలు లో,
ఆ రోజు నీవు నా నుండి వెళ్ళిపోయినా ...
నీవు నిజంగా ఇక్కడే ఉన్నావు.

నీవు వదిలి వెళ్ళిపోతున్నానని
అన్నావే కానీ ....
నీ గొంతూ వినిపిస్తూనే ఉంది.
నీవు నా పక్కనే ఉన్నావు.
నేను, నా భావాలు నిజమే అన్నట్లు
నీవు మాత్రం ఇక్కడే నా పక్కనే ....

నేను, అడ్డుకోను.
దూరంగా తోసెయ్యను.
తలపుల తలుపులు తెరువను,
కానీ నీ ఆక్రమణ ....
నా జ్ఞాపకాల సామ్రాజ్యాన్ని ఆతిక్రమిస్తూ,
ఇక్కడే నా పక్కన నా సాహచర్యాన్ని పాటిస్తూ ....

Friday, January 25, 2013

కృషి సాగరం



ఏకాగ్రత
బలం
సంయుక్త వర్ణం
అనుభవాల గుత్తులు
ఒక్కచోటే పేర్చడం

నిజం,

ఊపిరి
బిగించగలిగినంత సేపు
నిశ్శబ్దం పట్టుదలై
దాటేస్తూ
లక్ష్యసాగరం
ఇలలో

సహనం సమ్మతం


నీవు నన్ను సంతృప్తి పరిచేప్పుడు
నేను కోరుకునేది మాత్రం నిశ్శబ్దం
ఇంద్రియాల్ని కట్టడి చేస్తూ ఎదురుచూడాలి.
కోరిక రుచి లోతులు తెలుసుకునేందుకు,
నాకు మాటలు పదాలు .... గుసగుసలు
వివరణలు అక్కర్లేదు .... తెలుసుకోవాలని లేదు.
నీవూ నేనూ జీవిస్తుంది .... అనుభూతించడానికి,
అవకాశం దొరికినంవరకూ జీవం త్యాగించటానికి,
నీ గమ్యం .... సామర్థ్యరంగం లోకి అడ్డు రాను.
నీ చూపులు సారించినంత మేరా అడ్డుతగలను.
నేను ఇక్కడ ఉండానికి మాత్రమే ఇక్కడ ఉన్నాను.
పరుష పదాలు వాడను .... ఆలోచనల్ని వినోదించను.
నీవ్వొక పుష్పించే పువ్వులా ఇక్కడ ఉన్నావనుకుంటా!
నాకు నేను శరదృతువునై .... నీ లక్ష్యానికి సహకరిస్తా!
మన జీవితాలు మన గమ్యాలు రెండూ వేరు వేరు ప్రపంచాలు ....
పరిస్థితుల ప్రభావం .... సంఘర్షణ మినహా,
ఒకరితో ఒకరం పోరాడాల్సిన అవసరం లేదు.
జీవన అవసరానికి పక్క పక్కన సహచరిస్తే చాలు.
నీవు రాత్రివి అసాధారణ .... చల్లదనం వి
నేను ఆకాశంలో కరిగేందుక్ సిద్దంగా ఉన్న కారుమబ్బు ను
నేను కారణం కాలేను నీ ఆనందపరవశ్యతకు
ఘాడ నిద్రలొంచి ఉదయించాలి .... ఆనంద పారవశ్యాలు
నాకు అర్థం అయ్యేందుకు సమయం పట్టింది. 
ఇప్పటివరకు ప్రేమ భావం సమ్మతం వక్రీకృతం అయ్యింది .... నిజం!

Thursday, January 24, 2013

అది పదం కాదు .... పలికేందుకు



అది
మాటలాడని
బాష పలుకని పదాలు
చూడని చూపు
ఊపని తల .... భావం
అది
గుండె గుసగుస
దాయలేని వాస్తవం
నిద్దుర లేచిన
జ్ఞాపకాల చైతన్యం
వెలుగుమయమైన నిద్ర!