Tuesday, May 6, 2025

 అర్థం చేసుకో .....!

నువ్వు నా మంచి లక్షణాలే కోరుకుంటున్నావు.
నీకు ఉత్తమమే కావాలి.
మరి నా చెడు లక్షణాల సంగతేమిటి?
వాటిని ఆదరించడం మరీ కష్టమా .....
నేనొక సామాన్యుడ్ని
అర్థంకాని కళలా మనిషి హృదయం అనంతంగా
విస్తరించి ..... ఉంటూ
ఏ మనిషిలోనైనా, లోపాలు సహజం
కానీ నేను అపరాధిని కాను.
అపరాధ పరిణామాలెలా ఉంటాయో నాకు తెలుసు.
నేను ఎన్నో తప్పులు చేసాను ..... ఇంకా చేస్తూ ఉన్నాను.
ఆ పరిణామాల్లోంచి ..... పాటాలు నేర్చుకుంటూ ఉన్నాను.
మార్పు సహజం అని నమ్ముతాను.
కనుక, కాలంతో పాటు మార్పు చెంది
మెరుగు పడేందుకు ప్రయత్నిస్తున్నాను.
నీవు నీ అద్భుతమైన ఊహల కలల్లోకి నన్ను నెట్టే
ఎలాంటి అనూహ్య పరిణామాలు వద్దు.
కేవలం ..... నీ లోపాలు నేను అంగీకరించినట్లే
నీవు నా లోపాలు అంగీకరించాలని ఆశ, నన్ను అర్థం చేసుకో

 నిరాశ

ఒంటరిని
వెళుతూ
జారుతూ
మునిగిపోతూ
నా ధైర్యం
మాత్రం
నా కుటుంబం.
నా స్నేహితులు.
నా విశ్వాసం
అవి నన్ను
పట్టుకుని
నన్ను
పైకి లాగుతూ
ఆదే ఆశ
నా విలువైన
జీవరేఖ.

 జీవరాగం

నీ కళ్ల ఆకాశంలో చూస్తూ ఉన్నాను.
ఎన్నో వేల తారల మెరుపుల్ని
నీవే నా చిరునవ్వు, నీవే నా కల,
నీవే నా ఆశ.
నీవు నా దగ్గరైన వేళ
ఈ ప్రపంచం నా సొంతం అనిపిస్తూ
నా రోజు బాగోలేనప్పుడు,
నన్ను నవ్వించే ప్రయత్నం నీ నడవడిలో
సంసార బారం నన్ను నలిపేస్తున్నపుడు
నేనూ ఉన్నాను అని
భారం పంచుకునే సౌలభ్యం నీవు
నీవే నా అవసరం నా జీవయానంలో
నీవే నా లోకం, నీవే నా జీవితం,
సమాంతర యానం నీది నాది
నా ప్రియతమా, నా ప్రేమా,
నీవెప్పుడూ నాదైన దానివేనేమో కదా?

 జ్ఞాపకాల గతంలోనే

మరణం
జీవితాన్ని తాకినపుడు
విషాదం కురుస్తుంది.
చిన్ని కన్నీటి బొట్లే
రంగురంగుల
భావోద్వేగ వర్ణరంజితాలై ....
జీవితంతో
అనుబంధం కలిగిన
అందరికీ
హృదయాలు
విరిగిపోతాయి.
పెదాలపైన చప్పుడుండదు.
చివరికి
తప్పకుండా రానున్న సమయం
వచ్చిందని తెలిసాక
దూరంకావల్సి రావడం ....
ఆ రోజున
హృదయం మరింత భారమై
మనిషి మౌనంగా శోకిస్తాడు.
వారినే స్మరిస్తాడు.
వీడ్కోలు వేళ
ఆ మధుర జ్ఞాపకాలు
వారిని సజీవంగా
ఆ గతంలోనే ఉంచుతూ

 రాత్రివేళల్లో .....

ఆ అందమైన మెరుపులు
ఆ వెలుగుల విరజిమ్ములు
ఆ సందడి .....
ఆకాశం వాకిటిలో
వందల సంఖ్యలో
ఆ నక్షత్రాల సమూహాలు
నాకోసం నువ్వు
ప్రతిరాత్రి వేస్తూ ఉన్న
ఆకాశ చిహ్నాలు అనిపిస్తూ

 సమీపంలో

ఊపిరి విడిచిన క్షణం
మదిలో .... ప్రకాశం
తళుక్కుమని ....
అంతలో చీకటిలో లీనమై
ఆ చీకటిలో ....
ఓ శ్వాసానుభూతి నాలో
నీవు కదిలిన శబ్దం
దగ్గరవుతున్న అనుభూతి

 నీలివర్ణం దివ్యత

ఆమె కన్నుల్లో
అందాల దివ్యత్వం
నీలివర్ణపు స్పష్టత
వింత ప్రకాశం
విశ్వాసంతో
బంధించబడిన నన్ను
తీసుకెళ్లిందామె
ఆకాశ తారల వరకు

Friday, March 21, 2025

 నీ నీడను నేను 


నీ నీడలా నడవడం ఒక ఉల్లాసం లాంటిది 

నీ నీడలానే నడుస్తున్నాను

నిజం చెప్పాలంటే ....

నా భవిష్యత్తు గురించి నేను భయపడుతుంటాను. 

అందుకే నన్ను ....

నేను ఏర్పరచుకున్న గోడల వెనకాలే దాచేస్తాను.


కానీ 

ఆ గోడలు ఇసుకగోడల్లా విరిగిపోతున్నాయి.


నీలో ఏదో ఉంది. 

నా చుట్టూ నేను కట్టినగోడలు తట్టుకోలేని శక్తిలా 

నువ్వు వాటి మధ్యకు చేరిపోతున్నావు. 


నీవు నన్ను, నా ఆత్మను తాకేస్తున్నావు 

నిన్ను ఎలా ఆపాలో నాకు తెలీదు.


నువ్వు నా కళ్లలోకి చూస్తావు. 

అప్పుడు నేను ఓ పుస్తకంలా మారిపోతాను 

అది నీవు ఇంకా పూర్తిగా చదవలేని భాషలో రాయబడి 

 

బహుశ

నీకు ఎదురైన ea ప్రశ్నల సమాధానం కోసmoa 

అయ్యుంటుంది నీ నీడలా నడవడం ఉల్లాసం నాకు 


 చూస్తూ వింటూ నేను


చూస్తూ
ఉదయాన్నే వాకింగ్ కు వెళ్ళినప్పుడు,
నాలా నడుస్తూ మాట్లాడుకుంటున్న ఎందరినో
ఆకాశంలో ఎలాంటి ప్రయాస లేకుండా తేలిపోతున్న మేఘాల్ని
ప్రతి రోజూ ....
మనుషులు, జంతువులు, చెట్లలో పక్షులు
నిలబడి, నడుస్తూ ఎగురుకుంటుండటాన్ని
ఉదయాన్నే వాకింగ్ కు వెళ్ళినప్పుడు,
నా పక్కనే వేగంగా వెళ్తున్న కార్ల శబ్దాన్ని
పైన గగనతలంలో ఎగిరే విమానాల హోరుల్ని వింటూ
ఆడుకుంటున్న పిల్లల ఆనంద హర్షాల్ని
స్వేచ్ఛగా కదులుతూ నేను