Wednesday, January 9, 2013

|| నమ్మకం! ||

|| నమ్మకం! ||

ప్రకాశించకపోయినా,
సూర్యుడ్ని
తిరిగి పొందలేకపోయినా,
ప్రేమను
మౌనంగానే ఉన్నా,
దైవాన్ని ....

నమ్ముతున్నా!

Tuesday, January 8, 2013

|| ఎలివేషన్ ||



చూస్తున్నాను
అబద్దాల అంచుల్ని
నమ్మించాలని చూస్తున్న నీ ముఖభావాల్ని
వింటున్నా
వంచన పరాకాష్తను
తేనె పూసిన తియ్యని నీ మాటల శబ్ద తరంగాల్ని ....
నేను పక్కన ఉంటే నమ్మకం తోడుగా ఉన్నట్లే ఉంది అన్నావు.
నమ్మాను .... నిజమని
నీ ఆశల ఆకాశ హర్మ్యం ఆఖరి అంతస్థును
చేరేందుకు
ఎక్కిన మలి మెట్టును అవుతాను నేను అని అనుకోలేదు 
నీవు అన్నావు ఆనాడు .... నాకోసమే జీవిస్తున్నాను అని
నేను లేని మరణమే మేలు అని 
ఆనాటి నీ చేష్టలు
నమ్మిన నా అమాయకత్వం పిచ్చి ప్రేమ గుర్తుకు వొస్తూ
విరహ వేదన, సిగ్గు .... నన్ను .... లోలో చంపేస్తుంది నాలో.

( 09/JAN/2013 ---- 6.00AM )

Monday, January 7, 2013

ఉక్కిరిబిక్కిరౌతున్నా


ప్రకృతిచే విసర్జించబడి
నేనిక్కడ మాసిపోయి మెలుకువలో
నన్ను నేను ప్రశ్నించుకుంటూ ....
మరెంతకాలం ఇలా అని
సాధారణ మనిషిగా మారేదని
ఎంత సేపని .... నొప్పితో జీవించేదని
నీవెందుకు నాపై .... ప్రేమ వర్షమై కురువవు అని,

మొదటి సారి .... నిన్ను చూసినప్పుడు,
భూమ్యాకర్షణ శక్తి నన్ను పట్టుకోలేక
అంతకు మించిన ఆకర్షణ లా
జీవన సంతులనానివి లా కనిపించావు.
పెదవి విప్పి .... ఒక్క మాటైనా మాట్లాడకుండానే,
అందంగా విప్పారిన కళ్ళు .... రెపరెప లాడుతూ 
గుసగుసలు అద్భుతాలు ఎన్నో .... నీ గురించే,

రోజువారీ విషయాలు తలలో .... నీతో పంచుకోలేక, చెప్పుకోలేక
నీకు నా ప్రేమపై నమ్మకం లేదని తెలిసి
నన్ను నేనుగా వేసుకునే ప్రశ్నలు .... ఎన్నో
ఎన్నాళ్ళీ బాధాకరమైన ఈ ఒంటరి స్థితి అని,
ఆ రోజు నీవు ఇచ్చిన షాక్ రియాక్షన్
నేను "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అన్నప్పుడు
ఆ చూపుల నిర్లిప్తభావాలు మరువ లేను.
కానీ నీ ప్రేమలోనే ఉన్నాను .... మార్చలేక నన్ను నేను.

నేను నీ ముఖం లోకి చూస్తున్న ప్రతిసారీ .... ఎందుకో,
నా గుండె వేగంగా మరింత వేగవంతంగా కొట్టుకుంటూ
లెక్కించలేనంత వేగంగా శబ్దం .... శ్వాస వేగంగా
నీతో మాట్లాడే అవకాశం దొరికినప్పుడు
నాకు నేను వేరే లోకంలో ఉన్నట్లు,
అక్కడ, ఎలాంటి సంకోచాలు దాపరికాలు లేనట్లు,
కానీ ....
నాకు తెలుసు ఆ భావనల్ని .... నా కలల్ని
మినహాయిస్తే .... అంతా కృత్రిమము, నకిలీయే అని.

సమాధానం తెలిసీ తెలియనట్లు ఇలాంటివే
నా తలలో .... ఎన్నో ప్రశ్నలు!? కదులుతూ, పరుగులు తీస్తూ,
నాకు నేను విసర్జించబడి .... తల వాల్చినప్పుడు,
పిచ్చి ఆలోచనలు, పీడ కలలు
కళ్ళను కప్పేసిన .... గుండె స్పందనలు
నన్ను గానీ నీవు ప్రేమించ లేకపోతే
దూరంగా వెళ్ళిపో అని, నీతో చెప్పలేక చెప్పాలని
మరణించినా ఫర్లేదు వదిలెళ్ళు .... నా గుండెను అని.

పరిపూర్ణ ప్రేమ!

పొందు కోసం వెదుకుతున్నా 
ప్రేమసంపదలా .... నా కోసమే అన్నట్లు
ఇన్నాళ్ళకు కనిపించావు. 
రూపవతిలా నీవు

నన్ను, నీవు .... నిన్ను, నేను 
బలోపేతం చేసుకునేందుకు 
మరోరకంగా బలహీనులమై ఒకరిపై ఒకరు ఆధారపడేందుకు 
ఒకరి అబిలాష కోసం ఒకరం 
ఆవిరై, ఆత్మల తృష్ణను తీర్చుకునేందుకు ....

నాకు 
నీ కోరికల ఆంతర్యం తెలుసు 
నీకు నా ఉద్దేశ్యం మనోభావాలు తెలుసు 
నాలో అగ్ని నీవు నీలో అగ్ని నేను 
అస్థిమితంగా ఆబగా ఇద్దరం
....

ఒకరి కళ్ళలోంచి ఒకరు గుండెల్లోకి చూసి 
మండే మోహాగ్ని గుండాల్ని .... 
అర్ధం చేసుకుని, ఉపశమనం కోసం
ఆత్మల్ని స్పృశించుకుందాం! 
మండే ఆ బడబాగ్నిని చల్లార్చుకుందాం తోడుగా నిలిచి!

Sunday, January 6, 2013

పగిలిన పసి హృదయం!



చిన్ని హృదయం
బాధపడుతోంది నొప్పితో
మతిస్థిమితాన్ని కోల్పోయి
పగిలిన పసి గుండె
మరణాన్ని కోరుకుంటోంది.
చిదిమేసిన చిన్నారి హృదయం
ఏడుపులోనే ఉపశమనాన్ని పొందుతూ
తియ్యని బాధను
సలుపుతున్న హృదయ నివేదనను
నీతో చెప్పాలని, నీవు చూడాలని
పగిలి ముక్కలై స్థిమితపడలేని
పసి హృదయం
తనలో లోలో తానే కుళ్ళిపోతోంది ....
నీ ప్రేమ కోసం .... నీ స్పర్శ కోసం!

Saturday, January 5, 2013

|| ప్రేమే నేరం! ||



చరిత్ర లో అక్షరాలు .... గతం వాస్తవాలు.
ప్రేమ బిడియపు, తొలిచూపు ప్రణయాలు.
ఇష్టాలు, అవసరాలు సరిగ్గా ఒకేలా ప్రేమికుల్లో .... ఆనాడు
అనుకున్నాక అన్నీ సర్ధుకుపోయే అభిప్రాయాలు వారివి.

లోపరహితం గా తొలి కలయికలు .... జరగేవి.
దొరకని దొంగతనం .... ప్రేమ తొలి ముద్దు పట్టుబడని నిజాలు.
ముచ్చట్లు, షికార్లు, ముద్దు మురిపాలు బంధాలయ్యేవి .... ఆనాడు! 
క్షణమైనా ఒకరినుంచి ఒకరిని .... విడదీయలేనంతగా,

ఆమె, అతను .... ఒకరి అడుగులో ఒకరు .... జీవితం రహదారిలో
మనసులు కలిసి ఎదగడం .... పిల్లల్ని, పిల్లలపిల్లల్ని వీక్షించడం,
ఏ ముంగిట్లో చూసినా నవ్వులే .... జీవితాల్ని కథలుగా చెప్పడం,
చివరికి .... మరణానంతరం, పక్క పక్కన సమాధులై మిగలడం .... సంసారం!

ఎప్పుడూ ఒక్కరుగా
కలిసి,
ఎప్పటికీ విసుగు చెందని సాహచర్యం అది.
అందరికీ తెలుసు కారణం ప్రేమే అని నేరం ప్రేమదే అని,

Tuesday, January 1, 2013

ప్రేమ



మనస్సు మరియు గుండె 
రెండింటి జంట భావన 
ప్రేమ .... చూసే కళ్ళకు 

మరీ .... పరిశీలనగా చూస్తే 
దాని అర్ధం
లేని దాని కోసం గుండె చెందే ఆరాటం!

నవ్వకు దయ చేసి!



నేను అసహ్యించుకుంటున్నాను.
నీ ముఖం మీద నవ్వును,
నన్ను దుర్బలుడ్ని చేస్తున్న .... నీ ప్రతి చిరునవ్వును,
అసహ్యించుకుంటున్నాను.
మోసపు చిరునవ్వును, నిన్ను అసహ్యించుకోలేకపోయిన నా దౌర్బల్యాన్ని!

నేను నిన్ను ప్రేమిస్తున్నా!



ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తున్నాడు,
అతన్ని అతను కోల్పోయాడు.
ఒక పగిలిన హృదయం బాధతో రోధిస్తుంది
ఇక ఎప్పుడూ అది అతకదేమో అని