వెళ్ళిపోయాక నేను ఎలాగూ గుర్తుండను. ఉన్నప్పుడైనా మసకేసిన అస్పష్టతను కాకూడదనే .... ఈ మనో తపన నా ప్రాముఖ్యత మాత్రం అమూల్యమై అపహరించబడాల్సిన క్షణాల చుట్టే ....
నా అర చేతులు సున్నితంగా నీ ముఖాన్ని నిమిరి నేను నీ కళ్ళలోకి లోతుగా చూసిన క్షణాల జ్ఞాపకాల చుట్టే కొన్ని క్షణాలే అయినా నీవు నన్నెరిగి నేను నిన్నెరిగే క్షణాలు అవి. నీ శరీరం మృదుత్వం సున్నిత స్పర్శానుభూతి ఒక మసకేసిన అస్పష్టత అయినా నీకూ నాకు మధ్య
శరీరం పై దుస్తువులా కాని ఆచ్చాదనం ఆత్మీయతవై చేతికి చిక్కని సౌకర్యం వెన్ను వెచ్చదనానివై అప్పుడప్పుడూ బుగ్గపై పారే వేడి కన్నీటి ధార కానరానీయని పొడి గీతవై గోడ అంచున వెలుగు నవ్వుల తెల్లని దీప కాంతివై
మూసిన పెదవుల విరిసిన మందహాసం మాటవై తెరిచిన కన్నుల కనురెప్పల కనుపాపల లోతుల్లో నేను ఆక్షేపించలేని కళ వై నా హృదయ పరిమళానివై నిజం మానసీ ఎక్కడుంటే నిన్ను కోల్పోయే అవకాశం ఉండదొ నేను నాశనం చెయ్యలేనో అక్కడే ఉండి ఉంటూ నీవు నాకు కావాలి