Monday, July 30, 2018

ప్రతిద్వనులు



ఉక్కిరిబిక్కిరిని చేస్తూ ఉన్నాయి
నీ ఆలోచనలు
కత్తుల్లా నా చర్మాన్ని కత్తిరించేస్తూ

గుసగుసల్లా వినిపించీ పించని
ఏవో పదాలు
నీ మాటలు
ఎర్రని ద్రవం లా ప్రవహిస్తూ
కొట్టుకుపోతూ ఉన్నా .... ఆ ప్రవాహం ఒరవడి లో   

ఎరుపెక్కిన కళ్ళలోంచి రక్తం
బొట్లు బొట్లై 
కరకు రాతి నేలమీద
రాలి గడ్డకట్టుకుపోతుంది. 



వేటకుక్కల్లా నీ జ్ఞాపకాలు కొన్ని
వెంటాడుతూ ఉన్నాయి నన్ను ....
ప్రతి క్షణమూ అప్రమత్తమై 
ముని వేళ్ళమీద ఉండక తప్పడం లేదు.

అర్ధరాత్రి వేళ కూడా మంచమీద
మేల్కొని ఉండక తప్పడం లేదు. 

నీ ప్రేమ
ఒక గొప్ప ఔషధం అనుకునేవాడిని

ఎప్పుడు నీవు నా పక్కన లేకపోయినా
ఒక అనర్ధ ప్రయాస అనిపిస్తూ ఈ జీవితం
అది నా సిరలు దమనుల్లో
మాదకద్రవం ప్రవాహం అవుతుందనుకోలేదు.

Sunday, July 22, 2018

దురలవాట్ల శయ్య



రాక్షస పక్షి బొడ్డు కింద
వ్యసనాల ప్రాణినై 
వ్రేలాడుతున్నాను.
నేలను తాకలేక

అశక్తత
వింత అనాసక్తత
ప్రాణాలు పోతున్నట్లున్నా 

కాలం కాలి గోళ్ళ మధ్య
నలిగిపోతూ
ఊపిరి అందడం
దిక్కు తోచడం లేదు.

పైకి, ఇంకా పైకి ఆకాశం లోకి
మబ్బుల మధ్యకు
లాక్కుని వెళ్ళబడుతున్నా
శరీరం తేలికైపోతూ 


గాలి ఒరిపిడికి
మండుతున్నాయి కళ్ళు ....
కన్నీళ్లు కారుతూ
అయాచితంగానే

ప్రార్ధిస్తున్నాను.
పశ్చాత్తపరహితం గా
స్వేచ్చ కోసమో
సామాన్యత కోసమో మరి 

కానీ,  పోగొట్టుకున్న జీవితం
బలహీనతలు లక్ష్యంగా
కాలం
అగ్నిని ఉశ్వాసిస్తుంది.

నిర్దాక్షిణ్యంగా
నా వైపు
ఆబగా చూస్తూ

ఇప్పుడు
దాని దంతాల లాకెట్టు
నాకు
స్పష్టంగా కనిపిస్తుంది.

ఎవరు నిన్ను
నా నుండి రక్షిస్తారు
ఈరాత్రి ....
నేను విందు చేస్తుంటే అన్నట్లు

Friday, June 22, 2018

నిరీక్షణ



నీ కోసమే మౌనం గా
వేచి చూస్తూ ఉన్నా 
సహనం సన్నగిల్లిపోతూన్నా
గుండె చుట్టూ నీవు
నిర్మించుకున్న గోడల ద్వారాలు
తెరుస్తావేమో అని .....
ఆశతో నిశ్శబ్దంగా





ఈ భావోద్విగ్న మౌనవాసం లో
ఈ ఎదురుచూపుల ఏకాంతం లో
ఎంత కాలమో ....
ఇలా ఎన్ని ఆశ నిరాశల
సూర్యోదయ-అస్తమయాలో
ఎన్ని పరీక్షలో ....
కాలానికి మాత్రమే తెలిసిన
ఎన్ని నిర్లిప్తనిరీక్షణలో

Saturday, December 23, 2017

కుశలమా నీవు .....?




నా హృదయం
ఎలాంటి వెచ్చదనమూ దొరకక
అతిశీతలత్వంతో
గడ్డకట్టుకుని పోయింది.
భావోద్వేగ రహితమై
బాధ ఆనందాల
భేదం తెలియక
మన్నన ప్రేమలకు దూరమై 


సూదులతో పొడిచినా దిగని
తెగని కఠిన చర్మం ....
ఈ శరీరం శిలలా మారి
అనుభూతుల్లేవు .... నాలో
ఏ హాని భావనా కలగడం లేదు.
ఎంతటి బలమైన పదాలతో గుచ్చినా
భావోద్వేగాలు లేకే
శరీరానికి నొప్పి తెలియడం లేదు. 


ఔనూ! నిజంగా అక్కడ్నుండి
అంత దూరం నుండి
ఆకాశాన్ని కప్పేసిన
ఆ మబ్బు పొగల్లోంచి ....
నీవు నన్ను చూస్తున్నావా?
నేను అనుకోవడం లేదు.
భావోద్వేగ రహితుడ్నైన నాకు,
నా ప్రేమకు అంత శక్తుందని

Wednesday, December 13, 2017

అది భయమే కదూ



నిరాశ, వ్యాకులత మబ్బులు
అన్నివైపులా అలుముకున్న
భయానక ఉదాసీనత .... అది
కాలంతో పొరాడుతున్నట్లు
ముక్కలు ముక్కలై
రంద్రాల మయమైన శరీరంలొంచి 
వేలకొద్దీ ఆలోచనల శతృవులు
వెలికొచ్చి .... వెంటాడి 
బలవంతపు హత్యకు .... గురి
కాబోతున్నప్పుడు 



అది మరణమే, ఆ మరణం
అలసత్వానికి నిజాయితీకి ఉరి
స్వర్గ శిఖరం చేరినా తప్పని 
పరిక్ష, ఉరిశిక్షే
బూడిద అంటిన శరీరంతో పాటు
కళ్ళకు  బూడిద రంగు పులిమి
నిలువుగా శరీరాన్ని చీల్చినట్లు ....
నమ్మకం కోల్పోయిన ఆత్మ
విలవిలా రోధిస్తూ కేకలు వేస్తూ
అనాశక్తత తలదించేలా చేస్తే

Sunday, December 3, 2017

ఆమెకు తెలియాలి అని




ఆమెను నేను
అమితంగా
ఆరాధిస్తున్నానని 

ఒక నమ్మకాన్నై
ఒక బాసటనై 
ఒక తోడునై .....

ఆమెనే విశ్వసిస్తూ
చూసి గర్వపడుతున్నానని
సంభ్రమాశ్చర్య చకితుడనై 

ఒక సౌందర్యారాధ్యదేవత
ఇంతటి అద్భుత అస్తిత్వమా 
ఆమె అని ....

మనఃపూర్వక కృతజ్ఞత
అభివందనాలు చెబుతున్నా 
ఆ సృష్టికర్తకు .....

ఆమె స్థిరనివాసం .... ఇప్పుడు
నా గుండె అను ఆనందం
అనుభూతి పొందుతున్నానని

Saturday, November 18, 2017

నా సంసారం నీవు




నెమలి ఈక పై నున్నని
మృదు ప్రియత్వం
మెరుపువు .... నీవు 


మొక్కజొన్న కండెపై
పసిడి రంగు
అలంకారం .... నీవు 


స్పష్ట నీలి పారదర్శక
నదీ ప్రవాహం
తీరే దాహం .... నీవు 


సాయంత్రపు నీలి ఆకాశం
గాలి తెమ్మెరల
స్వచ్చ శ్వాసవు .... నీవు 


హృదయ భావనలు
నక్షత్రాల వరకూ
వ్యాపించిన శాంతివి .... నీవు 


అలజడి మానసానికి
ఉపశమనాన్నిచ్చే
పవిత్ర నిశ్శబ్దానివి .... నీవు 


ఊహలకందని
అద్భుత సౌందర్య
అయస్కాంతానివి .... నీవు 


నన్ను నేేను
కోల్పోయిన క్షణాల
విజ్ఞతవు .... నీవు 


భయం
అదుపులో ఉంచుకున్న
ఆత్మ స్తైర్యానివి .... నీవు 


నీ ఆఖరి క్షణం వరకు
నా తోడై ఉన్న
నా ప్రాణవాయువు .... నీవు

Wednesday, October 4, 2017

వైరమైనా దూరమైనా



ఇష్టమే నాకు అన్నావు 
మన మధ్య 
ప్రబలిన ఈ దూరం ఈ వైరం ....
తగ్గే అవకాశం కోసం 
ప్రయత్నిద్దాం అని  

కానీ, గుండె గోడల్లోకి 
యింకి
సిరల్లో కి 
ధమనుల్లోకి వ్యాపించిన 
రాగబంధం మనది  

అలా అనుకోవడం 
భ్రమేమో అనుకుని 
ఝటిలం చెయ్యొద్దని   
సమశ్యను 
సాగదీయొద్దన్నావు 


నీవే .... 

ఈ వైరం ను, 
ఈ దూరం ను సమాధి చేద్దాం! 
పెరక్కుండా ఉండేందుకు .... 
తప్పదనుకుంటే  
విడైనా పోదాం అన్నావు 

అలాగే జరిగింది. 
నీ కోరిక మేరకే  

ఇప్పుడు మనం 
ఒకరికి ఒకరం 
ఏమీ కాని 
నీడలం అయ్యాము 

కాన ఏదో వెలితి 
అస్పష్టత .... అది 
నీ ముఖం పై 
ఆ చిరునవ్వును చూసే 
అది నిజమా అని 

నా గుండెలో మాత్రం 
ఆరని అగ్ని అశాంతి .... 
జ్వాలలు రగులుతున్నాయి. 
నీ, నా హృదయ బంధం 
సమాధి చేయబడిందని  

Wednesday, September 6, 2017

న్యాయంగా ఆలోచిస్తే



భావోద్వేగం వూట ఊరి
బొట్లుబొట్లుగా జారుతుంటే
బహుశ
నీ ఉంగరాల జుట్టే
కారణం అనుకున్నా 

చెరువు వైపున
కిటికీలోంచి 
చల్లని గాలితెమ్మెరొకటి 
వెన్ను వద్ద తచ్చాడి
ఒళ్ళు జలదరించేంత వరకు 

నీవు నాదానవు

నీవే, అంతరాంతరాల్లో పెరిగే
భావొద్వేగాల మూలం అని 
పరీశీలించి తెలుసుకున్నా 
ఈ నిగూఢ ఉద్రిక్తతలన్నింటికీ
కేంద్రం నీ కళ్ళు అని