అతి సులభమే రాయడం కవిత్వం ద్యాసగా కళ్ళు మూసుకుని అసరళీకృతమైనా సరే అని రాస్తే
రాయాలి బాధ ఆవేశాలను చూసి అనుభూతి చెంది
నెమరువేసుకోవడాలు స్వయం జ్ఞాపకాలు జ్ఞప్తి తెచ్చుకుని ప్రతి రచనలోనూ తన్ను తాను ప్రతిష్టించుకోవడాలు నిఘంటుశోధనలు నానార్థ పదాలకై పరితపనలు లేకుండా
వ్యాకరణం భావ స్వేచ్చను .... ఆవేశాన్ని కట్టడి చేసి బాధ భావనానుభూతి ప్రవహించదు ముందుకు కదలదు ఎదగదు అక్కడే కూర్చుండిపోయి కేవలం అందంగా ఆంతర్యం తత్వరహితంగా మిగిలి మరిచిపోయే ఒక గతమైపోతుందే కాని
అందుకే ఒక్కసారి చదివి వెంటనే మర్చిపోయే ఎన్నో అసంఖ్యాక కాగితాలలో కాగితంలా మిగిలిపోని కథలు, కవితలు సాహిత్యం రాయాలని ఉంటే .... కేవలం కావ్య సరళి లోనే రాయాలని రాయడం మానెయ్యాలి