భావనలు, మది ఆలోచనల్లో ....
ప్రేమ జ్ఞాపకాలను మరిచిపోయే విఫల ప్రయత్నం
కొన్ని కన్నీటి చుక్కలు వేడిగా
ముఖంపై రాలి
నేను కోల్పోయింది
అమూల్యమని నాకు నేనే చెప్పుకునే ప్రయత్నం
ఒక జీవితకాలం
వద్దన్నా మరువలేని మనోవేదన
మనసారా కోరుకుంటున్నాను ఇప్పుడు
నిజంగా .... నిన్ను కలిసుండకుండా ఉండుండాల్సిందని.
జీవితం లోకి నిన్నాహ్వానించకుండా ఉండాల్సిందని.
బరువు, భారం భావనల్ని
మోస్తూ నా మదిలోనూ నిస్సత్తువ
కొన్ని మనోభావాలు .... నాలో,
నేనింకా నిన్ను కోల్పోలేదని
ఇంకొన్ని భావనల .... శూన్యం
నిన్నిక పొందలేదు నా హృదయం
ఈ జీవిత కాలమూ ఈ భావనల ఒత్తిడి భరిస్తూనే ఉండాలని.
నా మనోభావన నా కోరిక తెలుసా పిల్లా! .... నీవు తిరిగి రాకూడదు
నాడు నీవు నాకు కలిసుండకుండా ఉండాల్సింది అని
కొన్ని వేల భావనలు ఒక్కసారే ముసురుకుంటే కలిగే సంఘర్షణే ఈ కవిత. అయినా ఆ పిల్ల మిమ్ము వదలి వెళ్లదు ఎందుకంటే మీలోనే ఉంది కనుక.
ReplyDelete"కొన్ని వేల భావనలు ఒక్కసారే ముసురుకుంటే కలిగే సంఘర్షణే ఈ "గజిబిజి మనోభావనలు". అయినా, ఆ పిల్ల మిమ్మల్ని వదలి వెళ్తుందని ఎలా అనుకుంటున్నారు? వెళ్లదు. నిశ్చయంగా చెప్పగలను. ఎందుకంటే, ఆమె మీలోనే ఉంది కనుక." అన్న మీ స్పందన లో .... స్నేహ ఆత్మీయ ప్రొత్సాహక అభినందన .... పలుకరింపు బాగుంది.
ReplyDelete_/\_లు మెరాజ్ ఫాతిమా గారు!