నేను
ఒక విరిగిన
నిండీ నిండని పాత్రను
నేను
పున్నమి వెన్నెల
అప్రసన్నత లో పుట్టిన
ఒక అపనమ్మకం ఔన్నత్యం ను
నేను
చూసేవారికి
ఒక రోగిష్టి రూపాన్ని
మొండివాడ్ని
నేను
తరతరాల
చెడు మర్యాదల
కలవరపాటు అభివ్యక్తిత్వం ను
నేను
చీట్లువేసి,
పదుగురిలో ఒకడ్ని
శిక్ష విధించే సాధారణీకరణ
జ్ఞానశూన్యతకు ఆజ్యం ను
నేను
ఒక అసాధారణ
విలక్షణ శాస్త్రవైరుద్యాన్ని
నేను
మానసిక వ్యధ తో
రాలిపోబోతున్న
క్రుళ్ళి, పుచ్చిన శరీరాన్ని
నేను
ఒక దయ్యం
భూతం మారురూపాన్ని
కనీసం ఆరడుగుల లోతులో
పూడ్చెయ్యాలనిపించే మరణాన్ని
నేను
వైరాగ్యాన్ని
ఖచ్చితంగా
ఒక అంతిమ పోరాటాన్ని
నేను
పాపం పండిన
పరాకాష్టను
ఒక స్వరమేళన, ఏకతాళాన్ని
No comments:
Post a Comment