నిజం అంటే ఏమిటి అని
తెలుసుకోవాలి అని అనుకున్నాను.
నా చర్యలు, ప్రతిచర్యల అనుభవాలు కలిసిన వాస్తవం
నేనే సత్యము, నిత్యము
నిజము అని తెలుసుకున్నాను.
జీవార్ధం కారణం
తెలుసుకోవాలని అనుకున్నాను.
మనిషై పుట్టడం
శ్వాసించడము బ్రతకడమూ మాత్రమే కాదు.
మరణించీ జీవించడం లోనే
జీవితం ఉంది అని తెలుసుకున్నాను.
పోరాటం, సాహసం గురించి
తెలుసుకోవాలని అనుకున్నాను.
ఉన్నది ఉన్నట్లుగా కాక
ఉత్తమంగా మార్చుకునే దిశగా
అనుక్షణం సాహసం ఊపిరై జీవించగలిగితే
సాధ్యమే అని తెలుసుకున్నాను.
జాలి, దయ, కరుణ గురించి
తెలుసుకోవాలని అనుకున్నాను.
ఒకరి అవసరాలను అవకాశాలుగా అనుకూలంగా
మార్చుకోవడం మాత్రం కాదని
ఆదరించి సహకరించుకోవడం ద్వారా
సాధ్యం అని తెలుసుకున్నాను.
ప్రేమ, అనురాగం గురించి
తెలుసుకోవాలి అని అనుకున్నాను.
సాటి మనిషిని ఆదరించడం
అన్ని ప్రేమ రాగాలలోని ఔన్నత్యాన్ని గుర్తించడం
ప్రకృతి రాగం, ప్రేమను పరిమళించడంలో,
సర్వత్రా వ్యాపించడం లోనూ వుందని తెలుసుకున్నాను.
ఆ దేవుడు, ఈ సృష్టి గురించి
తెలుసుకోవాలని అనుకున్నాను.
నీరు, అగ్ని, గాలి,
ఆ ఆకాశం, ఈ నేల కలిసిన పరిపూర్ణత్వమే దైవత్వం ....
సృష్టి కి మూలం సహనం
నాలోనే, నేనే ఆ సంపూర్ణ మూర్తినని తెలుసుకున్నాను.
అయ్య భాబో... సాములోరు గీత చెప్పేశారు, అన్నీ తమరే అని నాకు ముందే తెలుసండీ...
ReplyDeleteఅయ్య బాబోయ్ .... సాములోరు గీత చెప్పేశారు, అన్నీ తమరే అని నాకు ముందే తెలుసండీ .... స్పందన స్నేహాభినందన.
Deleteమరీ పాటం చెప్పినట్లు ఉంది కదూ. నిజం చెప్పండి మెరాజ్ ఫాతిమా గారు నిజంగా బాగుందా కవిత.
స్పందనకు ధన్యాభివాదాలు!
పాటమే మరి, ఏమిచేస్తాం చేతులు కట్టుకున్నాం కదా..
ReplyDeleteపాటమే మరి, వినక తప్పుతుందా .... ఏం చేస్తాం చేతులు కట్టుకున్నాం అందుకే
Deleteబుద్దిమంతుడ్నో బుద్దుమంతుండ్నో
కవిత బాగుందన్నట్లో లేదన్నట్లో అర్ధం కాలేదింకా.
_/\_లు మాష్టర్నీ! సుప్రభాతం!