యౌవ్వనం ఆనందం రోజుల్లో
నీ కోసం రాసుకున్నప్రేమాక్షరాలివి.
ప్రతి అక్షరం
ఒక అద్భుత భావ రూపం ముక్కై,
ఆ ముక్కలన్నీ ఒక్కటై కూరి, నా హృదయం అయ్యి,
జీవితం నాకు నేర్పిన లౌక్యం
సిగ్గు, బాధ, కోపం, ఆనందం నటనతో .... నీ ప్రశంసలు సంపాదించాలని.
మృదువైన నీ పాదాలు,
నీవు నడవడం కోసం ఒక కాలిబాటలా,
నా ఆత్మ ఎర్ర తివాచీ అయి పరుచుకుని
నీవు జారిపోకుండా అన్ని వైపులా ఒద్దికగా అమరాలని రాసుకున్నాను.
కానీ, ఇప్పుడు .... లేత పూలు నా అక్షరాలు
ఒక సమాధి పై నిస్సహాయంగా వెదజల్లబడుతున్న కన్నీరయ్యాయి.
ప్రేమను తిరిగి చెల్లించు అనని, అపజయం అనుకోని
తోడు లేని, ఈ సుదీర్ఘ బాధామయ జీవనం కూడా
గెలుపే అనుకుంటూ,
ప్రేమ భావనలను అలా పరుస్తూనే, గుసగుసలాడుతూనే ఉన్నాను.
చెల్లాచెదురుగా పరుస్తూ ఆ వడలిన పుష్పాలను,
ఎవరూ వినని నమ్మని ఈ ప్రేమ భావనల పదాలను.
No comments:
Post a Comment