Friday, October 25, 2013

ఇద్దరొక్కటయ్యారు కానీ,


ప్రాకి, పోర్లాడి .... జరుగుతూ
వచ్చాడు అతను.
తన గంభీర,
తీవ్ర పదజాలంతో మది....లోకి.

మనసును సంబోధించి
అభిభాషిస్తూ,
ఆమె గుండె గోడలపై
అన్ని వైపులా తన జాడలు ముద్రిస్తూ,

అతనికి మాత్రమే తెలుసు.
ఆమె ఆనందంలో
తన ఆనందం ఎక్కడో ....
ఆలోచనల్ని ఏకం చెయ్యడం ఎలానో.

2 comments:

  1. మంచి భావుకత ఉంది. మరో మారు చండీదాస్ (అనుక్షణికం) గుర్తొచ్చారు

    ReplyDelete
    Replies
    1. మంచి భావుకత ను, మరో చండీదాస్ (అనుక్షణికం) ను చూడగలిగారు. గర్వంగా ఉంది. మీ దృష్టి కోణాన్ని అరువుగా తీసుకోవాలనుంది.
      _/\_లు మెరాజ్ ఫాతిమా గారు!

      Delete