హృదయం అద్దం లో చూస్తున్నా!
..............
రంగుల ఎడారి యాత్రికుల్లా,
స్వచ్ఛంద ఖైదీల్లా,
ఒక స్ఫటికాకార వంతెన పై ....
నడుస్తున్న దేవదూతల్లా,
ప్రతిదీప్తకాంతి దశల్ని లెక్కించే ....
గాందర్వ ఉత్ప్రేక్షకాల్లా నీవూ, నేను
నిర్లిప్తానందవాదం కోట మీంచి ....
దూరంగా నడిచే బావ వీచికల్లా,
స్వచ్చందంగా, ఆ మరపురాని పొరల
రహస్య పరిమళాలను భద్రంగా దాచుకుంటూ,
...............
మనము కాని ఇతరులంటే అర్ధం నరకం అని
నిష్కాపట్యముగా అంగీకరిస్తూ,
ఒక్క, నేనూ మనం అనే స్వర్గం లోనే ఉండాలని కోరుకుంటూ,
అవ్యక్తమైన ఊహాతీత భావ ప్రకటనల ఉద్వేగ బరిత కవిత ఇది.
ReplyDeleteప్రతి పదానికీ అర్దం తెలుసుకొవటం వీలుకాదు,
అది కవి ఉన్న అప్పటి పరిస్థితిని తెలియజేస్తుంది.
మీ కవితల్లో ఏదో తెలీని వేదన వినిపిస్తూ ఉంటుంది,
బహుశా అది మీకూ తెలీకపోవచ్చు.
"అవ్యక్తమైన ఊహాతీత భావ ప్రకటనల ఉద్వేగ భరిత కవిత ఇది. ప్రతి పదానికీ అర్దం .... కవి ఉన్న అప్పటి మనస్థితిని తెలియజేస్తుంది.
Deleteమీ కవితల్లో ఏదో తెలీని వేదన వినిపిస్తూ ఉంటుంది, బహుశా అది మీకూ తెలీకపోవచ్చు."
ప్రతి కవికి, కవయిత్రికీ ఇది ఒక అనివార్య స్థితి అనుకుంటున్నాను. తను చెప్పాలనుకున్న భావానికి అక్షర కూర్పు చెయ్యడం సాధారణం. కానీ అప్పుడప్పుడూ, ఉద్వేగము భావమోహానికి లోనే అక్షరాలు స్రవించడం జరుగుతుంది. కవయిత్రి భావన, విశ్లేషణతో మూడొంతులు ఏకీభవిస్తున్నాను.
ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు!