నా కలలో నా ప్రేమ .... నాదే ఆమె
కల కాని నిజం ఆ కల
పలికిన ప్రతి పలుకు శాసనమే
పళ్ళ బిగువున ఒక గులాబీ ఆకు
మంచుబిందువును పట్టుకుని ఉన్నట్లు
ఆ దాహం తీర్చగలనో లేనో ....
ఓ గులాబీ! ఓ చిన్ని హృదయమా
జాగ్రత్తగా కాపాడుకో....నీ ఆశ పరిమళం
త్రాగాలనే తొందరలో మంచుబిందువును
ఎన్నో గులాబీల 'భాగస్వామ్యాన్ని.
ఏమి చెప్పాలి ఈ భావుకతను, మరో మారు క్రిష్న శాస్త్రి పలికినట్లుంది. మంచు బిందువు గులాబీ తో విన్నవించుకోవటం ఎక్కడైనా విన్నామా, సోయగాలు పోయినట్లు అనిపించినా గులాబి కటినమైనదే మంచు బిందువు చాలా సున్నితమైనది సుమా....సర్, ఈ కవితకు నా వాఖ్య న్యాయం చేయలేక పొతుంది.
ReplyDeleteఏమి చెప్పను ఈ భావుకతను, మరో మారు క్రిష్ణ శాస్త్రి పలుకుల్లా .... మంచు బిందువు గులాబీ తో విన్నవించుకోవటం ఎక్కడైనా విన్నామా, సోయగాలు పోయినట్లు అనిపించినా గులాబి కటినమైనదే .... మంచు బిందువు చాలా సున్నితమైనది సుమా!....
ReplyDeleteసర్, ఈ కవితకు నా వ్యాఖ్య న్యాయం చేయలేక పొతుంది.
సామాజిక ఇతివృత్తాలతో బడుగు, బీద, నిరుపేద, నిరాశ్రయ జీవితాల్ని వస్తువుగా అక్షర చైతన్యం పల్లవించే కవయిత్రి స్పందనను వ్యాఖ్యను ఒక గొప్ప కాంప్లిమెంట్ గా .... దాచుకుంటాను. ధన్యమనోభివాదాలు ఫాతిమా గారు.