ఒకరి ఇష్టం వొకరికి అయిష్టం.
ఆమె నాకిష్టమే అంది చివరికి. అతని ఇష్టాన్ని గౌరవించి,
ఆమె గుండెలో మంటలు రగులుతాయని తెలిసీ.
కలిసుండలేమని తెలిసి తప్పుడు భ్రమ లో నడవడం అవసరమా ....
విడిపోయి దగ్గరౌదాము, అదే యిద్దరికీ మంచిది అన్నాడు.
దూరమైపోయారు.
అతని ముఖాన పంతం నెగ్గించుకున్న నవ్వు
ఆమె ముఖాన తొందరపడి మనసు కోల్పోయిన మబ్బు.
నిజంగా జీవితం ఎంత చిన్నది!?
సమ న్యాయం (సమన్నయం ) కాదేమో..???
ReplyDeleteకొన్ని కొన్ని సందర్భాల్లో కొందరి స్వార్ధం చూసినప్పుడు అనిపిస్తుంటుంది .... స్వల్ప జీవితం, పొందని సౌఖ్యం కోసమా అని
Deleteధన్యవాదాలు ఫాతిమా గారు!