Friday, October 18, 2013

ఓదార్పు!

కన్నీళ్లు కోల్పోయిన 
ఆ క్షణాలని మరిచిపోలేను.
చెంప పైకి జారిన చెమ్మ 
అనుభూతిని .... గమనించి తుడిచేసే లోపే  
నా ఆత్మ నిలువెల్లా తడిసిపోయింది.
సరిగ్గా, 
ఆ క్షణాల్లోనే మేఘాలమీంచి దూకి
పరామర్శించేందుకన్నట్లు 
ఆ ఓదార్పు వర్షం జల్లులా కురిసింది.
ఆ వెచ్చదనం వర్షం లో నడుస్తున్నప్పుడు 
ఆ అభిరుచి లో 
ఆ స్నేహరాగం లో నేను నానిపోయాను.
నా శరీరం పై మమైకం అవుతూ 
వర్షం జల్లులు. నా కన్నీళ్ళు మధ్య 
ఒక రసాయనిక చర్యలో 
నా సిరలు వేడెక్కి 
మోహ భావనలేవో నా ఎదను హత్తుకుని 
సమ ఆవేశం .... 
కన్నీరు, వర్షం పన్నీరైనట్లు
ఏదో వెచ్చని అనుభూతి
కళ్ళు మూతలు పడి, 
కోరికల గమ్యం దిశ లో తడుస్తూ .... నేను.

2 comments:

  1. ఆత్మీయ స్నేహ హస్తం కొసం మీరుపడిన తపన మీ కవిత తెలియజేస్తుంది.
    సర్, చక్కటి కవిత.

    ReplyDelete
    Replies
    1. ఒక ఆత్మీయ, స్నేహ హస్తం కొసం భావుకుడు పడిన తపనను తెలియజేస్తుంది ఈ కవిత.
      ఒక, చక్కటి కవిత. ....
      ఒక చక్కటి అభినందన స్పందన
      ధన్యాభివాదాలు మెరాజ్ గారు!

      Delete