నేను,
నాటుసారాయి తాగిలేను.
నల్ల మందు ప్రేరణ లో లేను.
నా మనసు తపనంతా ....
ఒక అగ్నికణం,
ఒక మెరుపు,
ఒక ప్రాణం, జ్ఞానం
ఎలా జాగృతం అవుతాయో
తెలుసుకోవాలని.
నా ఉత్సాహం
ఊహకందనంత ఎత్తులో
అంచనాలు, అవధులు దాటి
గాలిలో, ఇంద్రధనస్సులా,
ఆ ఆకాశం తెరపై అల్లుకుపోతూ,
ఆ ప్రేరణకు కారణం,
ఆ జీవం .... ఆ విధ్యుల్లత నేనే!
ఇంతటి వెలుగు జగమంతా కావాలి
ReplyDelete"ఆ వెలుగుతో జగమంతా నిండాలి .... "
Deleteఒక మంచి ఆకాంక్షే స్పందనగా స్నేహాభినందన
ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు! సుప్రభాతం!
నా మనసు తపనంతా ....
ReplyDeleteఒక అగ్నికణం,
ఒక మెరుపు,
ఒక ప్రాణం, జ్ఞానం
ఎలా జాగృతం అవుతాయో
తెలుసుకోవాలని...... నాకు అనిపిస్తుంది ఇలా
"నా మనసు తపనంతా ....
Deleteఒక అగ్నికణం, ఒక మెరుపు, ఒక ప్రాణం, జ్ఞానం .... ఎలా జాగృతం అవుతాయో తెలుసుకోవాలని...... "
నాకూ అనిపిస్తుంది అలానే!?
ఏకీభావన ఒక అందమైన ఆశ మంచి మనోభావనే స్పందనగా అభినందన
కృతజ్ఞతలు పద్మార్పిత గారు! శుభోదయం!