Wednesday, April 1, 2020

భావ....శాస్త్రం





నాక్కావలసింది
నే పరిగణించేది .... 


చంద్రుడిని
ముద్దాడాలని
ఎగసే
తరంగం
పూర్ణత కాదు 


ఆ చంద్రుడు
ముద్దాడాలనుకునే
పూర్ణత
ఈ రక్తం లో
ఈ శరీరం లో 


ఈ శరీరం రాసిన
కవిత్వం అది 


కాగితం కలం
సిరా అక్కర్లేని
అదే కవిత్వం
నా భావ....శాస్త్రంలో

అగమ్యుడ్ని




ఇక్కడివాడినే

కానీ

పర్యాటకుడ్నిలా
తిరుగుతున్నాను

ఏది ఎక్కడో
దేన్ని ఎలా చేరాలో
తెలుసుకోవాలనుంది .... 
స్థానికుల్ని అడిగి

నిజానికి
నన్ను నేను
పారేసుకున్నాను

ఇక్కడే ఎక్కడో

ఎక్కడో
ఏ తెలియనిచోట

తెలుసుకుని
వీలైతే
పొందుదాము అని